Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘ఉదయ్‌పుర్‌ ఫైల్స్‌’ రిలీజ్‌పై స్టే.. సుప్రీంకోర్టుకు దర్శకుడు!

    ‘ఉదయ్‌పుర్‌ ఫైల్స్‌’ విడుదలపై ఒక్కరోజు ముందు స్టే విధించడం ఊహించలేదని ఆ చిత్ర దర్శకుడు ఎస్‌.భరత్ అన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. ‘‘మా సినిమాని నిలిపివేయాలంటూ సుప్రీంలో ఓ పిటిషన్‌ దాఖలు కాగా అది తిరస్కరణకు గురైంది. ఢిల్లీ హైకోర్టు మాత్రం స్టే ఇచ్చింది. అలా ఎలా జరిగిందో నాకు తెలియదు. దీనిపై మేం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం’’ అని అన్నారు.

  • ‘ఓ భామ అయ్యో రామ’ మూవీ రివ్యూ

    సుహాస్-మాళవిక మనోజ్‌ జంటగా రామ్‌ గోదల తెరకెక్కించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం. (రివ్యూ)

  • ‘VISA: వింటారా సరదాగా’.. ఫస్ట్‌లుక్ రిలీజ్

    అశోక్ గల్లా-శ్రీగౌరి జంటగా నటిస్తున్న చిత్రానికి ‘VISA:వింటారా సరదాగా’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఉద్భవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈమూవీ టీజర్‌ను జూలై 12న ఉ.10.53గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. రాహుల్ విజయ్, శివాత్మిక ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.

  • మోడ్రన్ డ్రెస్‌లో మెరిసిన మెగా డాటర్!

    మెగా డాటర్ నిహారిక మోడ్రన్ లుక్‌లో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ కలర్‌ఫుట్ డ్రెస్‌లో మెరుపులు మెరిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతోంది.

  • బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్లు.. వారికి నోటీసులు?

    బెట్టింగ్‌ యాప్‌ల కోసం ప్రమోషన్ల వ్యవహారంలో మనీ లాండరింగ్‌ జరిగిందనే కోణంలో ఈడీ రంగంలోకి దిగింది. 29 మంది సినీనటులు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఈసీఐఆర్‌ నమోదు చేసింది. బెట్టింగ్‌ నిర్వహకులతో కుదుర్చుకున్న అగ్రిమెంట్‌ కాపీలను ఇవ్వాలని ఈ 29 మంది సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యాడ్‌ ఏజెన్సీలు, బెట్టింగ్‌ యాప్‌ యజమానులు, విజయ్‌ దేవరకొండ, రానా, ప్రకాశ్‌ రాజ్‌, మంచు లక్ష్మీతో సహా ఇతరులను విచారించనుంది.

  • ఆకట్టుకునేలా ‘ధడక్‌ 2’ ట్రైలర్‌

    జాన్వీ కపూర్‌ తొలి సినిమా ‘ధడక్‌’. విజయవంతమైన ఈ రొమాంటిక్‌ ఫిల్మ్‌కు సీక్వెల్‌గా ‘ధడక్‌ 2’ రూపొందింది. ఇందులో సిద్ధాంత్‌ చతుర్వేది, త్రిప్తి డిమ్రి జంటగా నటించారు. షాజియా ఇక్బాల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 1న బాక్సాఫీసు ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ జోడీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

  • సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ!

    శ్రద్ధా శ్రీనాధ్‌, కిశోర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘కలియుగం-2064’ ప్రమోద్‌ సుందర్‌ దర్శకత్వంలో రూపొందింది. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం మే 9న విడుదలైంది. ఇప్పుడీ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. 2064 సంవత్సరంలో ఈ మానవాళికి ఏమవుతుంది.. ఎలాంటి మార్పులు సంభవిస్తాయి? అనే విషయాల్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కించారు.

  • నవ్వులు పంచే ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌-2’ ట్రైలర్‌!

    2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చి నవ్వులు పంచిన సినిమా ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌’. దీనికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న సినిమా ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌-2’. విజయ్‌ కుమార్‌ అరోరా దర్శకుడు. అజయ్‌ దేవగణ్‌, మృణాల్‌ ఠాకూర్‌ ప్రధానపాత్రల్లో నటించిన ఈ సీక్వెల్‌ జులై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

  • తొమ్మిది నెలలుగా ఇంట్లోనే నటి మృతదేహం!

    పాకిస్థాన్ నటి హుమైరా అస్ఘర్‌ అలీ మృతి కేసులో కీలక విషయం వెల్లడైంది. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా ఆమె తొమ్మిది నెలల క్రితమే ప్రాణాలు కోల్పోయి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పూర్తిగా కుళ్లిపోయి, ఎముకలు బయటపడిన స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైంది. నటి ఉంటున్న అంతస్తులో మరో ఫ్లాట్ ఖాళీగా ఉండటంతో మృతదేహం నుంచి వచ్చిన దుర్వాసనను ఎవరూ గుర్తించలేకపోయారని పోలీసులు చెబుతున్నారు.

  • అందుకే నా సినిమాలో హిందీ పాట పెట్టాను: పవన్

    హిందీ భాషపై తనకు అపారమైన గౌరవం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో జరిగిన రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘సౌత్ సినిమాలకు హిందీ భాష వల్ల 30శాతం ఆదాయం వస్తోంది. అలాంటిది హిందీని నేర్చుకోవడానికి మనకు అభ్యంతరమేంటి?. హిందీ భాషపై నాకున్న ప్రేమతోనే నా ‘ఖుషీ’ సినిమాలో హిందీ పాటను పెట్టాను’’అని పేర్కొన్నారు.