డైరెక్టర్ నితీశ్ తివారి తెరకెక్కిస్తోన్న ‘రామాయణ’ సినిమాలో హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కనిపించనున్నారు. అయితే, రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా మొదటిభాగంలో ఆయన పాత్ర సమయం చాలా తక్కువగా ఉండనున్నట్లు సమాచారం. 15 నిమిషాలు మాత్రమే కనిపిస్తారట. రెండో భాగంలో ఆయన పాత్రే కీలకం కానున్నట్లు తెలుస్తోంది. పార్ట్ 2లో ఎక్కువసేపు కనిపించనున్నారట.