పెళ్లిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు నటి శ్రుతి హాసన్. వివాహానికి అవసరమైన నిబద్ధత, విధేయతలను తాను నమ్ముతున్నానని, కానీ వివాహం అనే ఆలోచన తనను ఓ శిలలా మారుస్తుందని చెప్పారు. గతంలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని తాను అనుకున్నానని, కానీ అది ఫలించలేదని తెలిపారు. తాను ప్రస్తుతం ఒంటరిగా ఉన్నానని, ఏకాంతంలో హాయిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
ఆ ముగ్గురిని ఒకరితో ఒకరిని పోల్చలేం: శ్రుతి హాసన్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనకరాజ్ కాంబోలో వస్తున్న సినిమా ‘కూలీ’. ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు నటి శ్రుతి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ ,కమల్ హాసన్, రజనీకాంత్‌లను ఒకరితో ఒకరిని పోల్చలేమని శ్రుతి అభిప్రాయపడ్డారు.
-
విలన్ రోల్ చేయనున్న రష్మిక?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో ఓ సినిమా రానుంది. ఈ సినిమాలో రష్మిక నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లని, అందులో రష్మిక ఒకరని సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో దీపిక, మృణాల్, రష్మిక, జాన్వీ, భాగ్యశ్రీ పేర్లు వినిపిస్తున్నాయి. రష్మిక పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని, యాక్షన్ సీన్సూ చేస్తారని సమాచారం.
-
‘ఆ మాటతో తొమ్మిది సినిమాల నుంచి తీసేశారు’
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఓ ఇంటర్వ్యూలో తన సినీకెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాల్ని పంచుకున్నారు. ‘‘నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినకొత్తలో మోహన్‌లాల్‌తో కలిసి ‘చక్రం’ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ అనూహ్యంగా అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆ సినిమా ఆగిపోవడానికి నేనే కారణమంటూ ఐరన్ లెగ్ అన్నారు. వెంటనే నేను ఒప్పుకున్న తొమ్మిది ప్రాజెక్ట్‌ల నుంచి నన్ను తొలగించారని’’ వెల్లడించారు.
-
నితిన్ ‘తమ్ముడు’ నుంచి ఫస్ట్ వీడియో సాంగ్ రిలీజ్
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీలోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ’ అంటూ చిన్నారితో కలిసి నితిన్ సందడి చేశాడు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, అక్షిత ఆలపించగా.. అజనీష్ లోకనాథ్ స్వరాలు సమకూర్చారు.
-
ప్రభాస్ గ్రేట్ యాక్టర్: సంజయ్ దత్
ధ్రువ సార్జా హీరోగా దర్శకుడు ప్రేమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కేడీ: ది డెవిల్’. శిల్పా శెట్టి, సంజయ్ దత్ కీలకపాత్రలు పోషించారు. ఇవాళ టీజర్ లాంచ్ చేశారు. ఈ నేపథ్యంలో సంజయ్ దత్‌ని.. ప్రభాస్ గురించి ఏమైనా చెబుతారా అని అడగ్గా అతను స్పందింస్తూ.. ‘‘ప్రభాస్ గ్రేట్ యాక్టర్. ఫుడ్ ఎక్కువగా పెడతాడు. చిరంజీవి కూడా నాకు ఇష్టం. ఇద్దరితో మంచి అనుబంధం ఉంది’’ అని సమాధానమిచ్చాడు.
-
సెలబ్రిటీలపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం
TG: బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తూ, బంధుత్వాలను మరిచి, చోరీలు, నేరాలు, తల్లిదండ్రుల హత్యలకు కారణమవుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన సెలబ్రిటీలే ప్రధాన కారకులని సజ్జనార్ ప్రశ్నించారు.
-
మీసం మెలేస్తున్న ‘వీరమల్లు’.. కొత్త పోస్టర్!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరో నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్ మీసం మెలేస్తున్న ఈ ఫొటో ఫ్యాన్స్‌కు కిక్కిస్తోంది. ఏఎం రత్నం నిర్మిస్తోన్న ఈ హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్‌లో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. జులై 24న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కానుంది.