Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • నిర్మాతగా కిరణ్ అబ్బవరం.. ఆసక్తికర టైటిల్!

    హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా తన ‘క’ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. దీనికి ‘తిమ్మరాజుపల్లి TV’ అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. వి.మునిరాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రలో సాయితేజ్, వేదశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగే ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

  • సూపర్ 4K టెక్నాలజీతో ‘అతడు’ రీ-రిలీజ్

    సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘అతడు’ చిత్రం మళ్లీ థియేటర్లలకు రానుంది. ఈ మూవీని సరికొత్త సూపర్ 4K టెక్నాలజీతో ఆగస్టు 9న రీ-రిలీజ్ చేయనున్నారు.

     

  • మోడ్రన్ డ్రెస్‌లో పాయల్ అందాలు!

    RX100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హాట్ లుక్‌లో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిన తన ఫోటో నెట్టింట వైరలవుతోంది.

     

  • ప్రముఖ యాంకర్ కేఫ్‌పై కాల్పులు

    ప్రముఖ యాంకర్, కమెడియన్ కపిల్ శర్మ కాప్స్ కేఫ్‌పై ఖలీస్థానీ వేర్పాటు వాదుల కాల్పులకు తెగబడ్డారు. భార్య గిన్నితో కలిసి కెనడాలోని సర్రేలో కపిల్ ప్రారంభించిన కేఫ్‌పై NIA మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హర్జిత్ సింగ్ అనుచరులు జులై 9 రాత్రి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కానీ కేఫ్‌లొ చాలా భాగం దెబ్బతింది. బుల్లెట్ గుర్తులు భవనంలోని వస్తువులపై కనిపించాయి.

  • ఈ వారం ఓటీటీ చిత్రాలివే!

    ఈ వారం ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమైయ్యాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

    • నెట్‌ఫ్లిక్స్‌:‘ఆప్‌ జైసా కోయి’,‘8 వసంతాలు’(జులై11)
    • సన్‌నెక్స్ట్‌: ‘కలియుగం 2064’ (జులై 11)
    • సోనీలివ్‌: ‘నరివెట్ట’(జులై 11)
    • ఆహా: ‘శారీ’ (జులై 11)
    • ఈటీవీ విన్‌: ‘సంతోషం’ (స్ట్రీమింగ్‌ అవుతోంది)
    • జియో హాట్‌స్టార్‌: ‘మూన్‌ వాక్‌’ (స్ట్రీమింగ్‌ అవుతోంది’

  • ఆత్మ మేల్కొంది.. ఓటీటీలోకి హారర్‌ కామెడీ మూవీ!

    సంజయ్‌ దత్, మౌనీ రాయ్, సన్నీ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్‌ కామెడీ మూవీ ‘భూత్‌నీ’. సిద్ధాంత్‌ సచ్‌దేవ్‌ దర్శకత్వం వహించారు. మే 1న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. జీ5 ఓటీటీతో పాటు, జీ సినిమాలోనూ ఒకేసారి జులై 18న స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ వేదిక అప్‌డేట్‌ను పంచుకుంది.

  • చిరు ‘విశ్వంభర’ నుంచి క్రేజీ అప్‌డేట్!

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈమూవీ సెట్స్‌లోని ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో దర్శకుడు వశిష్ఠ.. మెగాస్టార్‌కు సీన్ వివరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ‘విశ్వంభర’ను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.

  • ధృవ సర్జా ‘కేడీ’.. యాక్షన్ టీజర్ అదిరింది!

    కన్నడ స్టార్ ధృవ సర్జా హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కేడీ: ది డెవిల్‌’. ప్రేమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంజయ్‌దత్‌, శిల్పాశెట్టి, రవిచంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం హిందీ భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలకానుంది. ఈనేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు.

  • ‘ధనుష్‌ 54’ షురూ.. ఆసక్తికరేపుతున్న ఫస్ట్‌లుక్!

    కోలీవుడ్‌ హీరో ధనుష్‌ తన నెక్ట్స్ సినిమా కోసం పూర్తి రూరల్‌ బ్యాక్‌ డ్రాప్‌ కథను ఎంచుకున్నాడు. విగ్నేష్‌ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ధనుష్‌ 54వ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో కాలిపోతున్న పత్తి చేనులో ధనుష్‌ తల దించుకొని ఉన్నాడు. కాగా నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది.

  • ‘మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు’

    మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని హీరో సిద్ధార్థ్‌ అన్నారు. ‘3BHK’కి వస్తున్న స్పందన చూస్తే ఈ విషయం స్పష్టమవుతోందన్నారు. సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని కీలక పాత్రల్లో నటించిన చిత్రమే ‘3BHK’. దర్శకుడు శ్రీగణేశ్‌ తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాని.. నటుడు సిద్ధార్థ్‌ హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి వీక్షించారు.