Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘సీతా పయనం’.. ఫస్ట్‌ సాంగ్ రిలీజ్‌

    తన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్‌గా నటుడు అర్జున్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘సీతా పయనం’. ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ‘ఏ ఊరికెళతవే పిల్లా’ లిరికల్‌ వీడియోను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ సాంగ్‌ను రాహుల్ సింప్లిగంజ్, మధు ప్రియ ఆలపించగా.. అనుప్ రుబెన్స్ సంగీతం అందించాడు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • ‘ది ప్యారడైజ్’.. నానికి విలన్‌ ఇతడే!

    నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఇందులో విలన్‌గా నటుడు రాఘవ్ జుయల్ నటించబోతున్నాడు. తాజాగా ఆయన షూటింగ్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే నేడు రాఘవ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది.

  • నా కొడుకు.. డౌన్ టూ ఎర్త్: అమీర్ ఖాన్

    తన పిల్లలు తమ స్వంత కెరీర్‌లపై దృష్టి సారించి, తన సంపదను అనుభవించకుండా స్వతంత్రంగా ఉన్నారని ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ వెల్లడించారు. జునైద్ ఖాన్ స్టార్‌డమ్ నుంచి దూరంగా ఉండి, తన నటన, కృషి ద్వారా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. జునైద్‌కు సొంత కారు కూడా లేదని, తాను ఎన్నోసార్లు తన కారు వాడుకొమ్మని చెప్పినా వినడని, సాధారణ రవాణాను ఉపయోగిస్తాడని పేర్కొన్నారు.

  • విడాకుల రూమర్స్‌పై స్పందించిన నయనతార!

    కోలీవుడ్ జంట నయనతార-విగ్నేష్ శివన్‌ విడిపోనున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా నయన్ స్పందించి ఓ పోస్ట్ పెట్టింది. ‘‘మా గురించి వచ్చే సిల్లీ న్యూస్‌ చూస్తే మా రియాక్షన్‌ ఇలాగే ఉంటుంది’’ అంటూ తన భర్తతో ఉన్న ఓ ఫొటో పోస్టు చేసింది. దీంతో ఒకే ఒక ఫోటోతో విడాకుల వార్తలకు ఆమె చెక్ పెట్టినట్లయింది.

  • టీవీలోకి ‘డాకు మహారాజ్’.. ఏ ఛానల్‌లో ఎప్పుడంటే?

    బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన మూవీ ‘డాకు మహారాజ్’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాదు ఓటీటీలో కూడా మంచి వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా వరల్డ్ టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ‘స్టార్ మా’ ఛానల్‌లో జులై 13న సా.6గంటలకు ప్రసారం కానుంది. ఈ మేరకు ‘స్టార్ మా’ పోస్టర్ రిలీజ్ చేసింది.

  • ‘నరివెట్ట’.. ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి!

    టొవినో థామస్‌ కీలకపాత్రలో నటించిన యాక్షన్‌ డ్రామా మూవీ ‘నరివెట్ట’. కేరళ బాక్సాఫీసు వద్ద పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్న ఈ సినిమా ‘సోనీలివ్‌’ వేదికగా ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్‌ కావాల్సి ఉంది. అయితే ఒక రోజు ముందుగానే ‘నరివెట్ట’ను సోనీలివ్‌ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ ఆడియోతో ఈ సినిమాను చూడవచ్చు.

  • బేబీ బంప్‌తో మెగా కోడలు.. ఫొటో వైరల్!

    మెగాకోడలు లావణ్యత్రిపాఠి త్వరలో తల్లి కాబోతుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటో నెట్టింట వైరలవుతోంది. ఇందు‌లో బేబీ బంప్‌పై చేయి పెట్టుకొని కనిపిస్తోంది.

  • ‘‘దొరసాని’ కోసం ఆ షో నుంచి ఎంతో నేర్చుకున్నా’

    తన తొలి చిత్రం ‘దొరసాని’కి మై విలేజ్‌ షో ఎంతో దోహదపడిందని హీరో ఆనంద్‌ దేవరకొండ అన్నారు. గ్రామాల్లోని సంప్రదాయాలు, అక్కడి ప్రజల భాష.. వీటన్నింటిని ఈ షో ద్వారా నేర్చుకున్నానని ఆయన చెప్పారు. ‘మోతెవరి లవ్‌స్టోరీ’ వెబ్‌సిరీస్‌ టైటిల్‌ పోస్టర్‌ను ఆనంద్‌ ఆవిష్కరించారు. అనిల్‌ జీల, వర్షిణిరెడ్డి జంటగా శివకృష్ణ బుర్రా తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌ ‘జీ 5’లో ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్‌‌కానుంది.

  • ‘JSK’ టైటిల్ వివాదం.. CBFCపై ద‌ర్శ‌కుడు ఆగ్రహం!

    సురేష్ గోపి-అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ‘జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా టైటిల్ వివాదంపై మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు బి.ఉన్నికృష్ణన్ స్పందించాడు. ‘‘లైంగిక దాడికి గురైన మహిళకు జానకి అని పేరు పెట్టకూడదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సిగ్గు లేకుండా వాదించింది. అస‌లు మనం ఏ యుగంలో బతుకుతున్నాం? అని ఉన్నికృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

     

  • సినిమా నేర్పిన పాఠం.. అక్కడ బ్యాక్ బెంచులు లేవు!

    మలయాళ చిత్రం ‘స్థానార్థి శ్రీకుట్టన్’ కేరళ స్కూళ్లలో విప్లవాత్మక మార్పు తెచ్చింది. సాంప్రదాయ వరుసల సీటింగ్‌కు బదులుగా అర్ధవృత్తాకార సీటింగ్‌ను ప్రవేశపెట్టి, ముందు-వెనుక(బ్యాక్) బెంచర్ల విభజనను తొలగించింది. ఈ చిత్రం సమానత్వం, భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ విద్యార్థుల మధ్య ఐక్యతను పెంచింది. వినేష్ విశ్వనాథ్ దర్శకత్వంలో తీసిన ఈ చిత్రం విద్యా వ్యవస్థలో సామాజిక మార్పుకు ప్రేరణగా నిలిచింది.