Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • అనుష్క మూవీకి యు/ఎ సర్టిఫికెట్‌

    అనుష్క శెట్టి ‘ఘాటి’ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్‌లోకి రాబోతుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న మూవీ యు/ఎ సర్టిఫికెట్‌ అందుకున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

  • హీరోగా స్టార్ డైరెక్టర్.. హీరోయిన్ ఎవరంటే?

    ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హీరోగా వెండితెరపైకి అడుగుపెడుతున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో కూలీ సినిమా ఫేమ్ కన్నడ నటి రచితా రామ్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాలో లోకేశ్, రచితా రామ్‌తో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది.

  • ముగ్గురికి జన్మనిస్తా: జాన్వీకపూర్‌

    తన లక్కీ నంబర్ 3 అని.. పెళ్లి తర్వాత ముగ్గురు పిల్లలకు జన్మనిస్తా హీరోయిన్ జాన్వీకపూర్ గతంలో వెల్లడించింది. తాజాగా ఈ విషయంపై ఆమె స్పందించింది. ‘‘ఇద్దరు పిల్లలు గొడవ పడినప్పుడు మూడో బిడ్డ ఎవరికి మద్దతు ఇస్తారో చూడాలని, తన బిడ్డలందరూ ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారని చెప్పింది. ఈ వ్యాఖ్యలతో ఆమె తన అభిమానులను ఆకట్టుకుంటోంది.

     

  • ఫుల్‌ఫన్నీగా ‘లిటిల్ హార్ట్స్’ ట్రైలర్

    మౌళి తనుజ్-శివాని నాగరం జంటగా నటిస్తున్న మూవీ ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. సెప్టెంబర్ 5న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ స్టోరీ జియో సిమ్ రాకముందు జరిగిందంటూ ఫన్నీగా ట్రైలర్‌ ఎంతో ఆకట్టుకునేలా ఉంది.

  • ప్రీ సేల్స్‌లో ‘OG’ రికార్డు!

    పవన్ కల్యాణ్ నటిస్తోన్న‘OG’ చిత్రం రికార్డులు తిరగరాస్తోంది. USAలో ఈ మూవీకి అత్యంత వేగంగా 5 ల‌క్షల డాల‌ర్లకు పైగా ప్రీమియ‌ర్స్ ప్రీ సేల్స్ జ‌రిగిన‌ట్లు మేక‌ర్స్ ప్రక‌టించారు.

  • ‘మిరాయ్‌’.. అర్థం ఏంటో తెలుసా?

    కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిరాయ్‌’. అయితే ఈ సినిమా ప్రకటించినప్పుడే కాదు, ఇటీవల ట్రైలర్‌ చూసి కూడా ఈ పేరు అర్థం ఏంటి? అని తెగ వెతికేస్తున్నారు. ‘మిరాయ్‌’ అనేది జపనీస్‌ పదం. ‘భవిష్యత్తు కోసం ఆశ’ అని అర్థం. ఇందులో కథానాయకుడు యోధుడిగా భవిష్యత్‌ కోసం ఏం చేశాడన్నది అసలు కథ.

     

  • ఆ పాత్రను స్టార్స్‌ తిరస్కరించారు: దర్శకుడు

    2000 సంవత్సరంలో విడుదలై హిట్‌గా నిలిచిన చిత్రం ‘ప్రియురాలు పిలిచింది’. ఇందులోని మమ్ముట్టి పాత్రను చిత్ర దర్శకుడు రాజీవ్‌మేనన్‌ తాజాగా గుర్తుచేసుకున్నారు. ‘‘యుద్ధంలో కాలు కోల్పోయిన మేజర్‌ బాలా పాత్రలో ఆయన జీవించేశారు. ఆ పాత్ర గొప్పతనమంతా అతడి నడకలోనే ఉంటుంది. కాలు కోల్పోయిన వ్యక్తిగా నటించడానికి స్టార్స్ ఎవరూ అంగీకరించలేదు. కానీ మమ్ముట్టి ఆ పాత్ర గురించి చెప్పగానే అంగీకరించారు’’ అని చెప్పారు.

  • అదే నా విజయ రహస్యం: టామ్ క్రూజ్

    నాలుగు దశాబ్దాలుగా హాలీవుడ్‌లో అగ్ర నటుడిగా కొనసాగుతున్న టామ్ క్రూజ్ తన విజయ రహస్యాన్ని పంచుకున్నారు. ఇటీవల ‘మిషన్ ఇంపాసిబుల్-8’ విజయం సాధించిన సందర్భంగా మాట్లాడుతూ.. క్రమశిక్షణ, భయాన్ని ధైర్యంగా ఎదుర్కోవడమే తన 600 మిలియన్ డాలర్ల సంపదకు కారణమని తెలిపారు. “నేను ఏం చేస్తున్నానన్నది కాదు, నేనెవరు అన్నదే ముఖ్యం” అని, కొత్త విషయాలు నేర్చుకోవడం, మానవత్వంతో ఉండటమే తన అభిరుచులని ఆయన పేర్కొన్నారు.

  • Video: సౌత్ హీరోలపై జ్యోతిక సంచలన వ్యాఖ్యలు!

    నటి జ్యోతిక సౌత్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి నటించిన ‘షైతాన్’ సినిమా పోస్టర్‌ను అజయ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంపై ఆమె స్పందించింది. తాను ఎంతోమంది సౌత్ హీరోలతో కలిసి నటించానని, కానీ వాళ్లెవరూ అలా చేయలేదని తెలిపింది. హీరోయిన్‌ పోస్టర్‌లో ఉండటాన్ని ఇష్టపడరని, సౌత్ హీరోలు చాలా స్వార్థపరులని ఆమె వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.(Video)

  • అక్షయ్‌-సైఫ్‌ మూవీలో సయామీ ఖేర్‌

    దాదాపు 17 ఏళ్ల తర్వాత బాలీవుడ్ స్టార్‌ హీరోలు అక్షయ్‌కుమార్‌-సైఫ్‌ అలీఖాన్‌ మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాలో హీరోయిన్‌గా సయామీ ఖేర్‌ ఛాన్స్‌ దక్కించుకుంది. ‘‘ఎవరి సినిమాలు చూస్తూ పెరిగానో.. ఇప్పుడు వారితోనే కలిసి నటిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇది నేను ఊహించనిది’’ అని ఆమె వెల్లడించింది.