Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • నా ఫస్ట్‌ లవ్‌ అతడితోనే: అనుష్క

    నటి  అనుష్క ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్‌ లవ్‌ గురించి చెప్పారు. “నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు.. ఓ రోజు నా క్లాస్‌మేట్‌ నా దగ్గరికి వచ్చి ఐ లవ్‌ యూ చెప్పాడు. నేను కూడా అతడికి ఓకే చెప్పా. అప్పుడు ఐ లవ్‌ యూ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ విషయం ఇప్పటికీ నాకు ఓ మధురానుభూతి’’ అంటూ చెప్పుకొచ్చారు.

     

  • ‘సార్‌ మేడమ్‌’.. టైటిల్‌ టీజర్ రిలీజ్‌

    నటుడు విజయ్‌ సేతుపతి, నటి నిత్యా మేనన్‌ జంటగా నటించిన చిత్రం ‘తలైవాన్‌ తలైవి’. ఈ మూవీకి పాండిరాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో ‘సార్‌ మేడమ్‌’ పేరుతో విడుదల కానుంది. తాజాగా దీని టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు. ఓ మధ్య తరగతి కుటుంబంలోని భార్యాభర్తల పాత్రల్లో నిత్యా మేనన్, విజయ్‌ సేతుపతి ఎంతో సహజంగా కనిపించి ఆకట్టుకుంటున్నారు.

     

  • ప్రభాస్ ‘బాహుబలి’కి పదేళ్లు

    తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సినిమా ‘బాహుబలి’. ఈ మూవీలో  ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ ప్రధాన పాత్రలో నటించారు. రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ ప్రేక్షకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలు, అత్యధిక వసూళ్లు, ఎన్నో రికార్డులు సృష్టించింది. జులై 10, 2015న విడుదలైన ఈ సినిమా.. నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది.

  • కలెక్షన్ల సునామీ.. 2 వారాల్లో రూ.2,656 కోట్లు!

    బ్రాడ్‌ పిట్‌ న్యూ మూవీ ‘F1’  కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. జూన్‌ 27న విడుదలైన ఈ మూవీ రూ.2,656కోట్లు వసూలు చేసినట్లు బాక్సాఫీస్‌ వర్గాలు తెలిపాయి.

     

  • ‘రామాయణ’లో అమితాబ్ కూడా భాగం!

    బాలీవుడ్ నటుడు రణ్‌బీర్‌ నటిస్తున్నా ‘రామాయణ’ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ కూడా భాగమైనట్లు వార్తలు వస్తున్నాయి. మహాభారతం ఆధారంగా ఇటీవల రూపొందిన ‘కల్కి 2998 ఏడీ’లో అశ్వత్థామ పాత్రలో అద్భుతమైన నటనతో ఆశ్చర్యపరిచారు బిగ్‌ బీ. ఇప్పుడాయన ‘రామాయణ’లోనూ భాగం కానున్నట్లు సమాచారం. ఇందులో జటాయువు పాత్రకు అమితాబ్‌ వాయిస్ ఇవ్వనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

  • ‘మొగలిరేకులు’ కావాలనే ఆపేశాం: RK సాగర్

    మొగలి రేకులు ఫేమ్ ఆర్కే సాగర్ హీరోగా తెరకెక్కిన ‘ది 100’ సినిమా జులై 11న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్కే సాగర్.. మొగలిరేకులు సీరియల్ ఎందుకు ఆపేశారో చెప్పారు. ‘మొగలిరేకులు  ఆపేయాలని ఎవరూ చెప్పలేదు. నేనే ఆపేద్దాం అన్నాను. ఎందుకంటే ఆడియన్స్‌కి సాగదీస్తున్నాం అనే భావన రాకూడదు. అన్ని సీరియల్స్ కాకుండా ఒక మాస్టర్ పీస్ ఉండాలనుకున్నాం’ అని చెప్పుకొచ్చారు.

     

  • ‘పుష్ప’ జోడీ మరోసారి?

    పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌… శ్రీవల్లిగా రష్మిక కలిసి ‘పుష్ప’ సినిమాలతో చేసిన సందడి అంతా ఇంతా కాదు.  విజయవంతమైన ఆ  జోడీ మరోసారి తెరపై సందడి చేయనున్నట్టు సమాచారం. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌  కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ముగ్గురు కథానాయికలకి చోటుందని సమాచారం. ఓ కథానాయికగా దీపికా పదుకొణే  ఎంపికయ్యారు. మృణాల్‌ ఠాకూర్‌, రష్మిక దాదాపు ఎంపికైనట్లు తెలుస్తోంది.

     

  • ఆ ఒక్క సినిమా వల్ల 8 ప్రాజెక్ట్‌లు కోల్పోయాను: విద్యాబాలన్‌

    నటి విద్యా బాలన్ తొలిసారిగా  మోహన్‌లాల్‌తో కలిసి ‘చక్రం’ అనే సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యారు. కానీ కొన్ని రోజుల షూటింగ్ తర్వాత సినిమా  ఆగిపోవడంతో తనపై ఐరన్‌లెగ్‌ అనే ముద్ర వేశారని నటి వెల్లడించింది. ఆ ఒక్క సినిమా వల్ల 8 ప్రాజెక్ట్‌లు కోల్పోయానని తెలిపింది. కానీ, దర్శకుడికి, మోహన్‌లాల్‌కు అభిప్రాయభేదాలు రావడం వల్ల ఆ సినిమా ఆగిపోయినట్లు స్పష్టం చేసింది.

     

  • ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ.. ఈ మాటలు వివాదానికి దారితీస్తాయేమో: ఆర్‌.మాధవన్‌

    ఆర్‌.మాధవన్, ఫాతిమా సనా షేక్‌ నటించిన చిత్రం ‘ఆప్‌ జైసా కోయి’. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాధవన్‌ ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ గురించి మాట్లాడారు. ‘‘సహ నటీనటులపై మనకు నిజమైన ప్రేమాభిమానాలు ఉండాలి. అప్పుడే కెమిస్ట్రీ బాగుంటుంది. నేను చెప్పే ఈ మాటలు వివాదానికి దారితీస్తాయేమో కానీ.. వివాహం అయినవారు రొమాంటిక్‌ సన్నివేశాల్లో సరిగ్గా నటించలేరు’’ అని పేర్కొన్నారు.

  • అందుకే రణ్‌బీర్‌ను రాముడిగా ఎంపిక చేశాం: రామాయణ టీమ్‌

    బాలీవుడ్‌ దర్శకుడు నితేశ్‌ తివారీ దర్శకత్వంలో హీరో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. అయితే ఈ సినిమాలో రాముడి పాత్రకు రణ్‌బీర్‌ను ఎంపిక చేయడంపై పలు విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా రామాయణ టీమ్‌ స్పందించింది. రణ్‌బీర్‌ ముఖంలో ప్రశాంతత ఉంటుందని, అందుకే అతడిని రాముడిగా ఎంపిక చేసినట్లు క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ పేర్కొన్నారు.