Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • విజయ్ దేవరకొండ, రానాలపై ఈడీ కేసు

    బెట్టింగ్ యాప్ కేసులో 29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా నటులు విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాశ్‌రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి తదితరులతో పాటు పలువురు యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, బెట్టింగ్ కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది.

  • ‘రామాయణ’లో యశ్ క్యారెక్టర్ 15 నిమిషాలేనా?

    బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో, కన్నడ స్టార్ హీరో యశ్ రావణుడి పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామయణ’. ఈ సినిమాలో యశ్​ పాత్ర కేవలం 15 నిమిషాలే అని ప్రచారం సాగుతోంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. పార్ట్​-1లో కేవలం వనవాసం కంటే ముందున్న రాముడి జీవితం గురించి ఎక్కువగా ఫోకస్​ పెట్టారని సమాచారం.

  • ‘ఓ భామ అయ్యో రామ’ సెన్సార్ పూర్తి

    సుహాస్-మాళవిక మనోజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. రామ్ గోధల తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూలై 11న రిలీజ్‌కానుంది. తాజాగా మూవీ సెన్సార్ పనులు ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని మేకర్స్ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  • ‘జూనియర్‌’ ట్రైలర్‌‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

    గాలి కిరీటిరెడ్డి-శ్రీలీల జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జూనియర్‌’. ఈమూవీ ట్రైలర్‌ను ఈనెల 11న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. జులై 18న సినిమా విడుదలకానుంది.

  • ‘VD14’కు ముహూర్తం ఫిక్స్!

    విజయ్ దేవరకొండ-రాహుల్ సాంకృత్యాయన్ కాంబోలో ఓ సినిమా రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విజయ్ దేవరకొండ కెరీర్‌లో 14వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను రేపు ఉదయం 11.09 గంటలకు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

  • ‘కూలీ’ నుంచి పూజాహెగ్డే స్పెషల్ సాంగ్.. ప్రోమో!

    సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న చిత్రం ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ దర్శకుడు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో పూజాహెగ్డే ఆడిపాడింది. తాజాగా ఈ సాంగ్‌ రిలీజ్ అనౌన్స్‌మెంట్ ప్రోమోను మేకర్స్ వదిలారు. ‘మోనిక..’ అంటూ సాగే ఈ పాటను జూలై 11న సా.6 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్‌లో పూజాహెగ్డే అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులేసినట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతుంది.

  • అనిల్ షురూ చేశాడుగా.. ‘మెగా157’ ప్ర‌మోష‌న‌ల్ వీడియో!

    డైరెక్టర్ అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ‘మెగా157’(వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కతోంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ఓ స‌ర్‌ప్రైజింగ్ ప్ర‌మోష‌న‌ల్ వీడియో బ‌య‌టికొచ్చింది. ఓ టీవీ షోకు అనిల్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. అందులో ‘మెగా157’కు సంబంధించిన ఓ ప్రోమో రిలీజైంది. ప్రస్తుతం ఈ వీడిమో నెట్టింట వైరల్ అవుతోంది.

  • ‘నటుడిగా నన్ను ఎవరూ గుర్తించలేదు’

    నటుడు విష్ణు విశాల్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీకెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఒక నటుడిగా నన్ను ఎవరూ గుర్తించలేదు. నా సినిమాలను ఆదరించలేదు. అందుకు నేనెంతో బాధపడ్డా. ప్రతి ఏడాది టాప్‌ 20 చిత్రాల జాబితాను పరిశీలిస్తే అందులో నా సినిమా ఒక్కటైనా ఉంటుంది. కానీ, దానిని ఎవరూ ప్రశంసించలేదు’’ అని చెప్పారు.

  • ‘ఉప్పెన’ బ్యూటీ హాట్ అందాలు!

    ‘ఉప్పెన’తో యూత్ మనసు దోచుకున్న కృతిశెట్టి ప్రస్తుతం సోషల్‌మీడియాలో హాట్ ఫొటోషూట్స్‌తో హంగామా చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన తన బ్యూటిఫుల్ పిక్ వైరల్ అవుతోంది.

  • 2025 ఫస్టాఫ్‌ టాప్‌-10 చిత్రాలివే!

    2025 ఫస్టాఫ్‌ టాప్‌-10 మూవీస్‌ జాబితాను IMDb విడుదల చేసింది. ఇందులో విక్కీ కౌశల్‌ నటించిన ‘ఛావా’ మూవీ టాప్‌ ప్లేస్‌ దక్కించుకుంది. 2, 3 స్థానాల్లో ‘డ్రాగన్‌’, ‘దేవా’ సినిమాలు నిలిచాయి. ఆ తర్వాత ‘రైడ్‌ 2’, ‘రెట్రో’, ‘ది డిప్లొమాట్‌’, ‘ఎంపురన్‌’, ‘సితారే జమీన్‌ పర్‌’, ‘కేసరి చాప్టర్‌ 2’, ‘విదాముయర్చి’ చిత్రాలు ఉన్నాయి. కాగా టాలీవుడ్‌ నుంచి ఒక్క మూవీ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోలేదు.