నటి రష్మిక టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. తన నటనతో పాపులారిటీని పెంచుకుంటూ నేషనల్ క్రష్‌గా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకుంటోంది. తాజాగా ఆమె ముంబయి ఎయిర్‌పోర్టులో మెరవగా.. ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలతో క్లిక్ మనిపించారు. అనంతరం రష్మిక అభిమానులకు సెల్ఫీలు ఇచ్చింది. (వీడియో)
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘హరిహర వీరమల్లు’.. పవర్‌ఫుల్ సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జులై 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రబృందం తాజాగా కొత్త పాటను విడుదల చేసింది. ‘ఎవరది ఎవరది’ అంటూ సాగే ఈ పవర్‌ఫుల్ పాటకు కీరవాణి సంగీతం అందించగా.. సాయిచరణ్, హైమత్, లోకేశ్వర్ ఆలపించారు.
-
ట్రెడిషనల్ లుక్‌లో ఐశ్వర్య రాజేష్
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తాజాగా తన ఇన్‌స్టాలో బ్యూటీఫుల్ ఫొటో షేర్ చేసింది. అందులో ఆమె పర్పుల్ కలర్ శారీ కట్టుకొని ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తోంది.
-
రజనీకాంత్ ‘కూలీ’ తెలుగు ప్రీ-రిలీజ్.. ఎప్పుడంటే?
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘కూలీ’. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్‌కాబోతుంది. ఈ నేపధ్యంలోనే ‘కూలీ’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకను ఆగస్టు 7 జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీనికి రజనీకాంత్‌తో పాటు లోకేష్ కనగరాజ్, అక్కినేని నాగార్జున హాజరుకానున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.
-
ప్రతి సినిమాకు ముందు ‘దంగల్’ చూస్తా: దర్శకుడు
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ తనలో ఎంతో స్ఫూర్తినింపిందని కోలీవుడ్ దర్శకుడు ప్రేమ్‌కుమార్ తెలిపారు. ఏదైనా సినిమా తెరకెక్కించే ముందు తాను తప్పకుండా ‘దంగల్’ వీక్షిస్తానని తాజాగా ఓ చర్చా కార్యక్రమంలో చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడున్న రోజుల్లో కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు రివ్యూలు హానికరంగా మారాయని ఆరోపించారు.
-
ఎన్టీఆర్ ‘సింహాద్రి’కి 22 ఏళ్లు
ఎన్టీఆర్-రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ‘సింహాద్రి’ మూవీ విడుదలై నేటికి సరిగ్గా 22 ఏళ్లు పూర్తయ్యాయి. 2003 జులై 9న విడుదలై సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.
-
చీరలో మెరిసిన నభా నటేష్
హీరోయిన్ నభా నటేష్ సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో అందాల రచ్చ చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలో చీర కట్టుతో ఎంతో అందంగా మెరిసిపోతోంది.
-
‘బాహుబలి’ మళ్లీ వస్తున్నాడు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘బాహుబలి’. రేపటితో ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తవుతుంది. దీంతో చిత్రయూనిట్ రీ-రిలీజ్‌పై ఇంట్ ఇస్తున్నారు. అయితే దీనిపై రేపు క్లారిటీ రాబోతున్నట్లు వార్త వినిపిస్తోంది. ‘బాహుబలి’ వస్తున్నాడు అంటూ నెట్టింట పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.
-
టాలీవుడ్ సీనియర్ నటి ఇంట్లో ఈడీ సోదాలు
టాలీవుడ్ సీనియర్ నటి ముచ్చర్ల అరుణ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆమె భర్త మోహన్ గుప్తాకు సంబంధించి వ్యాపార అక్రమ లావాదేవీలపై ఈడీ బృందం తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం. చెన్నై కపాలీశ్వరర్ నగర్‌లోని బంగ్లాలో 10మందికిపైగా ఈడీ అధికారులు తనిఖీ చేపట్టినట్టు తెలిసింది. మోహన్ గుప్తా.. నిర్మాణ రంగంలో ఉన్నారు. ‘సీతాకోక చిలుక’ సినిమాతో అరుణ అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.
-
వెనక్కి తగ్గిన సెన్సార్.. అనుపమ చిత్రానికి 96 కట్స్ వద్దని వెల్లడి
కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ . దీనికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించడం మలయాళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెన్సార్ విషయంలో బోర్డ్ వెనక్కి తగ్గింది. 96 కట్స్ వద్దని.. కేవలం రెండు కట్స్ మాత్రమే చేయాలని వెల్లడించింది.