Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • Video: స్టేజీపై ఎమోషనల్ అయిన నటుడు ఆలీ

    నటుడు సుహాస్‌ను చూడగానే.. చనిపోయిన తన మేనల్లుడు గుర్తొచ్చాడని నటుడు అలీ ఎమోషనల్ అయ్యారు. ‘ఓ భామ అయ్యో రామ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఆ సినిమాలోని క్యారెక్టర్‌ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిందని తెలిపారు. సుహాస్‌ హీరోగా రామ్‌ గోదాల తెరకెక్కించిన చిత్రమిది. జులై 11న విడుదల కానుంది. (వీడియో)

  • మరింత క్షీణించిన ఫిష్ వెంకట్ ఆరోగ్యం.. వేరే ఆస్పత్రికి తరలింపు

    టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్టు తెలుస్తోంది. కళ్లు కూడా తెరవలేని పరిస్థితిలో ఉండటంతో వేరే ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మరోవైపు తాము ఆపరేషన్ చేయించలేని స్థితిలో ఉన్నామని ఎవరైనా సాయం చేయాలని ఫిష్ వెంటక్ కుటుంబం వేడుకుంటోంది.

  • ‘ధ‌డ‌క్-2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

    సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి జంటగా న‌టిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘ధ‌డ‌క్-2’. ఈ సినిమాకు షాజియా ఇక్బాల్ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుద‌ల తేదీతో పాటు ట్రైల‌ర్ అప్‌డేట్‌ ఇచ్చారు మేక‌ర్స్. ఈ మూవీ ట్రైల‌ర్‌ను ఈనెల 11న విడుద‌ల చేయ‌బోతుండ‌గా.. సినిమాను ఆగ‌ష్టు 1న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

  • ‘హరిహర వీరమల్లు’ కౌంటూ డౌన్ పోస్టర్‌!

    పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ మూవీతో ఈనెల 24న థియేటర్లలోకి రానున్నారు. ఈనేపథ్యంలో ‘15 డేస్ టూ గో’ అంటూ మేకర్స్ కౌంటూ డౌన్ పోస్టర్‌ను పంచుకున్నారు.

  • ‘ఆల్‌ ఇండియా ర్యాంకర్స్‌’ను తిట్టిన నటుడు శివాజీ!

    ఈటీవీ విన్‌ వేదికగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్‌సిరీస్ ‘ఏఐఆర్‌:ఆల్‌ ఇండియా ర్యాంకర్స్‌’. ఓ వైపు నవ్వులు పూయిస్తూనే మరోవైపు భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా జోసెఫ్‌ క్లింటన్‌ ఈ సిరీస్‌ను రూపొందించారు. తాజాగా ఈ టీమ్‌ను నటుడు శివాజీ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. సిరీస్‌లోని సన్నివేశాల వెనక జరిగిన ఫన్నీ సంఘటనలను శివాజీతో హర్ష్‌ రోషన్‌ పంచుకున్నారు.

  • హీరో, విలన్‌లను మించి.. ‘బడాస్‌’ టైటిల్‌తో వస్తోన్న హీరో సిద్దూ!

    హీరో సిద్ధూ జొన్నలగడ్డ తాజాగా కొత్త సినిమాను ప్రకటించారు. దీనికి ‘బడాస్‌’ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రవికాంత్‌ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తున్నారు. 2026లో ‘బడాస్‌’ విడుదలకానుంది. ‘‘మీరు ఇప్పటివరకూ హీరోలను, విలన్‌లను చూసి ఉంటారు. కానీ, ఇప్పుడు వారికి మించి చూస్తారు. ఈసారి కనికరం లేకుండా ఫైర్‌ సెట్‌ చేస్తాడు’’ అని మేకర్స్ తెలుపుతూ.. ఫస్ట్ లుక్‌ను కూడా వదిలారు.

  • దానికి ఎంతో ఎడిక్ట్‌ అయ్యాను: సమంత

    హీరోయిన్ సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఒకానొక సమయంలో మొబైల్‌కు ఎంతగా ఎడిక్ట్‌ అయ్యానని చెప్పారు. అదొక టాక్సిక్‌ రిలేషన్‌షిప్‌లా ఫీలయ్యానన్నారు. ‘‘ఆ అలవాటు నుంచి బయటపడేందుకు డిజిటల్‌ డిటాక్స్‌ ఫాలో అయ్యా.. ఎవరితోనూ మాట్లాడకుండా, ఫోన్‌ చూడకుండా, ఇతరులను కలవకుండా.. మూడు రోజులపాటు ఉండాలని నిర్ణయించుకున్నా. అలా కొన్నిరోజులపాటు పాటించిన తర్వాత ఎంతో మారాను’’ అని సమంత వెల్లడించారు.

  • ప్రముఖ దర్శకుడు కన్నుమూత

    టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు ఎస్. రాంబాబు(అలియాస్ నగేశ్) బ్రెయిన్‌ స్ట్రోక్‌తో కన్నుమూశారు.  ‘బ్రహ్మాండ’ అనే సినిమాకు రాంబాబు దర్శకత్వం వహించారు.

  • స్టార్‌హీరో కొత్త సినిమా.. గుర్తు పట్టలేని విధంగా ఫస్ట్‌లుక్‌

    శివరాజ్‌కుమార్‌ హీరోగా దర్శకుడు హేమంత్ ఎం. రావు తెరకెక్కిస్తోన్న చిత్రం ‘666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌’. తాజాగా ఈసినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు.

  • మీతో స్క్రీన్‌ పంచుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను: కియారా

    హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కలిసి నటిస్తోన్న సినిమా ‘వార్‌ 2′.  అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘‘ హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌తో స్క్రీన్ పంచుకోవడం   ఎప్పటికీ మర్చిపోలేనని’’ సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టారు.  కాగా,  ఆగస్టు 14న ఈ మూవీ విడుదల కానుంది.