హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల మదురైలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడ ఆమెను చూడగానే కొందరు అభిమానులు TVK..TVK అంటూ నటుడు విజయ్ పార్టీ పేరు చెబుతూ కేకలు పెట్టారు. కీర్తి సురేష్ నటుడు విజయ్ ప్రారంభించిన TVK పార్టీలో చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై కీర్తి సురేష్ స్పందించలేదు. విజయ్ పార్టీలో చేరడానికి ఆమె సిద్ధం అవుతున్నారని ప్రచారం జోరందుకుంది!
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
ఫొటోగ్రాఫర్లపై ప్రగ్యా జైస్వాల్ అసహనం
సినీ నటి ప్రగ్యా జైస్వాల్‌ని కొందరు ఫొటోగ్రాఫర్లు ఇబ్బంది పెట్టారు. ముంబైలో ఇటీవల నిర్మాత జాయెద్ ఖాన్ బర్త్ డే పార్టీలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమెను ఫొటోలు తీసేందుకు వారు ఎగబడ్డారు. అంతేకాకుండా ‘ప్రగ్యా’ అంటూ విచిత్రమైన శబ్దాలు చేస్తూ అరవడంతో ఆమె తీవ్ర అసహనానికి లోనయ్యారు. వెనక్కి తిరిగి చూస్తూ ఫొటోగ్రాఫర్లను తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయిన వీడియో వైరలవుతోంది.
-
మరోసారి రాజ్-సమంత ఫోటోలు వైరల్
స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి మరోసారి విదేశాల్లో పర్యటించారు. అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో పర్యటించిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇప్పటికే వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతుండగా.. తాజా ఫోటోలు ఇందుకు బలం చేకూర్చుస్తున్నాయి. అయితే, దీనిపై ఇటు సమంత గానీ, అటు రాజ్‌గానీ ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం.
-
రామోజీ ఫిల్మ్ సిటీలో చిరు – ప్రభాస్ హంగామా
సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు తన కొత్త చిత్రాన్నిపరుగులు పెట్టిస్తున్నారు నటుడు చిరంజీవి. మరోవైపు ‘ది రాజాసాబ్’ను పూర్తి చేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగిపోయారు ప్రభాస్. తాజాగా ఇద్దరి సినిమాల షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ వేదికైంది. ప్రస్తుతం ఈ అగ్రతారలిద్దరూ హంగామా చేస్తున్నారు.‘మెగా 157’ సినిమా వచ్చేఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ది రాజాసాబ్ చిత్రం డిసెంబరు 5న రిలీజ్ కానుంది.
-
నెపోకిడ్ అయినా కష్టపడాల్సిందే: మంచు మనోజ్
చిత్ర పరిశ్రమలో రాణించాలంటే నెపోకిడ్ అయినా కష్టపడాల్సిందేనని నటుడు మంచు మనోజ్ అన్నారు. ‘ఓ భామ అయ్యో రామ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కామెంట్స్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలో నెగ్గుకొస్తారనే మాట నిజం కాదని, ఆమాటకొస్తే ఆ పప్పులేం ఉడకవని, తననే ఉదాహరణగా చెప్పుకున్నారు. అనంతరం హీరో సుహాస్‌ను ప్రతిభావంతుడంటూ కొనియాడారు.
-
సినిమాల్లో బ్యాగ్రౌండ్ లేకపోతే నెగ్గుకు రావడం కష్టం :విజయ్ దేవరకొండ
హీరో విజయ్‌దేవర కొండ రీసెంట్గా హాలీవుడ్ రిపోర్టర్‌తో చిట్‌చాట్‌లో కీలక కామెంట్స్ చేశారు. “సినీపరిశ్రమలో నెపో కిడ్స్‌కు ఉన్నంత చనువు ఇతరులకు ఉండదు. ‘‘ఒక బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేనివ్యక్తి ఇండస్ట్రీలోకి వస్తే వాళ్లకు డైరెక్టర్‌తో చనువుగా ఉండే ఛాన్స్ఉండదు. కానీ, బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్ల పరిస్థితి మాత్రం భిన్నం. కథ వాళ్లు వద్దనిచెప్పే అవకాశం ఉంటుంది. నాకు కూడా కంటెట్ నచ్చకపోతే డైరెక్ట్గాచెప్పేస్తున్నాను’’ అన్నారు.
-
‘కుమారి 21F’ రీ-రిలీజ్ ట్రైలర్ చూశారా?
రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్ జంటగా నటించిన చిత్రం ‘కుమారి 21F’. 2015లో విడుదలైన ఈ మూవీ పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జులై 10న రీ-రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో తాజాగా రీ-రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
-
నిర్మాణ రంగంలోకి టాలీవుడ్ యంగ్ హీరో ఎంట్రీ
హీరో కిరణ్ అబ్బవరం నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా తన సొంత ప్రొడక్షన్‌హౌస్‌ను స్టార్ట్‌చేశాడు. దీనికి సంబంధించి ప్రకటన చేస్తూ.. ‘‘నేను 7 సంవత్సరాల క్రితం ఒక కలతో.. చాలా వదులుకుని నా ప్రయాణాన్ని ప్రారంభించాను. ఇప్పుడు ‘KA ప్రొడక్షన్స్’ ద్వారా నా కలను కొద్దిపాటి నిజం చేయగలుగుతున్నాను. జులై 10న ‘KA ప్రొడక్షన్స్’లో రాబోతున్న కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేయబోతున్నాను’’ అని చెప్పుకొచ్చాడు.
-
‘కుమారి 21F’ రీ-రిలీజ్.. టీమ్ స్పెషల్ చిట్‌చాట్
‘కుమారి 21F’ యూత్ ఆడియన్స్‌కు ఎంతగానో కనెక్ట్ అయిన చిత్రం. 2015లో విడుదలైన ఈ చిత్రం.. పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జులై 10న రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర నటులు రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్, నోయల్, నవీన్ నేని.. ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వారు పంచుకున్న విశేషాలేంటో ఈ వీడియోలో చూసేయండి.
-
క్యూట్ లుక్‌లో హీరోయిన్ కీర్తి సురేష్!
హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా షేర్ చేసిన తన ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందులో ఈ అమ్మడు బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ ధరించి క్యూట్‌గా కనిపిస్తోంది.