Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ఆ సినిమా తీయడం నా పూర్వజన్మ సుకృతం: మోహన్‌ బాబు

    మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. హిందూ పురాణం ఆధారంగా భక్త కన్నప్ప జీవిత చరిత్రను సినిమాగా రూపొందించినట్లు చెప్పారు. అఘోరాలు, నాగ సాధువులు, మాతాజీలు, గురువులతో కలిసి విజయవాడలో ‘కన్నప్ప’ చిత్రాన్ని మోహన్‌బాబు వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కన్నప్ప’ సినిమా తీయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

  • ఆమెతో మూడో పెళ్లి.. ఆమిర్‌ ఖాన్‌ ఏమన్నారంటే?

    బాలీవుడ్‌ స్టార్ ఆమిర్‌ ఖాన్.. గౌరీ స్ప్రాట్‌ అనే మహిళతో కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్నాడు. ఆమెతో తన రిలేషన్‌పై ఆమిర్‌ తాజాగా కీలకవిషయాలు వెల్లడించారు. ‘‘గౌరీ, నేనూ మా బంధం పట్ల చాలా సీరియస్‌గా ఉన్నాం. మేము ఇప్పుడు జీవిత భాగస్వాములం. ఇక పెళ్లి గురించి అంటారా.. నా మనసులో నేను ఇప్పటికే ఆమెను వివాహం చేసుకున్నాను. దానిని అధికారికంగా ప్రకటించాల్సివుంది’’ అని చెప్పుకొచ్చారు.

  • ‘థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటం గొప్ప విషయం’

    ఓటీటీకి ఆదరణ పెరుగుతున్న వేళ.. ప్రేక్షకులు కుటుంబసభ్యులతో థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటం గొప్ప విషయమని నటి దేవయాని అన్నారు. ‘3 బీహెచ్‌కే’ థాంక్స్‌ మీట్‌లో ఆమె మాట్లాడారు. సిద్ధార్థ్‌ హీరోగా శ్రీగణేశ్‌ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో నటి దేవయాని కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని దేవయాని అన్నారు.

  • ‘స్పెషల్‌ OPS-2’ స్ట్రీమింగ్‌ వాయిదా.. కొత్త తేదీ ఇదే!

    ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వెబ్‌సిరీస్‌ ‘స్పెషల్‌ ఓపీఎస్‌-2’ స్ట్రీమింగ్‌ వాయిదా పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం జులై 11న ఈ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జియో హాట్‌స్టార్‌ ప్రకటించింది. ఇప్పుడు వారం ఆలస్యంగా జులై 18న స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నటుడు కేకే మేనన్‌ వీడియోను పంచుకున్నారు.

  • VIDEO: స్క్రిప్ట్‌పై రాజీపడను: విజయ్ దేవరకొండ

    ఇండస్ట్రీలో మద్దతు లేకపోతే మంచి స్క్రిప్ట్‌ను ఎంచుకోవడం కష్టమని విజయ్ దేవరకొండ అన్నారు. ఒకప్పుడు తనకు అంత చొరవ లేదని, కానీ ఇప్పుడు స్క్రిప్ట్‌ల విషయంలో కఠినంగా ఉంటున్నానని తెలిపారు. “డబ్బు, దర్శకుడి కెరీర్, అభిమానుల ప్రేమ ముఖ్యమని చెబుతూ, స్క్రిప్ట్‌తో పూర్తి సంతృప్తి చెందిన తర్వాతే ముందుకు వెళ్తున్నా. ఇన్నేళ్ల కెరీర్‌లో నేను నేర్చుకున్నది ఇదే” అని విజయ్ స్పష్టం చేశారు.(వీడియో)

  • నటితో అసభ్య ప్రవర్తన.. క్షమాపణలు చెప్పిన నటుడు

    మలయాళి నటుడు షైన్‌ టామ్‌ చాకో తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడంటూ నటి విన్సీ సోనీ అలోషియస్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన ‘సూత్రవాక్యం’ సినిమా ప్రమోషన్స్‌లో చాకో క్షమాపణలు చెప్పి వివాదానికి ముగింపు పలికారు. ‘‘జరిగిన దానికి నేను క్షమాపణలు చెబుతున్నా. కావాలని చేసింది కాదు. నేను సరదాగా చెప్పానంతే. ఎలాంటి హాని తలపెట్టాలనుకోలేదు’’ అని చాకో అన్నారు.

  • నేను ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్.. పార్ట్‌టైమ్‌ యాక్టర్‌ను: స్మృతి ఇరానీ

    తాను ఫుల్‌టైమ్‌ రాజకీయనాయకురాలు అని, పార్ట్‌టైమ్‌ యాక్టర్‌ అని కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. నటిగా మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. టెన్షన్‌గా ఫీలవుతున్నారా? అని రీ ఎంట్రీని ఉద్దేశించి మీడియా ప్రశ్నించగా.. లేదని సమాధానమిచ్చారు. ‘‘మీడియా, రాజకీయ రంగంలో విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా’’ అని అన్నారు.

     

     

  • ఓర చూపులతో కేక పుట్టిస్తున్న కాయదు!

    హీరోయిన్ కయ్యదు లోహర్ సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోలో మత్తెక్కించే ఫోజులతో ఆకట్టుకుంటోంది.

  • ‘ఈ రోజుల్లో సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం ఒక ఛాలెంజ్‌’

    ఈ రోజుల్లో ఒక సినిమా తీసి దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం ఒక ఛాలెంజింగ్‌ థింగ్‌ అని నటుడు సిద్ధార్థ్‌ అన్నారు. ఇటీవల విడుదలైన ‘3 BHK’ మూవీ థాంక్స్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. సిద్ధార్థ్‌ హీరోగా శ్రీ గణేశ్‌ దర్శకత్వం వ‌హించిన చిత్రమే ‘3 BHK’. శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

  • ఎన్టీఆర్‌పై విజయ్‌ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్!

    హీరో విజయ్‌ దేవరకొండ తాజాగా ఓ ఇంటర్వ్యూలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ‘‘కింగ్డమ్‌’ టీజర్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వాలని ఎన్టీఆర్‌ అన్నను అడగ్గానే వచ్చి చెప్పారు. ఇలాంటి సాయాల వల్లే స్నేహబంధం మరింత బలపడుతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒకరికొకరు సాయం చేసుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు’’ అని తెలిపాడు.