Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘మహావతార్‌:నరసింహ’ ట్రైలర్ వచ్చేస్తోంది!

    ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ‘మహావతార్‌:నరసింహ’ చిత్రం జులై 25న రిలీజ్‌కానుంది. ఈనేపథ్యంలో రేపు సా.5:22గంటలకు ట్రైలర్ రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

     

  • ‘డాన్‌ 3’లో అతిథిగా షారుక్‌ ఖాన్‌

    ‘డాన్‌’ ఫ్రాంచైజీలో వస్తున్న ‘డాన్‌ 3’ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వినిపిస్తోంది. ‘డాన్‌ 3’లో షారుక్‌ ఖాన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీనికి ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ పాత్రని చేయడానికి షారుక్‌ అంగీకరించాడని టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే రణ్‌వీర్‌ సింగ్, షారుక్‌ ఖాన్‌ను తొలిసారి తెరపై చూడొచ్చు.

  • ఎన్టీఆర్‌తో కలిసి నటించడం గౌరవం: హృతిక్‌ రోషన్‌

    ఎన్టీఆర్‌తో కలిసి హృతిక్‌ రోషన్‌ నటించిన సినిమా ‘వార్‌-2’. ఈ మూవీ అప్‌డేట్‌ ఇస్తూ హృతిక్‌ ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘‘‘వార్‌ 2’ చిత్రీకరణ పూర్తయింది. ఎన్టీఆర్‌తో కలిసి నటించడం గౌరవంగా ఉంది. సెట్స్‌లో ఉన్నంతసేపూ సందడిగా ఉంటుంది. దర్శకుడు అయాన్‌ ముఖర్జీ, ఈ చిత్రానికి పని చేసిన ‘యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌’ టీమ్‌కు థాంక్స్‌’’ అని పేర్కొన్నారు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదలకానుంది.

  • తొలి భారతీయ నటిగా సయామీ ఖేర్‌ రికార్డు

    ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే బాలీవుడ్ నటి సయామీ ఖేర్.. విదేశాల్లో నిర్వహించే ట్రయథ్లాన్‌ పోటీల్లో పాల్గొంటుంటారు. ఏడాదిలో రెండుసార్లు ‘ఐరన్‌మ్యాన్‌ 70.3’ పూర్తి చేసిన తొలిభారతీయ నటిగా తాజాగా రికార్డు నెలకొల్పారు. గతేడాది సెప్టెంబరులో తొలిసారిగా మెడల్‌ అందుకున్న ఆమె.. ఇప్పుడు స్వీడన్‌లో నిర్వహించిన రేస్‌లో సత్తా చాటి మరో పతకం అందుకున్నారు. 1.9 కి.మీ. ఈత, 90 కి.మీ. సైక్లింగ్, 21.1 కి.మీ. పరుగు ట్రయథ్లాన్‌లో భాగం.

     

  • ‘మెగా157’ ఓటీటీ రైట్స్‌కు భారీ డిమాండ్!

    మెగాస్టార్ చిరంజీవి-నయనతార జంటగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మెగా157’. ఈ మూవీ ఓటీటీ రైట్స్ హాట్ కేక్‌లా మారాయి. ఈ రైట్స్‌ను దక్కించుకునేందుకు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.55 కోట్లు కోట్ చేసిందట. దీంతో దాదాపు రూ.60 కోట్లకు డీల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • స్టార్ హీరో ఇన్‌స్టా హ్యాక్.. అభిమానులకు విజ్ఞప్తి!

    మలయాళ హీరో ఉన్నిముకుందన్.. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయినట్లు ఫేస్‌బుర్ ద్వారా తెలిపారు. తన ఇన్‌స్టా నుంచి వస్తున్న అప్‌డేట్‌లు, మెసేజులు తాను పంపిస్తున్నవి కావని స్పష్టంచేశారు. హ్యాక్ అయిన తన అకౌంట్ నుంచి ఎలాంటి సందేశాలు వచ్చిన, లింకులు వచ్చిన వాటిని ఓపెన్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య పూర్తిగా పరిష్కారమైయ్యాక అప్‌డేట్ చేస్తానని తెలిపారు.

  • బాలయ్య-వెంకీ కాంబోలో మూవీ.. ఇక ఫ్యాన్స్‌కు పండగే!

    హీరోలు బాలకృష్ణ-వెంకటేశ్‌ కాంబోలో ఓ సినిమా రూపొందబోతోంది. ఈ విషయాన్ని అమెరికాలో జరుగుతున్న ‘నాట్స్‌ 2025’ వేడుకలో వెంకటేశ్‌ స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తోన్న సినిమాలో వెంకటేశ్‌ ఓ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే బాలకృష్ణతో కలిసి కెమెరా ముందుకు వెళ్లనున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయనున్నారు. అందులోనే వెంకటేశ్‌ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది.

  • ‘భైరవం’.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

    బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధానపాత్రల్లో విజయ్ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ‘భైరవం’. మే 30న థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకోగా.. జూలై 18 నుంచి అందుబాటులోకి రానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. తెలుగు సహా హిందీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.

  • ప్రజా సేవ తన లక్ష్యం కాదని అంగీకరించిన కంగనా!

    పార్లమెంటు సభ్యురాలిగా తన పాత్రను తాను ఆస్వాదించడం లేదని నటి కంగనా రనౌత్ అంగీకరించారు. ప్రజలు తన వద్దకు పాడైపోయిన నాలాల సమస్యల కోసం వస్తున్నారని ఆమె చెప్పారు. “నేను ఒక ఎంపీని, అది రాష్ట్ర సమస్య అని వారికి చెబుతాను” అని ఆమె అన్నారు.  ఒకప్పుడు ప్రజా సేవ తన లక్ష్యం కాదని అంగీకరిస్తూ, కంగనా “నేను స్వార్థపూరితమైన జీవితాన్ని గడిపాను. నాకు పెద్ద ఇల్లు,పెద్ద కారు కావాలి” అని అన్నారు.

  • శివశక్తి దత్తా మృతిపై మెగాస్టార్ చిరంజీవి విచారం

    MM కీరవాణి తండ్రి శివశక్తి దత్తా సోమవారం కన్నుమూశారు. ఆయన మృతిపై మెగాస్టార్ చిరంజీవి విచారం వ్యక్తంచేశారు. ‘‘చిత్రకారుడు, సంస్కృత భాషా సంపన్నుడు, రచయిత, కథకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి.. శివశక్తి దత్తా శివైక్యం చెందారన్న వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. కీరవాణి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అంటూ చిరంజీవి పోస్ట్ చేశారు.