బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో కుర్రకారును ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలో చూపులతో మత్తెక్కిస్తుందనటంలో సందేహం లేదు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘ఏక్ దిన్’.. సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ!
బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఏక్ దిన్’. ఈ సినిమాతో స్టార్ నటి సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాను నవంబర్ 7న రిలీజ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
-
ఆ వార్తలు ఎంతో బాధించాయి: నిర్మాత ఏఎం రత్నం
‘హరి హరవీరమల్లు’ చిత్ర నిర్మాత ఏఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.‘‘ఈ సినిమా 14సార్లు వాయిదా పడినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. అలాంటి వార్తలు చూసి నాకు బాధ, కోపం రెండూ వచ్చాయి. దీన్ని ప్రకటించిన తర్వాత మూడుసార్లు మాత్రమే వాయిదా పడింది. జూన్ 12న రిలీజ్ చేయలేకపోయినప్పుడు నేను చాలా ఫీలయ్యాను’’అని తెలిపారు. కాగా, ఈ మూవీ జులై 24న విడుదల కానుంది.
-
అల్లు అర్జున్ సినిమాలో విలన్‌గా హాలీవుడ్ నటుడు?
హీరో అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో విలన్‌గా హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్‌ను నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అల్లు అర్జున్ సినిమా పాన్ ఇండియా నుంచి ఇంటర్‌నేషనల్ వరకు వెళుతుంది. కాగా, ఈ విషయంపై చిత్రబృందం నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
-
‘హరిహర వీరమల్లు’ పవన్ స్థాయిని పెంచుతుంది!
పవన్ కల్యాణ్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హరవీరమల్లు’ జులై 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఏఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగగ్ కామెంట్స్ చేశారు. .‘హరి హర వీరమల్లు’ పెద్ద చిత్రం. ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుంది. పవన్ కల్యాణ్ స్థాయిని పెంచుతుంది’’ అని అన్నారు.
-
OTTలోకి ‘కుబేరా’!
నాగార్జున-ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కుబేరా’. జూన్ 20న థియేటర్లలో విడుదలై ఈ మూవీ రూ.100 కోట్ల వసూళ్లు చేసింది. అయితే, ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 18 నుంచేస్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాను శేఖర్ కమ్ముల తెరకెక్కించారు.
-
‘హరిహర వీరమల్లు’ ఫ్యాన్ మూమెంట్స్ రివీల్ చేసిన నిధి
పవన్ కల్యాణ్- నిధి అగర్వాల్ జంటగా నటించిన సినిమా ‘హరిహర వీరమల్లు’ త్వరలో విడుదల కానుంది. అయితే, తాజాగా నిధి ఆగర్వాల్ ట్విట్టర్(X)లో ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. అభిమాని ఒకరు ‘హరిహర వీరమల్లు’ సినిమాలో గూస్బంప్స్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా?’అని అడిగారు. ‘ఇంటర్వెల్ కోసం ఎదురు చూడండి. ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ కోసం వేచి ఉండండి’’ అని నిధి అగర్వాల్ జవాబిచ్చారు.
-
వామ్మో.. రష్మిక ఇలా మారిపోయిందేంటి
హీరోయిన్ రష్మిక న్యూ లుక్ ఫోటో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫొటో షూట్‌లో వెస్టర్న్ లుక్‌లో ఆమె గుర్తు పట్టకుండా మారిపోయారు. దీనిపై అభిమానుల నుంచి మిశ్రమ
స్పందన వస్తోంది. కొందరేమో కొత్త లుక్ అదిరిపోయిందని కామెంట్లు చేస్తుండగా మరికొందరు దారుణంగా ఉందని ట్రోల్ చేస్తున్నారు.