Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘‘పంచాయత్‌’’ సిరీస్‌లో ఉన్న ఊరు ఇప్పుడెలా ఉందో చూడండి (VIDEO)

    ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న వెబ్‌ సిరీస్‌లలో ‘పంచాయత్‌’ ఒకటి. ఆ సిరీస్‌లో చూపించిన మధ్యప్రదేశ్‌లోని మహోదియా(ఫులేరా) గ్రామం ఇప్పుడెలా ఉందో చూపే వీడియో వైరలవుతోంది. ఈ లో సిరీస్‌లో చూపిన విధంగా కాకుండా, పంచాయతీ కార్యాలయం ముందు బురద నిండిపోయి అసౌకర్యంగా కనిపించడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. సిరీస్‌ కోసమే దీనిని తీర్చిదిద్దారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

     

  • కీరవాణి ఇంటికి వెళ్లిన మహేశ్‌బాబు

    ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంటికి హీరో మహేశ్‌బాబు వెళ్లారు. ఇవాళ ఉదయం కీరవాణి తండ్రి శివశక్తి దత్తా (92) మరణించారని తెలుసుకున్న మహేశ్.. స్వయంగా కీరవాణి ఇంటికి వెళ్లి.. శివశక్తి దత్తా మృతదేహానికి నివాళులర్పించారు. కీరవాణి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా రాజమౌళి దర్శకత్వంలో రానున్న ‘SSMB29’ మూవీలో మహేశ్, కీరవాణి కలిసి పని చేస్తున్నారు.

  • ‘మీరు నమ్ముకుంటే.. అనుకున్నది సాధించొచ్చు’

     నిధి అగర్వాల్‌  ‘హరి హర వీరమల్లు’ మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  తాజాగా ఈమె ట్విట్టర్ (X) వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించారు.. దీంతో, ఓ అభిమాని యాక్టింగ్‌ను కెరీర్‌గా చేసుకోవాలనుకునే వారికి మీరిచ్చే సలహా? ఏంటి అని అడిగారు. ‘‘ ఇది కష్టమైన రంగం. చాలా తిరస్కరణలకు సిద్ధంగా ఉండాలి. అయితే, మిమ్మల్ని మీరు నమ్ముకుంటే.. అనుకున్నది సాధించొచ్చు’’ అని నిధి అగర్వాల్ సమాధానమిచ్చింది.

  • వైరల్‌ సాంగ్స్‌కి కేరాఫ్‌ ఈ “వయ్యారి” శ్రీలీల

    శ్రీలీల తన  అందంతో ఆకట్టుకోవడమే కాకుండా, డాన్స్‌తోనూ అదరగొడుతుంది. ఈమె చేసిన కిస్సీక్‌, కుర్చీ మడతబెట్టి, జింతాక్‌, పల్సర్‌బైక్‌, గండరబాయ్‌ సాంగ్స్‌ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. తాజాగా ‘జూనియర్‌’ మూవీలో ఆమె చేసిన ‘వయ్యారి’ సాంగ్‌ విపరీతంగా  వైరల్‌ అవుతోంది. అందులో శ్రీలీల తన డాన్స్‌తో కుర్రకారును ఊపేస్తున్నారు.

     

  • శివశక్తి దత్తా.. సినీ ప్రస్థానం ఇదే

    సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి, రచయిత శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1988లో విడుదలైన ‘జానకి రాముడు’ మూవీ ద్వారా ఆయన రచయితగా మంచి గుర్తింపు పొందారు. బాహుబలి: (మమతల తల్లి), (ధీవర)బాహుబలి 2: (సాహోరే బాహుబలి),RRR:(రామం రాఘవమ్), హనుమాన్ (అంజనాద్రి థీమ్ సాంగ్), చత్రపతి: (మన్నేల తింటివిరా),రాజన్న: (అమ్మ అవని) ఈ పాటలు ఒక్కొక్కటీ గుండెను తాకే భావోద్వేగాలను కలిగించాయి.

     

  • కీరవాణికి పితృవియోగం

    ప్రముఖ దర్శకుడు కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కీరవాణి తండ్రి శివశక్తి దత్త(92) కన్నుమూశారు. సై, ఛత్రపతి, రాజన్న తదితర సినిమాలకు శివశక్తి దత్తా పాటలు రాశారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

  • ‘ది’ ట్యాగ్‌పై స్పందించిన విజయ్‌దేవరకొండ

    నటుడు విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తన పేరు ముందు ‘ది’ అనే ట్యాగ్‌ను ఆయన పెట్టుకున్నారు. అది వివాదాస్పదం కావడంతో దానిని తొలగించాలని అభిమానుల నుంచి విజయ్‌కి సూచనలు వచ్చాయి. దీనిపై తాజాగా విజయ్ స్పందించారు. ఆ ట్యాగ్‌ వల్ల ఇతర హీరోలకు ఎవరికీ తగలనన్ని ఎదురుదెబ్బలు తనకు తగిలాయని వెల్లడించారు.

  • వైరలవుతోన్న ‘హరి హర వీరమల్లు’ రన్‌టైమ్‌..

    పవన్‌ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. జూలై 24న ఈ మూవీ విడుదల కానుంది. ఓవర్సీస్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీబుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ‘హరిహర వీరమల్లు’ రన్‌టైమ్‌పై చర్చ మొదలైంది. ఈ మూవీ రన్‌టైమ్ 2.40 గంటలు ఉందని ఓ విదేశీ వెబ్‌సైట్ పేర్కొంది.

  • తమిళ్ మూవీని రీమేక్ చేయనున్న నాగార్జున?

    టాలీవుడ్ నటుడు నాగార్జున ఓ తమిళ మూవీని రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. R.మంతిర మూర్తి దర్శకత్వంలో శశికుమార్‌ నటించిన ‘అయోతి’ అనే తమిళ మూవీని నాగ్‌ రీమేక్‌ చేయనున్నట్లు టీటౌన్‌లో చర్చ జరుగుతోంది. 2023లో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో ఎమోషన్స్‌, కథ, కథనం గురించి ఆడియన్స్‌ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారని, కమర్షియల్‌గానూ వర్కౌట్‌ అవుతుందని నాగ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  • నటి నయనతార డాక్యుమెంటరీలో చంద్రముఖి సన్నివేశాలు!

    నటి నయనతార డాక్యుమెంటరీలో స్థానం పొందిన ‘చంద్రముఖి’ సన్నివేశాలు తొలగించాలని దాఖలైన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు విచారణ జరిపింది. ఆ సన్నివేశాలను అనుమతి లేకుండా ఉపయోగించారని, రూ.5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని చంద్రముఖి సినిమా కాపీరైట్‌ పొందిన ఏబీ ఇంటర్నేషనల్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ డార్క్‌ స్టూడియో, నెట్‌ఫ్లిక్స్‌ రెండు వారాల్లో జవాబివ్వాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.