‘హరి హర వీరమల్లు’తో ప్రేక్షకుల ముందుకు రానున్న నిధి అగర్వాల్ ఎక్స్‌లో ఫ్యాన్స్‌ని సోమవారం పలకరించింది. ఈక్రమంలో నిధి అగర్వాల్‌కూ ఓ అభిమాని నేరుగా మ్యారేజ్ టాపిక్ తీసుకొచ్చాడు. ‘‘మీ అమ్మగారి ఫోన్ నెంబరు ఇస్తే.. మన పెళ్లిసంబంధం గురించి మాట్లాడతా. ప్లీజ్ ఇవ్వొచ్చుగా నిధి’’ అంటూ హార్ట్ ఎమోజీతో విజ్ఞప్తి చేశాడు. ‘అవునా? చిలిపి..’ అని నిధి సమాధానమిచ్చింది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
సూపర్ 4K టెక్నాలజీతో ‘అతడు’ మళ్లీ వస్తున్నాడు!
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఆయన నటించిన ‘అతడు’ చిత్రాన్ని సరికొత్త సూపర్ 4K టెక్నాలజీతో ఆగస్టు 9న రీ-రిలీజ్ చేయనున్నారు.
-
‘మారెమ్మ’గా మాస్ మహారాజా వారసుడు.. ఫస్ట్ లుక్!
మాస్ మహారాజా రవితేజ వారసుడు టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆయన తమ్ముడు రఘు కొడుకు.. మాధవ్ రాజ్ భూపతి హీరోగా నాగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. తాజాగా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీకి ‘మారెమ్మ’ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.
-
‘సీతా పయనం’ ఫస్ట్ సాంగ్‌కు డేట్ ఫిక్స్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘సీతా పయనం’. ఇందులో అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సిద్ధమైంది. ‘యే ఊరికెళ్తావే పిల్లా’ అంటూ సాగే ఈ పాటను జూలై 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో నిరంజన్ హీరోగా నటిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.
-
బ్లాక్ శారీలో బుట్టబొమ్మ వయ్యారాలు!
బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా మరోసారి చీరలో మెరిసింది. బ్లాక్ శారీలో మరింత అందంగా కనిపించింది. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
-
ఆ భయానక మూవీకి సీక్వెల్.. వణికిపోవడానికి సిద్ధంగా ఉండండి!
విష్ణు విశాల్ ప్రధానపాత్రలో నటించిన మర్డర్ అండ్ థ్రిల్లర్ ‘రాట్సాసన్’. 2018 అక్టోబర్‌లో రిలీజైన ఈ తమిళ మూవీ మంచి సక్సెస్‌ను అందుకుంది. ఇప్పుడు దీని సీక్వెల్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ‘‘‘రాట్సాసన్’ సీక్వెల్‌కు సర్వం సిద్ధం. 2026లో భారతదేశపు అత్యంత భయానక థ్రిల్లర్ తిరిగి వస్తుంది. మరోసారి వణకడానికి సిద్ధంగా ఉండండి’’ అంటూ ప్రస్తుతం ఓ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
-
‘SSMB29’ షూటింగ్ వాయిదా!
మహేష్‌బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో ‘SSMB29’ చిత్రం తెరకెక్కుతోంది. అయితే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. కెన్యా అడవిలో యాక్షన్ సీన్స్ తీసేందుకు జక్కన్న భారీ ఏర్పాట్లు చేశారట. అయితే ఈ షూట్ రద్దు అయ్యిందట. ప్రస్తుతం కెన్యాలోని కొన్ని ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితులు అనుకూలంగా లేవని సమాచారం. దీంతో తాత్కాలికంగా కెన్యా షూటింగ్‌ను వాయిదా వేసుకున్నట్లు సినీవర్గాలు తెలిపాయి.
-
‘వార్-2’ మూవీపై అప్‌డేట్ ఇచ్చిన ఎన్టీఆర్
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘వార్-2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ హరోయిన్. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుండగా.. తాజాగా మూవీపై హీరో ఎన్టీఆర్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్లు వెల్లడించాడు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. హృతిక్ రోషన్‌తో కలిసి నటించడంపై ఆనందం వ్యక్తం చేశాడు.
-
విజయ్ ‘కింగ్డమ్’.. న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్!
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కింగ్డమ్’. తాజాగా మూవీ న్యూ రిలీజ్ డేట్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. జులై 31న ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈమూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ‘‘కింగ్డమ్’ రెండు భాగాలుగా రానుందని నిర్మాత నాగవంశీ స్వయంగా ప్రకటించారు.
-
సూర్య ‘కిల్లర్’ కోసం రెహమాన్ రెడీ!
తమిళ దర్శకనటుడు ఎస్.జె.సూర్య చాలాకాలం తర్వాత డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘కిల్లర్’. ఆయనే హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీకి మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించేందుకు రెడీ అయ్యారు. ‘కిల్లర్’ ట్యూన్స్‌తో ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు రెహమాన్ సిద్ధమవుతున్నారని చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది.