భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ తనను అసభ్యంగా తాకడంపై నటి అంజలి సంచలన వ్యాఖలు చేసింది. ఈవెంట్‌లో పవన్ సింగ్ తన నడుమును పొరపాటున తాకాడని భావించానని.. కానీ ఆయన కావాలనే చేసినట్లు తెలిసి షాక్ అయ్యానని చెప్పింది. ఈ ఘటనపై స్పందించలేదని వచ్చిన విమర్శలపై బాధపడిన ఆమె, దీని గురించి మాట్లాడకుండా ఉండేందుకు కొందరు బెదిరించారని పేర్కొంది. దీంతో ఇకపై బోజ్‌పురి చిత్రాల్లో నటించనని చెప్పింది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘SSMB29’.. ప్రియాంక చోప్రా ఫొటో లీక్
నటి ప్రియాంక చోప్రా ‘SSMB29’ మూవీ షూటింగ్ ఫొటో షేర్ చేయడంతో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఇది ఉత్తర ఆఫ్రికాలో తీసిన ఫొటోస్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
-
అల్లు కనకరత్నం కన్నుమూత: పాడె మోసిన చిరంజీవి, బన్నీ
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి, దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు శనివారం సాయంత్రం కోకాపేటలోని వారి ఫామ్‌హౌస్‌లో జరగనున్నాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆమె పాడెను మోసి తమ ఆత్మీయబంధాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
ప్రముఖ నటుడి ఇంట పెళ్లి సందడి!
తమిళ నటుడు ప్రేమ్ కుమార్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన తనయుడు కౌశిక్ సుందరం.. పూజిత మెడలో తాళికట్టాడు. ఆగస్టు 28న వీరిద్దరి వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి హీరో శివకార్తికేయన్ హాజరవ్వగా.. రిసెప్షన్‌కు హీరో కార్తీ వచ్చారు. ఈ పెళ్లి ఫోటోలను ప్రేమ్‌కుమార్ తాజాగా సోషల్‌మీడియాలో పంచుకున్నాడు. ఆగస్టు 28 మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన రోజు అని రాసుకొచ్చాడు.(ఫొటోలు)
-
‘నాలాంటి వారికి ఓటీటీలు ఒక వరం’
ఓటీటీలు తనలాంటి నటీనటులకు వరమని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయీ అభిప్రాయపడ్డారు. థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలు బాక్సాఫీస్ నంబర్లపై ఆధారపడగా, ఓటీటీలు మాత్రం మంచి కథ, ప్రతిభావంతులైన నటులు ఉంటేనే ఆదరణ పొందుతున్నాయని ఆయన అన్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ నుంచి తాను ఈ విషయాన్ని గమనిస్తున్నానని.. ఓటీటీల వల్ల లబ్ధి పొందిన వారిలో తాను ఒకడినని మనోజ్ తెలిపారు.
-
SSMB29: ప్రియాంక ఫొటోలకు నమ్రత రియాక్ట్!
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రానున్న ‘SSMB29’ సినిమా షూటింగ్ ఆఫ్రికాలో జరుగుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రియాంక చోప్రా ఇటీవల తీసిన కొన్ని ప్రకృతి ఫొటోలను సోషల్‌మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోలను చూసిన అభిమానులు అవి కెన్యా లేదా ఉత్తర ఆఫ్రికాలో తీసినవని కామెంట్లు పెడుతున్నారు. వీటికి మహేశ్ భార్య నమ్రత లవ్ సింబల్స్‌తో స్పందించడం విశేషం.
-
Jr.NTR పొలిటికల్ ఎంట్రీపై సుహాసిని క్లారిటీ
నటుడు Jr.NTR పొలిటికల్ ఎంట్రీపై ఇటీవల సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో దీనిపై NTR సోదరి నందమూరి సుహాసిని క్లారిటీ ఇచ్చారు. ‘‘ప్రస్తుతం ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రజా జీవితంలోకి వస్తారు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది.
-
హీరో రామ్ చరణ్ కంటతడి
తన అమ్మమ్మ, అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ పార్థీవ దేహానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నివాళులర్పించారు. ఈ క్రమంలో రామ్‌చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు. అల్లు అర్జున్‌ను హగ్ చేసుకుని ఏడ్చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
-
దర్శన్ భార్య విజయలక్ష్మికి వేధింపులు
కన్నడ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి, ఆమె కుమారుడు వినీశ్‌లపై కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం కలకలం రేపింది. ఈమేరకు తన అభిమాన నటుని భార్య, కుమారులను లక్ష్యంగా చేసుకుని, అశ్లీల, అనుచిత పోస్టులు పెట్టి వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళా కమిషన్‌కు దర్శన్ వీరాభిమాని భాస్కర ప్రసాద్ ఫిర్యాదుచేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కమిషన్ తెలిపింది.
-
మా అత్తయ్య మృతి బాధాకరం: చిరంజీవి
నటులు అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ మృతిపై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ‘‘మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.. ఓం శాంతిః’’ అని ట్వీట్ చేశారు.