Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • సీఎం రేవంత్ రెడ్డితో అజయ్ దేవగణ్ భేటీ

    ప్రముఖ హిందీ సినీ నటుడు అజయ్ దేవగణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నాడు. తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ ఏర్పాటుపై చర్చించారు. ఏఐ సాంకేతికతతో వీఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియోల నిర్మాణం, ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలను అందజేశారు.
  • ఆ పాత్రలు చేస్తే బోర్‌ కొడుతుంది: హీరోయిన్

    రొటీన్‌ పాత్రలు చేస్తే తనకే కాదు ప్రేక్షకులకు బోర్‌ కొడుతుందని.. ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రల్లో చేయడమే తనకు ఇష్టమని చెబుతోంది హీరోయిన్ మాళవిక మనోజ్‌. ఆమె నటిస్తున్న ‘ఓ భామ అయ్యో రామా’ మూవీ జులై 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా మాళవిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. ‘‘ఈకథ వినగానే ఎంతో నచ్చింది. ఈసినిమాను అందరూ ఎంజాయ్‌ చేస్తారు’’ అని మాళవిక చెప్పుకొచ్చింది.

     

  • ‘రాజాసాబ్’ సెట్స్‌లో నిర్మాత బర్త్ డే సెలబ్రేషన్స్!

    రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’. నిర్మాతగా SKN వ్యవహరిస్తున్నారు. అయితే నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మూవీ సెట్స్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. దర్శకుడు మారుతి SKNతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ వేడుకల్లో హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా పాల్గొంది.

  • చీర‌లో స‌మంత సొగ‌సులు.. ఫొటో వైరల్!

    హీరోయిన్ సమంత సోష‌ల్ మీడియాను త‌న లేటెస్ట్ ఫొటోల‌తో షేక్ చేస్తోంది. తాజాగా చీర‌కట్టులో ఉన్న సామ్ హాట్ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

  • కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘కోర్ట్’ బ్యూటీ శ్రీదేవి

    ‘కోర్టు’ ఫేం శ్రీదేవి తమిళ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తమిళ నిర్మాత, నటుడు కేజేఆర్ నటిస్తున్న చిత్రాన్ని తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాను మినిస్టూడియోస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీదేవి నటిస్తోంది. చెన్నైలో జరిగిన పూజా కార్యక్రమానికి తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సినిమాను రేగన్ స్టానిస్లాస్ డైరెక్ట్ చేస్తుండగా.. గిబ్రాన్ సంగీతం అందించనున్నాడు.

  • మోహన్‌లాల్‌ మూవీపై నిర్మాత విమర్శలు!

    సురేశ్‌ గోపి, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’. ఈ సినిమా టైటిల్‌పై వివాదం నెలకొంది. ఈ వివాదం గురించి తాజాగా నిర్మాత సురేశ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మోహన్‌లాల్‌ ‘ఎల్‌ 2:ఎంపురాన్‌’ను నిందించారు. ఆ సినిమా నుంచే సెన్సార్‌‌బోర్డు వాళ్లు ఎంతో క్షుణ్ణంగా వ్యవహరిస్తున్నారు. ఈ సమస్యలన్నింటికీ కారణం ఆ సినిమాని ఆయన ఆరోపించారు.

  • ఓటీటీలోకి ధనుష్ ‘కుబేర’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

    ధనుష్ నటించిన ‘కుబేర’ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈనేపథ్యంలో మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడు అయ్యాయని సమాచారం. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఏకంగా రూ.50 కోట్లకు పైగా డిజిటల్ హక్కులను… అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని అంటున్నారు. జూలై 20 తర్వాత.. ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని కూడా చెబుతున్నారు.

  • ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!

    ప్రతీ వారం లాగే ఈ వారం కూడా పలు చిత్రాలు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైయ్యాయి. మరి అవేంటో చూద్దాం.

    • బుక్‌ మై షో: ‘గుడ్‌ వన్‌’ (హాలీవుడ్‌) జులై 08
    • నెట్‌ఫ్లిక్స్‌: ‘ఆప్‌ జై సా కోయి’ (హిందీ) జులై 11
    • సోనీలివ్‌: ‘నరివెట్ట’ (మలయాళం) జులై 11
    • జియో హాట్‌స్టార్‌: ‘స్పెషల్‌ ఓపీఎస్‌ 2’ (వెబ్‌సిరీస్‌) జులై 11

  • రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్

    పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘రెండో పెళ్లి చేసుకోవడానికి నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. అయితే ఇప్పుడే కాదు. రెండు, మూడేళ్లలో పెళ్లి చేసుకుంటా. నా జీవితంలో కూడా ఓ మ్యారేజ్ లైఫ్ ఉండాలని, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను’’ అని రేణు చెప్పుకొచ్చింది .

  • ఈ వారం థియేటర్లకు వచ్చే చిత్రాలివే!

    ప్రతీ శుక్రవారం లాగే ఈ వారం కూడా పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమైయ్యాయి. మరి అవేంటో చూద్దాం.

    • ‘ఓ భామ అయ్యో రామా’ (జులై 11)
    • ‘ది 100’ (జులై 11)
    • ‘వర్జీన్‌ బాయ్స్‌’ (జులై 11)
    • ‘సూపర్‌మ్యాన్’ (జులై 11)
    • ‘మాలిక్‌’ జులై 11