Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • బుల్లితెరపై రీ-ఎంట్రీ ఇస్తున్న మాజీ మంత్రి.. ఫస్ట్‌ లుక్‌!

    కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ మరోసారి బుల్లితెరపై అలరించనున్నారు. ‘క్యూంకి సాస్‌ భి కభీ బహు థి’ సీజన్‌-2లోని ఆమె ఫస్ట్‌ లుక్‌ తాజాగా విడుదలైంది. 25ఏళ్ల తర్వాత ఈ షోలో ‘తులసి విరానీ’ పాత్రలో కనిపించనున్నారు. గతంలోనూ ఆమె ఇందులో నటించారు. ఆపై పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చి కేంద్రమంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో ఓడిపోవడంతో నటిగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు.

  • ‘పంచాయత్‌: సీజన్‌-5’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

    ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ‘పంచాయత్‌: సీజన్‌-5’ సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో అధికారికంగా ప్రకటించింది. 2026లో సీజన్‌5ను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు తెలిపింది.

  • ‘రామాయణ’.. రణ్‌బీర్‌ పారితోషికం ఎన్ని కోట్లంటే?

    రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి సీతారాములుగా నటిస్తోన్న చిత్రం ‘రామాయణ’. తాజాగా ఈ మూవీ నటీనటుల పారితోషికంపై పలు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం రణ్‌బీర్‌ దాదాపు రూ.150 కోట్లు తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. కాగా సుమారు రూ.1600 కోట్లతో రెండు భాగాలుగా రానున్న ఈ ప్రాజెక్ట్‌లో రావణుడిగా యశ్‌ కనిపించనున్నారు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానున్నాయి.

     

  • ఆ వ్యాఖ్యల్లో వివాదమేమీ లేదు..: కంగనా రనౌత్‌

    హిమాచల్‌ప్రదేశ్‌లోని తన నియోజకవర్గం మండీలో వరద ప్రభావిత ప్రాంతాలను ఎంపీ, నటి కంగనా రనౌత్‌ పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘‘నేను కేంద్రమంత్రిని కాదు.. నా దగ్గర విపత్తు నిర్వహణ నిధుల్లేవు’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. అయితే.. ఆ వ్యాఖ్యల్లో వివాదమేమీ లేదని, అది తన భావవ్యక్తీకరణ విధానమని కంగనా తెలిపారు.

     

  • ‘రెండేళ్లుగా నాకు ‘కూలీ’ తప్ప మరే ధ్యాస లేదు’

    రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కూలీ’. ఆగస్టు 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్య్వూలో లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్లుగా నాకు ‘కూలీ’ తప్ప మరే ధ్యాస లేదు. రజనీ సర్‌ సినిమా విషయంలో కొంచెం కూడా నేను పరధ్యానంతో ఉండకూడదనుకున్నా. ఈ కథ, సినిమాకు నేను అంతలా వశమైపోయా’’ అని లోకేశ్‌ అన్నారు.

  • ఓటీటీలోకి ‘8 వసంతాలు’ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

    ఓ ప్రేమ‌జంట జీవితంలోని 8 సంవత్సరాల ప్రయాణం కథగా తెరకెక్కిన సినిమా ‘8 వసంతాలు’. అనంతిక సనీల్‌కుమార్‌, హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో ఫణీంద్ర నర్సెట్టి రూపొందించిన చిత్రమిది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ సోమవారం ఖరారైంది. ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం ఆడియోతో అందుబాటులో ఉండనుంది.

  • ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ప్రోమో.. ఎప్పుడంటే?

    విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కింగ్డమ్’. ఈమూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ప్రోమోను నేడు సా. 7.03 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

  • అమీర్‌తో నాకు సీన్స్ లేవు: నాగార్జున

    రజినీకాంత్ ‘కూలీ’ చిత్రంలో నాగార్జున, అమీర్‌ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. దీనిపై నాగార్జున మాట్లాడుతూ.. ‘‘అమీర్‌ఖాన్, నాకు మధ్య సీన్స్ లేవు. సినిమాలో మావి రెండు వేర్వేరు ఛాప్టర్స్‌. కానీ తర్వాత నేను ఆయన వర్క్ చూశారు. చాలా బాగా నటించారు. మీరు కొత్త అమీర్‌ను చూసి షాక్ అవుతారు’’ అని చెప్పుకొచ్చారు.

  • ప్రభాస్‌ పక్కన మరోసారి తమన్నా.. కాకపోతే చిన్న ట్విస్ట్‌!

    ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రానున్న ‘ది రాజాసాబ్‌’. ఇందులో తమన్నా ఐటెంసాంగ్‌లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. అయితే , గతంలో ప్రభాస్ సరసన రెబల్, బాహుబలి సినిమాలో తమన్నా నటించిన సంగతి తెలిసిందే.

     

  • పూరి-సేతుపతి.. షూటింగ్‌ ప్రారంభం..

    విజయ్‌ సేతుపతి హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. తాజాగా ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. HYDలో వేసిన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది.