రణ్‌బీర్ కపూర్ ‘రామాయాణ’ సినిమాలో రామానంద్ సాగర్ తెరకెక్కించిన ‘రామాయణ్’ సీరియల్‌లో నటించిన అరుణ్ గోవిల్.. దశరథుడి పాత్రలో కనిపించనున్నారు. ఈవిషయంపై ఆ సీరియల్‌లో సీతగా నటించిన దీపికా చిఖాలియా స్పందించారు. ‘‘రామాయణ’ సినిమాలో నటించడానికి అంగీకరించడం ఆయన వ్యక్తిగత నిర్ణయమే అయినప్పటికీ ప్రేక్షకులు దీన్ని అంగీకరించడం కొంచెం కష్టం. ఒక్కసారి రాముడిగా గుర్తింపుతెచ్చుకుంటే ప్రేక్షకుల దృష్టిలో ఎప్పటికీ మీరు రాముడే’’ అని తెలిపారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘ఫిష్ వెంకట్ చికిత్స ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది’
TG: సినీ నటుడు ఫిష్ వెంకట్ చికిత్స కోసం అయ్యే హాస్పిటల్ ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. అనారోగ్యంతో బోడుప్పల్ ఆర్.బి.ఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్‌ను మంత్రి పరామర్శించారు. ఆయన కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. చికిత్స పూర్తి అయ్యే వరకు ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు.
-
మోహన్‌బాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా
నటుడు మోహన్‌బాబు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. విలేకరి రంజిత్‌పై దాడి చేసిన ఘటనలో మోహన్‌బాబుపై పోలీసులు కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పహాడిషరీఫ్ పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని ఇటీవల మోహన్‌బాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించడానికి పోలీసుల తరఫు న్యాయవాది సమయం కోరడంతో..తదుపరి విచారణను హైకోర్టు 9వ తేదీకి వాయిదా వేసింది.
-
యష్ ‘టాక్సిక్’లో అనిరుద్?
కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమాపై తాజా అప్‌డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ భాగమైనట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడానికి అనిరుద్‌ను తీసుకున్నట్లు సమాచారం. దీంతో ‘టాక్సిక్’ తన కన్నడ డెబ్యూను అనిరుద్ ఖాయం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
-
సూపర్ మ్యాన్ మళ్లీ వస్తున్నాడు (VIDEO)
జేమ్స్ గన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూపర్‌మ్యాన్’. ఈ సినిమా జులై 11న ఇంగ్లీష్‌తో పాటు, భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. డీసీ యూనివర్స్‌లోని సూపర్‌మ్యాన్ ఫిల్మ్ సిరీస్‌లకు రీబూట్ వెర్షన్‌గా రానున్న తొలి హాలీవుడ్ చిత్రమిది. తన కుటుంబాన్ని అన్వేషిస్తూ.. సూపర్‌మ్యాన్ చేసే జీవన ప్రయాణం చుట్టూ తిరిగే కథనంతో ఈ చిత్రం రానుంది. సూపర్‌మ్యాన్ అలియాస్ క్లార్క్ కెంట్‌గా డేవిడ్ కొరెన్స్‌వెట్ నటించనున్నారు.
-
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘ఓ భామ అయ్యో రామా’
సుహాస్, మాళవిక మనోజ్ జంటగా రామ్ గోదల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామా’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. జులై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా, అందరిని నవ్వించే యువకుడి చుట్టూ తిరిగే కథతో తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
-
మీకు బీఫ్ తినడమే సమస్యా?: చిన్మయి
బీఫ్ తినే రణ్‌బీర్ కపూర్‌ను ‘రామాయణ’ సినిమాలో రాముడిగా ఎలా ఎంపిక చేశారని నెట్టింట విమర్శలొచ్చాయి. ఈక్రమంలో రణ్‌బీర్‌కు సింగర్ చిన్మయి మద్దతుగా నిలిచారు. ‘‘దేవుని పేరును ఉపయోగించే బాబాజీ రేపిస్ట్ కావచ్చు. ఓట్ల కోసం అతను పెరోల్ పొందుతూనే ఉండవచ్చు. కానీ బీఫ్ తినడం మాత్రం మీకు పెద్ద సమస్య’’ అని పేర్కొన్నారు. డేరా బాబాను ఆమె పరోక్షంగా ప్రస్తావరించారని చర్చ జరుగుతోంది.
-
చిరంజీవి సినిమాలో అతిథి పాత్ర.. ఎలా ఉంటుందో చెప్పిన వెంకటేశ్
హీరో వెంకటేశ్ తన రానున్న సినిమాల లైనప్ చెప్పి అభిమానుల్లో జోష్ నింపారు. అమెరికాలో వైభవంగా జరిగిన ‘నాట్స్ 2025’లో సందడి చేసిన వెంకటేశ్ తన సినిమాల గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఈ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన చిరంజీవి సినిమాలో కనిపించనున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయాన్ని వెంకీ మామ అధికారికంగా ప్రకటించారు.
-
‘కాంతార చాప్టర్ -1’ రిలీజ్ ఎప్పుడంటే?
కన్నడ నటుడు రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.