Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • వారాంతపు సెలవు కోసం ఏడుస్తాను: రష్మిక

    నటి రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను నా సెలవు రోజుల కోసం ఏడుస్తున్నాను. నాకు నాకంటే 16 సంవత్సరాలు చిన్నది అయిన ఒక సోదరి ఉంది. ఆమె ఆలనాపాలనా చూసుకోలేకపోతున్నందుకు బాధగా ఉంది. నేను ఒకటిన్నర సంవత్సరాలుగా ఇంటికి వెళ్ళలేదు. నా స్నేహితులను, కుటుంబాన్ని మిస్ అవుతున్నాను’’ అని పేర్కొన్నారు.

  • బాలయ్యతో మూవీ నెక్ట్ లెవెల్: గోపిచంద్ మలినేని

    నందమూరి బాలకృష్ణతో తాను చేయనున్న సినిమాపై డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. NATS సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘NBK111’ మూవీ నెక్ట్ లెవెల్‌లో ఉంటుంది. బాలయ్య బాబులో ఇంకో యాంగిల్ చూస్తారు.. జై బాలయ్యా’’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఇప్పటికే బాలయ్య-గోపిచంద్ మలినేని కాంబోలో ‘వీరసింహారెడ్డి’ సినిమా వచ్చింది.

  • మహేశ్‌బాబుకు నోటీసులు

    ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీనటుడు మహేశ్‌బాబుకు తాజాగా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. మెస్సర్స్‌ సాయి సూర్య డెవలపర్స్‌ సంస్థను మొదటి ప్రతివాదిగా, యజమాని కంచర్ల సతీష్‌ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా, ప్రచారకర్త సినీనటుడు మహేశ్‌బాబును మూడో ప్రతివాదిగా చేర్చించి. మహేశ్‌బాబు ఫొటోతో ఉన్న బ్రోచర్‌లో వెంచర్‌ ప్రత్యేకతలకు ఆకర్షితులై డబ్బు చెల్లించినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.

  • “గోదావరి” కోసం ఆ హీరోను సంప్రదించా: శేఖర్‌ కమ్ముల

    శేఖర్‌ కమ్ముల అనగానే గుర్తొచ్చే సినిమాల్లో “గోదావరి’ ముందు వరుసలో ఉంటుంది. ఈచిత్రంలో ముందుగా హీరో రోల్‌ కోసం సిద్ధార్థ్‌ను సంప్రదించినట్లు దర్శకుడు శేఖర్‌ ఓఇంటర్వ్యూలో తెలిపారు. అయితే హీరోయిన్‌ చుట్టూ సాగే కథ కావడంతో నో చెప్పారని వెల్లడించారు. మహేశ్‌ బాబును అనుకున్నా, ఆయనను కలవలేదన్నారు. ఫైనల్‌గా రామ్‌ పాత్రకు సుమంత్‌ను ఎంపిక చేశామని తెలిపారు. హీరోయిన్‌గా కమలిని చేశారన్నారు.

     

  • దూసుకుపోతున్న ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్

    పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న పాన్‌ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈనెల 24న రిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. కాగా తెలుగు ట్రైలర్‌కు ఇప్పటివరకూ 50 మిలియన్ల వ్యూస్‌, 770K లైక్స్ వచ్చాయని మేకర్స్ తెలిపారు.

  • ఏడుస్తూ వెళ్తున్న హీరోయిన్‌తో సెల్ఫీ.. వీడియో వైరల్!

    బాలీవుడ్ భామ నోరా ఫతేహీ ఏడుస్తూ విమానాశ్రయంలో వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. అదే సమయంలో ఓ వ్యక్తి ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు. వెంటనే ఆమె బాడీగార్డ్‌ ఆ యువకుడిని గట్టిగా పట్టుకుని పక్కకు తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నోరా ఎందుకు ఏడుస్తూ వెళ్లారో వివరాలు ఇంకా తెలియరాలేదు.

  • ఒకే ఫ్రేమ్‌లో ‘కిస్సిక్’ బ్యూటీతో!

    టాలీవుడ్ స్టార్స్ శ్రీలీల, అల్లు అర్జున్ సుకుమార్‌ కలిసి దిగిన ఐకానిక్ పిక్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ స్టార్స్ తాజాగా యూఎస్‌లో జరిగిన తానా వేడుకకు హాజరయ్యారు.

  • ఎన్టీఆర్‌కు జోడీగా మలయాళీ బ్యూటీ!

    మలయాళీ బ్యూటీ మంజిమా మోహన్ తాజాగా తన ఇన్‌స్టాలో ‘MURUGA’ అనే బుక్‌ను షేర్ చేసింది. ఈ పోస్ట్ కాస్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఇటీవల అలాంటి బుక్‌ను హీరో ఎన్టీఆర్ పట్టుకుని కనిపించాడు. దీంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ‘మురుగన్’ మూవీలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చర్చలు మొదలయ్యాయి. మరి దీంట్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సివుంది.

  • గుత్తా జ్వాల కుమార్తెకు పేరు పెట్టిన ఆమిర్‌ఖాన్‌!

    నటుడు విష్ణు విశాల్‌-గుత్తా జ్వాల దంపతుల కుమార్తెకు బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ పేరు పెట్టారు. విష్ణు విశాల్‌ సోషల్‌‌మీడియాలో ఈ విశేషాన్ని షేర్ చేశారు. ఆమిర్‌తో కలిసి దిగిన ఫొటో పంచుకున్నారు. తమ కుమార్తె పేరు ‘మిరా’ అని తెలిపారు. ‘‘మా బేబీకి పేరు పెట్టడానికి హైదరాబాద్‌ వచ్చిన ఆమిర్‌ఖాన్‌ సర్‌కు కృతజ్ఞతలు. ఆమిర్‌ సర్‌తో ప్రయాణం అద్భుతం’’ అని విష్ణు పేర్కొన్నారు.

  • వారణాసిలో ‘హరిహర వీరమల్లు’ భారీ ఈవెంట్‌.. గెస్ట్‌గా సీఎం!

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఈనెల 24న దేశవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఈవెంట్లను నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా జులై 17న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ ఈవెంట్‌ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరుకానున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.