Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన బాలీవుడ్ బ్యూటీ!

    బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చింది. ‘‘నా భర్త జహీర్ ఇక్బాల్ నాకు రోజూ ఏదో ఒకటి తినిపిస్తూనే ఉంటారు. అలా బయట ఫుడ్ తినడం వల్ల బరువు పెరిగాను. అందువల్ల అందరూ నేను ప్రెగ్నెంట్ అయ్యానని అనుకుంటున్నారు. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజంలేదు’’ అని సోనాక్షి చెప్పుకొచ్చింది.

  • హాట్ అందాలతో రెచ్చిపోయిన పాయల్!

    హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజాగా హాట్ అందాలతో రెచ్చిపోయింది. ఈ బ్యూటీ వంగి మరి కెమెరాకు ఫోజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

  • ‘గోదావరి’ సినిమా మిస్‌ చేసుకున్న సిద్ధార్థ్‌!

    దర్శకుడు శేఖర్‌ కమ్ముల తను తెరకెక్కించిన ‘గోదావరి’ సినిమా కోసం ముందుగా హీరో సిద్ధార్థ్‌ను సంప్రదించారు. ఈ స్టోరీ హీరోయిన్‌ ప్రధానంగా సాగుతుందన్న కారణంతో.. ఈ చిత్రంలో నటించేందుకు ఆయన ఆసక్తి చూపించలేదట. ఈ విషయాన్ని తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో శేఖర్‌ పంచుకున్నారు. ఈ మూవీ కోసం మహేశ్‌బాబునీ అనుకున్నానని, అయితే ఆయన్ను కలవలేదని తెలిపారు. అలా ఫైనల్‌గా సుమంత్‌ హీరోగా ఎంపికయ్యారు.

  • అది పూర్తిగా వారి వ్యక్తిగతం: హీరోయిన్‌ రష్మిక

    హీరోయిన్‌ దీపికా పదుకొణె వర్కింగ్‌ అవర్స్‌ ఎక్కువగా ఉన్న కారణంగా ఓ పెద్ద ప్రాజెక్ట్‌ను వదులుకున్నారంటూ కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా నటి రష్మిక సైతం ఈ అంశంపై పెదవి విప్పారు. పని వేళలనేవి పూర్తిగా చిత్రబృందానికి సంబంధించిన వ్యక్తిగత విషయం అన్నారు. నటిగా తాను ఆయా పరిశ్రమలకు తగిన వర్కింగ్‌ అవర్స్‌లో పని చేస్తున్నానని వెల్లడించారు.

  • హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న బాలనటి

    బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘ధురంధర్‌’. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాతో సారా అర్జున్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ఇప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘నాన్న’ సినిమాలో బాలనటిగా కనిపించగా.. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో నందిని (ఐశ్వర్యా రాయ్‌) చిన్నప్పటి పాత్రలో అలరించింది.

  • ‘నాట్స్‌ 2025’లో అల్లు అర్జున్‌ సందడి.. వీడియో!

    అమెరికా వేదికగా జరిగిన ‘నాట్స్‌ 2025’ వేడుకలో హీరో అల్లు అర్జున్‌ సందడి చేశారు. అక్కడ తెలుగువారి నుంచి ఆయనకు ఘనస్వాగతం లభించింది. బన్నీని చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. ఫ్లోరిడాలోని టాంపా వేదికగా మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో అల్లుఅర్జున్‌తో పాటు దర్శకులు రాఘవేంద్రరావు, సుకుమార్‌, హీరోయిన్ శ్రీలీల పాల్గొన్నారు. వీడియో కోసం ClickHere.

  • బ్యూటీఫుల్‌గా మృణాల్ ఠాకూర్!

    బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన హాట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఇందులో ఆమె పింక్ డ్రెస్ ధరించి బ్యూటీఫుల్‌గా కనిపిస్తోంది.

  • రామ్‌చరణ్‌తో కన్నడ బ్యూటీ రొమాన్స్?

    సుకుమార్-రామ్‌చరణ్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారట సుకుమార్. చరణ్‌కు జోడిగా రుక్మిణి వసంత్‌ను తీసుకుంటే బాగుంటుందని సుకుమార్ ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా చేశారట. దీంతో ఆమె సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

  • ‘హరిహర వీరమల్లు’ ప్రీ-రిలీజ్‌పై ఆసక్తికర అప్‌డేట్!

    పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా ప్రీ-రిలీజ్‌పై ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈనెల 19న తిరుపతిలో ఈ వేడుకను జరపడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్టుగా సమాచారం. అయితే దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా.. ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు.

  • ‘ఆమె నా ఫస్ట్ క్రష్.. ఛాన్స్ వస్తే వదులుకోను’

    అక్కినేని నాగచైతన్య గతంలో తన ఫస్ట్ క్రష్ ఎవరనే విషయాన్ని వెల్లడించాడు. ‘‘నా ఫస్ట్ క్రష్ మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్. ఇదే విషయాన్ని ఆమెను కలిసినప్పుడు సైతం చెప్పాను. అలాగే అలియా భట్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో సినిమా చేసే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.