రెబల్ స్టార్ ప్రభాస్‌పై పంజాబ్ రాష్ట్రంలోని ప్రజలు చూపించిన ప్రేమకు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది చూసి మిగతా సినీ ప్రేమికులు ఇదెక్కడి అభిమానం రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ప్రభాస్‌పై పంజాబ్ ప్రజలు ఏ రేంజ్‌లో తమ అభిమానాన్ని చాటుకున్నారు? అనే విషయం తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
మోడ్రన్ లుక్‌లో మెగా డాటర్!
మెగాడాటర్ నిహారిక తన హాట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఇందులో ఆమె మోడ్రన్ డ్రెస్ ధరించి ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరలవుతోంది.
-
రణ్‌వీర్ ‘ధురంధర్’.. ఫస్ట్ లుక్ టీజర్ అదిరింది!
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ధురంధర్’. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. రణ్‌వీర్ సింగ్ ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే నేడు రణ్‌వీర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘ధురంధర్’ ఫస్ట్ లుక్ పేరిటా టీజర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
-
రష్మిక ‘గర్ల్‌ఫ్రెండ్’ ఫస్ట్ సాంగ్ రెడీ!
హీరోయిన్ రష్మిక ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. దీక్షిత్ శెట్టి హీరో. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. హైదరాబాద్‌లో పాట చిత్రీకరణ చేసుకుంటోంది. ఈనెలలో మూవీ ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేయనున్నారు. అలాగే త్వరలోనే రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతమందిస్తున్నారు.
-
బిలియనీర్ బిజినెస్‌మ్యాన్‌గా బాలీవుడ్ నటుడు!
ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ బిజినెస్‌మ్యాన్‌గా దూసుకుపోతున్నారు. సినిమాల్లో అంతగా మెరవలేకపోయినా, వ్యాపార రంగంలో తానేంటో నిరూపించుకుంటున్నారు. ఒక్క ఏడాది వ్యవధిలోనే తన 12 కంపెనీల కోసం ఆయన ఏకంగా రూ.8,500 కోట్ల నిధులను సమీకరించారు. వీటిలో 2 కంపెనీలు త్వరలోనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కాబోతున్నాయి.
-
విజయ్‌పై దిల్‌రాజు ప్రశంసలు
కోలీవుడ్ నటుడు విజయ్‌పై నిర్మాత దిల్‌రాజు ప్రశంసలు కురిపించారు.‘‘విజయ్ వర్కింగ్ స్టైల్ భిన్నంగా ఉంటుంది. షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారు..ఎప్పుడు పూర్తి చేస్తారు అనే విషయంపై ముందే క్లారిటీ తీసుకుంటారు. ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం తీసుకుని ఆరు నెలల్లో సినిమా షూట్ పూర్తి చేస్తారు’’అని దిల్ రాజు అన్నారు. కాగా, విజయ్ హీరోగా దిల్ రాజు ‘వారిసు’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.
-
ఆర్కే సాగర్ ‘ది 100’.. ట్రైలర్ లాంచ్ చేసిన పవన్ కల్యాణ్
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది 100’. ఈ సినిమాను రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. మిషా నారంగ్ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను పవన్ కల్యాణ్ లాంచ్ చేశారు.
-
పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ ఓపెన్ ఆరోజే!
పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరిహర వీర మల్లు’. ఈ సినిమా 2025 జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. తాజాగా సమాచారం ప్రకారం, అమెరికాలో ప్రీమియర్స్ బుకింగ్‌లు 2025 జూలై 10న ప్రారంభం కానున్నాయి. ఈ బుకింగ్‌లపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఎందుకంటే బుకింగ్‌ల ద్వారా ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న ఆసక్తిని, బజ్‌ను అంచనా వేయవచ్చు.
-
‘ఏఐఆర్’లో సందీప్ రాజ్ మాస్ యాక్టింగ్
హర్ష రోషన్, భాను ప్రకాశ్, జయతీర్థ ప్రధాన పాత్రధారులుగా నటించిన వెబ్ సిరీస్ ‘ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్)’. జోసెఫ్ క్లింటన్ తెరకెక్కించారు. సందీప్ రాజ్ నిర్మించారు. ఇటీవల ఇది ఈటీవీ విన్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిరీస్‌లో దర్శకుడు సందీప్ రాజ్ కాలేజీ హెడ్‌గా తన మాస్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.