Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • తెలుగోళ్లంటే ఫైర్ అనుకున్నారా?.. వైల్డ్ ఫైరు: అల్లు అర్జున్

    అమెరికాలో జరిగిన NATS (North America Telugu Society) 2025 సదస్సుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘పుష్ప-2’ సినిమాలోని డైలాగ్‌తో అదరగొట్టారు. ‘‘తెలుగు సంప్రదాయాన్ని పాటించే స్వేచ్ఛ ఇచ్చినందుకు అమెరికా ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అని చెప్పి.. ‘తెలుగోళ్లంటే ఫైర్ అనుకున్నారా?.. వైల్డ్ ఫైరు..’ అనే డైలాగ్‌తో తన ప్రసంగాన్ని ముగించారు.

  • ‘నేను అమెరికాలోని తెలుగు ప్రజలందరికీ రుణపడి ఉన్నా’

    దర్శకుడు సుకుమార్ NATS సదస్సులో పాల్గొన్నారు. అభిమానులు చూపిస్తోన్న ప్రేమ పట్ల భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నేను అమెరికా తెలుగు ప్రజలందరికీ చాలా రుణపడి ఉన్నాను. మహేశ్ బాబుతో నేను తీసిన ‘1’ నేనొక్కడినే  సినిమా ఇక్కడ మీరందరూ చూడటం వల్లే నాకు వేరే సినిమా ఛాన్స్ వచ్చింది.. నా కెరీర్‌కు బాగా ప్లస్ అయ్యింది’’ అని అన్నారు. కాగా, ‘1’ నేనొక్కడినే మూవీ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. 

     

     

     

  • భారత సినిమా మొదటి ఆర్నెళ్ల రిపోర్ట్ ఇదీ!

    టాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ సక్సెస్‌ రేటు బాగా తగ్గిపోయింది. 2025 ఏడాది మొదలై ఆర్నెళ్లు గడిచినా ఇప్పటికీ టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన సినిమా ఏదీ తెరపై కనిపించలేదు. గతేడాది చివరిలో ‘పుష్ప2’ ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతే.. ఈ ఏడాది మాత్రం అలాంటి మెరుపులు లేవు. ఈ ఆర్నెళ్లలో విడుదలైన 856 భారతీయ సినిమాలు.. బాక్సాఫీస్‌ వద్ద రూ.5,360 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.

  • 100 దేశాల్లో ‘కూలీ’ విడుదల?

    తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ ‘కూలీ’. తాజాగా ఈ సినిమాపై ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా 100కిపైగా దేశాలలో ‘కూలీ’ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంటర్నేషనల్ మూవీ వరల్డ్‌లో ఈ సినిమా ఓ రికార్డు అవుతుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

  • ‘లక్కీ భాస్కర్’కు సీక్వెల్ ఉంది: వెంకీ అట్లూరి

    వెంకీ అట్లూరి  దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా సూపర్ హిట్టైంది. అయితే, తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కిస్సిక్’ టాక్‌షోలో పాల్గొన్న వెంకీ అట్లూరి.. ‘లక్కీ భాస్కర్’ సినిమాకు సీక్వెల్ ఉంటుందని తెలిపారు. ధనుష్‌తో తాను తీసిన ‘సార్’సినిమాకు మాత్రం సీక్వెల్ లేదని తెలిపారు.

  • ప్రభాస్‌తో పోటీపడనున్న రణ్‌వీర్!

    ప్రభాస్‌తో బాక్సాఫీస్ వద్ద పోటీకి బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇవాళ రణ్ వీర్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ‘దురంధర్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజవుతోంది. ఈ మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ప్రభాస్‌తో పోటీకి దిగుతారా? అనేది వేచిచూడాలి.

     

  • VIDEO: కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ సమంత

    ప్రముఖ హీరోయిన్ సమంత కంటతడి పెట్టుకున్నారు. అమెరికాలో జరిగిన TANA-2025 కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ క్రమంలో ‘‘TANA గురించి ప్రతి సంవత్సరం వింటూనే ఉంటా. మొదటి సినిమా నుంచి నాపై మీరు ప్రేమ చూపిస్తున్నారు. నాకు గుర్తింపు ఇచ్చింది మీరే. మీరు భౌగోళికంగా ఎంత దూరం ఉన్నా ఎప్పుడూ నా హృదయంలోనే ఉంటారు’’ అని కన్నీళ్లతో ప్రసంగాన్ని ముగించారు.

  • SSMB29.. సినీ చరిత్రలోనే అతి పెద్ద ఓటీటీ డీల్‌

    మహేశ్‌ బాబు-రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB29 పాన్‌ వరల్డ్‌ మూవీకి సంబంధించి  ఓటీటీ హక్కులను నెట్‌ ఫ్లిక్స్‌ రికార్డు ధరకు కొనుగోలు చేయబోతుంది. సినీ చరిత్రలోనే ఇప్పటివరకు ఇదే అతి పెద్ద డీల్‌గా అంచనా వేస్తున్నాయి. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ మూవీ వచ్చే ఏడాదిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

  • “హరి హర వీరమల్లు’ టికెట్స్‌ బుకింగ్స్‌ ఎప్పుడంటే?

    పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా నుంచి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీ  టికెట్స్‌ బుకింగ్స్‌ జూలై 10వ తేదీ నుంచి ఓపెన్‌ అవుతాయని చిత్రబృందం వెల్లడించింది. క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హరి హర వీరమల్లు’ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

     

  • ఆ సమయంలో 9 రోజులు అన్నం ముట్టను: హీరోయిన్‌

    తాను ఏడాదికి రెండు సార్లు ఉపవాసం ఉంటానని హీరోయిన్‌ నర్గీస్‌ ఫక్రీ తెలిపారు. ఆ సమయంలో 9 రోజులపాటు ఏమీ తిననని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.‘‘ఉపవాసం చేసినన్ని రోజులు నీళ్లుతాగే బతుకుతా. ఫాస్టింగ్‌ అయిపోయేసరికి ముఖం వికృతంగా మారుతుంది. కానీ ముఖంలో గ్లో ఉంటుంది. ఉపవాసం అయ్యాక హైప్రొటీన్‌ ఫుడ్‌ తీసుకుంటా’’ అనిచెప్పుకొచ్చారు. ఇటీవల విడుదలైన “హౌస్‌ఫుల్‌ 5’’ సినిమాతో నర్గీస్‌  ప్రేక్షకులను అలరించారు.