ఆర్కే సాగర్ హీరోగా నటిస్తున్న ‘ది 100’ ఈనెల 11న విడుదలకానుంది. రేపు నిర్వహించనున్న ఈమూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
ట్రెండింగ్‌లో శ్రీలీల ‘వైరల్ వయ్యారి’
గాలి కిరీటి-శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా ‘జూనియర్’. ఈమూవీ నుంచి రిలీజైన ‘వైరల్ వయ్యారి’ సాంగ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ పాట ఇప్పటివరకు 4మిలియన్స్‌పైగా వ్యూస్ రాబట్టింది.
-
ఆషికా రంగనాథ్ అందాల మెరుపులు
హీరోయిన్ ఆషిక రంగనాథ్ హాట్ ఫోజులతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. అందాల వడ్డింపులో ఈ సుందరి ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరలవుతోంది.
-
‘బకాసుర రెస్టారెంట్’.. సాంగ్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్
నటుడు ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఎస్‌జే శివ దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘అయ్యో ఏమీరా ఈ జీవితం’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. వికాస బడిస స్వరాలు సమాకూర్చిన ఈ పాటను ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఆలపించాడు.
-
అమెరికాలో అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అమెరికాలో జరుగుతున్న NATS 2025 వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లాడు. ఫ్లోరిడాలోని టంపాలో బన్నీకి అక్కడి అభిమానులు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. పూలదండలతో, బొకేలతో స్వాగతం పలికారు. ఇక అమెరికా తెలుగు సంబరాలు 2025లో ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ అక్కడున్న తెలుగు వారిని పలకరించనున్నాడు. 3రోజుల పాటు జరిగే ఈ వేడుకలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొంటారు.
-
సమంతతో శేఖర్ కమ్ముల లేడీ ఓరియెంటెడ్ మూవీ?
డైరెక్టర్ శేఖర్ కమ్ములతో స్టార్ హీరోయిన్ సమంత ఓ మూవీ చేయనున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వీరిద్దరి కాంబోలో లేడీ ఓరియెంటెడ్ సినిమా రూపొందనున్నట్లు టాక్. ఈ మూవీలో సామ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది.
-
‘రామాయణ’పై ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్!
నితేశ్ తివారీదర్శకత్వంలో రూపొందుతున్న ఇతిహాసగాథ ‘రామాయణ’. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీత సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని చిత్రబృందం పంచుకుంది. ఈ మూవీ కోసం 10వేల మంది నటీనటులు, టెక్నీషియన్స్ పనిచేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.
-
పాలతో స్నానం.. గులాబీ రేకులపై నిద్ర..: నటుడు రవికిషన్
‘రేసుగుర్రం’తో తెలుగు వారికి పరిచయమైన నటుడు రవికిషన్.. తనకున్న అసాధారణమైన అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పాలతో స్నానం.. గులాబీ రేకులపై నిద్రపోవడం.. వంటివి చేసేవాడినని అన్నారు. నటుడిగా ఇలాంటివి పాటించాలనే భ్రమలో ఉండేవాడినని తెలిపారు. ఆ అలవాట్ల కారణంగా తాను ఓ సినిమాలో అవకాశం కోల్పోయానని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
-
ఆర్కే సాగర్ ‘ది 100’ ట్రైలర్ చూశారా?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది 100’. మిషా నారంగ్ హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. మర్డర్స్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
-
పంజాబ్ నటి తండ్రిని కాల్చి చంపిన దుండగులు
ప్రముఖ పంజాబీ నటి ‘తనేయ’ తండ్రి అనిల్జిత్ కాంబోజ్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. మోగా జిల్లాలోని కాంబోజ్ క్లినిక్‌కు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒక వ్యక్తి తన కాలికి ఇన్ఫెక్షన్ అయ్యిందని చికిత్స చేయమని చెప్పారు. ఇంతలో వెనక నిలబడ్డ మరో వ్యక్తి కాంబోజ్ తలపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయ్యారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డైంది.