Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ఈ వారం ఓటీటీలో అలరిస్తున్న సినిమాలివే!

    ఈ వారం ఓటీటీలో నవ్వులు పంచే సినిమాలు.. ఉత్కంఠ పెంచే సిరీస్‌లు అలరిస్తున్నాయి. మరి ఏ ఓటీటీలో ఏ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం.

    • నెట్‌ఫ్లిక్స్‌: ‘థగ్‌ లైఫ్‌’
    • ఈటీవీ విన్‌: ‘ఏఐఆర్‌ ఆల్‌ ఇండియా ర్యాంకర్స్‌’
    • అమెజాన్ ప్రైమ్‌ ఒరిజినల్‌: ‘ఉప్పు కప్పురంబు’
    • జియో హాట్‌స్టార్‌: ‘గుడ్‌వైఫ్‌’
    • సోనీలివ్‌: ‘ది హంట్‌’
    • జీ5: ‘కాళీధర్‌ లాపత్త’

  • 40 ఏళ్ల వయసు.. IVFతో తల్లి కాబోతున్న నటి!

    కన్నడ నటి భావన రామన్న ఇన్‌స్టా వేదికగా కీలక ప్రకటన చేశారు.  “20, 30 ఏళ్ల వయసులో నాకు తల్లి కావాలనే కోరిక ఉండేది కాదు. 40 ఏళ్లకు వచ్చేసరికి ఆ కోరిక తీరడం కష్టమైపోయింది. కానీ,  IVF ద్వారా తాను కవలలకు తల్లి కాబోతున్నా. నా పిల్లలకు తండ్రి లేకపోవచ్చు. కానీ వారు గర్వపడేలా పెంచుతాను’ అని అవివాహితైన ఆమె రాసుకొచ్చారు.

     

     

  • వెంకటేశ్‌కు జోడీగా ‘నిధి అగర్వాల్‌’?

    వెంకటేశ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్‌ వచ్చింది. ఇందులో ఒక హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ ఖరారైనట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఈ మూవీకి ‘వెంకట రమణ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీ షూటింగ్‌ ఆగస్టులో ప్రారంభం అవుతుందని సమాచారం.

  • “తమ్ముడు” తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

    నితిన్‌ హీరోగా రూ.75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన “తమ్ముడు’’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.3 కోట్లు గ్రాస్‌ వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. ఇండియాలో రూ.2 కోట్ల కలెక్షన్లు వచ్చాయని వెల్లడించాయి. అయితే, సినిమాకు ఫ్లాప్‌ టాక్‌ రావడంతో లాంగ్ రన్‌లో భారీ కలెక్షన్లు రాకపోవచ్చని తెలుస్తోంది.

  • అనుష్క ‘ఘాటి’ వాయిదా.. టీమ్‌ ప్రకటన

    అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఘాటి’. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ నెల 11న విడుదల కావాల్సి ఉంది. అయితే, పలు కారణాలతో ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే మరో విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు.  కాగా, ఈ చిత్రాన్ని యూవీ సంస్థ నిర్మిస్తోంది.

  • ఐ ఫోన్లు… డబ్బుల వర్షం..

    థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం కోసం సెలబ్రిటీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తారు. ‘వర్జిన్ బాయ్స్’ మూవీ టీమ్ ఒక అడుగు ముందుకు వేసి బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. జూలై 11 నుంచి 13వ తేదీ  వరకు థియేటర్లలో డబ్బులు వర్షం కురుస్తుందని హీరోయిన్ మిత్రా శర్మ తెలిపారు. ఇక, నిర్మాత రాజా దారపునేని అయితే తమ సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులలో 11 మందికి ఐ ఫోన్లు బహుమతిగా ఇస్తామని తెలిపారు.

     

  • ఫిష్‌ వెంకట్‌‌కు మెట్టు సాయికుమార్ సాయం

    టాలీవుడ్‌ నటుడు ఫిష్‌ వెంకట్‌ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో వెంకట్‌ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిష్ వెంకట్‌కు సాయం చేయాలని ఆయన భార్య, కూతురు వేడుకుంటున్నారు. దీంతో ఫిషర్‌మెన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్ హాస్పిటల్‌కు వెళ్లి వెంకట్ కుటుంబసభ్యులను కలిసి రూ. లక్ష ఆర్ధిక సాయం అందజేశారు.

  • విడాకుల వార్తలపై స్పందించిన అభిషేక్‌ బచ్చన్‌

    అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్య రాయ్‌తో విడాకుల వార్తలపై స్పందించారు. ‘‘ఇలాంటి అసత్య ప్రచారాలను తాము పట్టించుకోమని అన్నారు. తాను సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నానని, కుటుంబంతో సంతోషంగా ఉన్నానని వెల్లడించారు. సోషల్ మీడియా ట్రోల్స్‌ను నిర్లక్ష్యం చేస్తూ, నెగెటివ్ వార్తలకు సమాధానం చెప్పవలసిన అవసరంలేదని చెప్పారు.

  • సైఫ్‌ అలీ ఖాన్‌కు హైకోర్టులో చుక్కెదురు

    భోపాల్‌లోని పూర్వీకుల ఆస్తులకు సంబంధించి సైఫ్ అలీ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. తన ముత్తాత పాకిస్తాన్‌కు వలస వెళ్లిన కారణంగా రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులను “శత్రువుల ఆస్తి”గా న్యాయస్థానం గుర్తించింది. సైఫ్, ఆయన సోదరీమణులు తమ పూర్వీకుల ఆస్తులకు వారసులుగా గుర్తించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.

  • ఆగస్టు 1న తరుణ్‌ భాస్కర్‌ ‘ఓం శాంతి..’

    తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బా ప్రధానపాత్రల్లో దర్శకుడు ఏఆర్ సంజీవ్ తెరకెక్కించిన చిత్రం  ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈ చిత్రం ఆగస్టు 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.