చాలా మంది హీరోయిన్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌గానే ఉంటున్నారు. అలాంటి వారిలో నటి రెజీనా ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘మీకు 34 ఏళ్లు వచ్చాయి.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు’ అన్న ప్రశ్నకు.. ముక్కు సూటిగా రెజీనా బదులిచ్చింది. ‘‘పెళ్లి గురించి మా అమ్మనే అడగదు మీరెందుకు అడుగుతున్నారు. నా పెళ్లి గురించి మీకెందుకు’’ అని సమాధానమిచ్చింది. పెళ్లి కంటే ఫ్రెండ్‌షిప్ బెటర్ అని తెలిపింది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
నటి తండ్రిపై కాల్పులు.. పరిస్థితి విషమం
పంజాబీ నటి తానియా తండ్రి అనిల్ జిత్ సింగ్ కాంబోజ్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. మోగాలో ఈ ఘటన జరిగింది. వెంటనే ఆయనను ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తన తండ్రి పరిస్థితి విషమంగా ఉందని నటి తానియా తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తన గోప్యతను గౌరవించాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.
-
ఆసక్తికరంగా ‘ఓ భామ అయ్యో రామా’ ట్రైలర్
సుహాస్, మాళవిక మనోజ్ జంటగా రామ్ గోదల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామా’. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా జులై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్రబృందం పంచుకుంది. ట్రైలర్‌లో దర్శకుడు హరీశ్ శంకర్, మారుతి కనిపించి అందరిలో ఆసక్తి పెంచారు.
-
‘వార్-2’పై నాగవంశీ ఆసక్తికర వీడియో
‘వార్-2’ తెలుగు రైట్స్‌ను ప్రముఖ నిర్మాత నాగవంశీ తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఎన్టీఆర్ కాంబోలో ‘అరవింద సమేత’, ‘దేవర’ సినిమాల తర్వాత తాను పని చేస్తున్న మూడో సినిమా ‘వార్-2’ అని రాసుకొచ్చారు. మూడో బ్లాక్‌బస్టర్‌కు సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు.
-
బిగ్ అప్‌డేట్ రానుంది: నాగవంశీ ట్వీట్
ప్రముఖ నిర్మాత నాగవంశీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ ఉదయం 11.08 గంటలకు ఓ సాలిడ్ అప్‌డేట్ ఉండనుందని వెల్లడించారు. ‘గర్జన ఒక లెక్కింపు అవుతుంది’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో హృతిక్ రోషలన్, ఎన్టీఆర్ కాంబోలో రానున్న ‘వార్-2’పై అప్‌డేట్ రానుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
-
కమల్‌కు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
కన్నడ భాషకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నటుడు కమల్ హాసన్‌కు బెంగళూరు కోర్టు నిషేధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను కోర్టు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 30కి వాయిదా వేసింది. కాగా థగ్ లైఫ్ రిలీజ్ టైమ్‌లో కమల్ హాసన్ తమిళం నుండి కన్నడ బాష పుట్టిందని మాట్లాడిన విషయం తెలిసిందే.
-
దివాలా వార్తలను ఖండించిన నటి రకుల్ ప్రీత్‌సింగ్ భర్త
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, నటి రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ తన ఆర్థిక పరిస్థితిపై వస్తున్న వదంతులపై స్పందించారు. ‘బడే మియా ఛోటే మియా’ సినిమా భారీ నష్టాలను మిగల్చడంతో తాను దివాలా తీశానని, తినడానికి కూడా డబ్బుల్లేవంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ రూమర్ల వెనుక ఎవరున్నారో తెలియదని, కానీ ఎవరినీ నిందించదలచుకోలేదని అన్నారు.
-
కళ్లు చెదిరేలా ‘రామాయణ’ బడ్జెట్
రణ్‌బీర్ కపూర్ ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం ‘రామాయణ’. ఈ మూవీ బడ్జెట్‌కు సంబంధించిన వార్తలు తాజాగా వైరలవుతున్నాయి. రూ.1600కోట్లతో దీన్ని రూపొందించనున్నట్లు బాలీవడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీలో సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్, హనుమాన్‌గా బాబీ డియోల్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది.
-
గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత
హాలీవుడ్ యాక్టర్ జులియన్ మెక్‌మహన్(56) కన్నుమూశారు. క్యాన్సర్‌తో మెక్‌మహన్ చనిపోయినట్లు ఆయన భార్య కెల్లీచ ధ్రువీకరించారు. ఆస్ట్రేలియా మాజీ ఎంపీ విలియమ్ కుమారుడైన జులియన్ 2003లో Nip/Tuck మూవీతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మార్వెల్ మూవీస్ ‘ఫెంటాస్టిక్ ఫోర్’లో ‘Dr.డూమ్’గా పాపులర్ అయ్యారు. ఇటీవల ‘FBI: మోస్ట్ వాంటెడ్’లో లీడ్ రోల్ పోషించారు.
-
అర్జీత్ సింగ్ అరుదైన రికార్డు
బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జీత్ సింగ్ అరుదైన రికార్డ్ సాధించారు. మ్యూజిక్ స్టీమింగ్ ప్లాట్‌ఫామ్ స్పాటిఫైలో 151 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో టేలర్ స్విఫ్ట్(139.6M), ఎడ్ షీరన్(121M) వంటి ఇంటర్నేషనల్ స్టార్స్‌ను వెనక్కినెట్టారు. అత్యధిక ఫాలోవర్లు కలిగిన సింగర్‌గా నిలిచారు. అర్జీత్ తర్వాత ఇండియన్స్‌లో ఏఆర్ రెహమాన్(65.6M) 14వ స్థానం, ప్రీతమ్(53.4M) 21, నేహా కక్కర్(48.5M) 25వ ప్లేస్‌లో ఉన్నారు.