నటులు అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ మృతిపై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ‘‘మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.. ఓం శాంతిః’’ అని ట్వీట్ చేశారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
అల్లు అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నమ్మ(94) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో అర్ధరాత్రి 1.45 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. ఇవాళ మధ్యాహ్నం కోకాపేటలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ముంబైలో ఉన్న అల్లు అర్జున్ మధ్యాహ్యానానికి హైదరాబాద్‌కు రానున్నారు. అలాగే మైసూర్‌లో ఉన్న రామ్‌చరణ్ కూడా వస్తారని తెలుస్తోంది.
-
శంకరవరప్రసాద్‌తో వెంకీ చేతులు కలిపేది అప్పుడే!
‘మన శంకరవరప్రసాద్ గారు’గా సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. హీరో వెంకటేశ్ ఇందులో ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్నట్లు అనిల్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా కోసం ఆయన వచ్చే నెల మధ్య నుంచి సెట్లోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో మొదలు కానున్న ఈ కొత్త షెడ్యూల్ కోసం ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి.
-
అల్లు అర్జున్ మూవీలో యోగిబాబు!
హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘AA22’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం చిత్ర బృందం ముంబైలో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో నటి మృణాల్ ఠాకూర్, ప్రముఖ కమెడియన్ యోగిబాబు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. యోగిబాబు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-
నేడు పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ రీ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అరుణ్ ప్రసాద్ తెరకెక్కించిన ‘తమ్ముడు’ సినిమా నేడు రీ రిలీజ్ కానుంది. ఎంపిక చేసిన థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. తొలుత సెప్టెంబర్ 2న రీ రిలీజ్ చేద్దామని భావించి తాజాగా డేట్ మార్చారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘జల్సా’ సినిమా కూడా సెప్టెంబర్ 2న విడుదల కానుంది.
-
ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సినిమాలకు దీటుగా ఓటీటీ సంస్థలు వెబ్‌సిరీస్‌లను నిర్మిస్తున్నాయి. విభిన్న కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాయి. ఇప్పటికే పలు సిరీస్‌లను రిలీజ్ చేసి, మెప్పించిన ‘జియో హాట్‌స్టార్’ మరో సిరీస్‌ను తీసుకొస్తోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన కామెడీ సిరీస్ ‘పోలీస్ పోలీస్’ను సెప్టెంబరు 19న విడుదల చేయనుంది. ఈ వివరాలు ప్రకటిస్తూ తమిళ్ ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది.
-
‘త్రిబాణధారి బార్బరిక్’.. టికెట్స్ ఫ్రీ
సత్యరాజ్, ఉదయభాను ప్రధాన పాత్రలలో నటించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం నేడు విడుదలైంది. సెప్టెంబర్ 7 గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా చిత్రయూనిట్ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆగస్టు 30, 31 తేదీలలో సాయంత్రం షోకు కుటుంబంతో వచ్చేవారిలో ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్‌కు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ఈ సినిమా తాత, మవవరాలికి సంబంధించిన కథ కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎక్కువగా కదిలిస్తుండటంతో ఈ ఆఫర్‌ను చిత్రయూనిట్ అందిస్తోంది.
-
మరోసారి తల్లి కాబోతున్న హీరోయిన్.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ నటి పూర్ణ మరోసారి తల్లి కాబోతుంది. తను రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించింది. ‘‘ఈ శుభవార్తతో మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి’’ అంటూ పూర్ణ పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని తన మొదటి కుమారుడితో పలు ఫొటోలు పంచుకుని తెలిపింది. దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను 2022లో పూర్ణ పెళ్లి చేసుకుంది. ఆ మరుసటి ఏడాదే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
-
విజయ్ ‘జన నాయగన్’.. ఫస్ట్ సాంగ్ అప్పుడే?
హెచ్.వినోద్ డైరెక్షన్‌లో హీరో దళపతి విజయ్ నటిస్తున్న చిత్రం ‘జన నాయగన్’. పూజాహెగ్డే, మమిత బైజు హీరోయిన్లు. ఈ సినిమా 2026 జనవరి 9న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘జన నాయగన్’ ఫస్ట్ సింగిల్ దీపావళి కానుకగా రాబోతున్నట్లు టాక్. ఈపాటలో విజయ్‌తో పూజా, మమిత బైజు చిందులేయబోతున్నట్లు సమాచారం.
-
స్టేజీపైనే స్టెప్పులేసిన హీరో.. హీరోయిన్ రియాక్షన్ ఇది!
హీరో శివ కార్తికేయన్ నటిస్తోన్న చిత్రం ‘మదరాసి’. మురుగదాస్ దర్శకుడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్ కనిపించనుంది. తాజాగా బెంగళూరులో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా శివ కార్తికేయన్ వేదికపైనే డ్యాన్స్‌తో అలరించాడు. ఈ సినిమాలోని ‘సలంబల’ అనే పాటకు తన స్టెప్పులతో అదరగొట్టేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(వీడియో)