Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ఆకట్టుకుంటున్న ‘కొత్తపల్లిలో.. ఒకప్పుడు’ టీజర్

    నటి ప్రవీణ పరుచూరి, రానా దగ్గుబాటి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. తన కంపెనీలో పని చేయాలని డ్యాన్సర్ వెంటపడిన ఓ యువకుడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే కథాంశంలో ఈ చిత్రం తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

  • మరోసారి స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల!

    ‘పుష్ప 2’లో స్పెషల్ సాంగ్‌తో శ్రీలీల ఊపేసిన సంగతి తెలిసిందే.  తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో చిందులేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య, విరూపాక్ష ఫేమ్ దర్శకుడు కార్తీక్ దండు కాంబినేషన్‌లో మిస్టిక్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీలో సాంగ్‌ చేయమని ఆమెను మూవీటీం అప్రోచ్ అయినట్లు సమాచారం. మేకర్స్‌కు శ్రీలీల ఒకే చెబుతుందో లేదో చూడాలి మరి.

  • ‘స్పిరిట్​’ షూటింగ్​కు ముహూర్తం ఫిక్స్!

    ప్రభాస్ హీరోగా,  డైరెక్టర్ సందీప్​రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘స్పిరిట్’. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ గురించి సందీప్​రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి అప్డేట్ ఇచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్​లో సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. తొలి షెడ్యూల్​ నుంచే ప్రభాస్ సెట్స్​లో పాల్గొంటారని చెప్పారు.

  • మిస్టీరియస్ మూవీ టీజర్ విడుదల

    రక్త కన్నీరు’ నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, బిగ్‌బాస్ ఫేమ్ రోహిత్ సహానీ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మిస్టీరియస్’. రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. తాజాగా మూవీ టీమ్ టీజర్‌ను విడుదల చేసింది. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

  • ‘సర్జమీన్‌’ ట్రైలర్‌ చూశారా!

    పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధానపాత్రలో నటించిన ‘సర్జమీన్‌’ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ తనయుడు ఇబ్రహీం అలీఖాన్‌ ఇందులో కీలకపాత్రలో కనిపించనున్నారు. జులై 25 నుంచి జియో హాట్‌స్టార్‌ వేదికగా ఈ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో పృథ్వీరాజ్‌ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించారు.

     

     

  • ప్రహ్లాదుడి ప్రోమో రిలీజ్‌

    ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘మహావతార్‌: నరసింహ’. జులై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని పాత్రలను పరిచయం చేస్తూ వరుస వీడియోలను విడుదల చేస్తోంది. తాజాగా ప్రహ్లాదుడి పాత్రకు సంబంధించిన ప్రోమోను నిర్మాణ సంస్థ పంచుకుంది. ఒకే నామం అన్నిటికీ సమాధానం అంటూ విష్ణువుపై తన భక్తిని చాటే ప్రహ్లాదుడు మాటలు ఆకట్టుకుంటున్నాయి.

  • డైరెక్టర్ విగ్నేశ్‌పై ట్రోలింగ్.. ఇదే కారణం!

    ప్రముఖ దర్శకుడు, నయనతార భర్త విగ్నేశ్‌పై నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న కొరియోగ్రఫర్ జానీతో ఆయన కలిసి పని చేయడమే ఇందుకు కారణం. తన కొత్త సినిమా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’లో జానీతో కలిసి తాను పని చేస్తున్నట్లు విగ్నేశ్ ప్రకటించారు. దీంతో ఓ పోక్సో కేసులో అరెస్టయిన జానీతో పని చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.

  • అల్లు అరవింద్‌ను ప్రశ్నించిన ఈడీ.. కారణమిదే!

    ప్రముఖ నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్‌ను ఈడీ విచారించింది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్‌ కేసులో మూడు గంటల పాటు అల్లు అరవింద్‌ను ఈడీ ప్రశ్నించింది. 2018-19లో జరిగిన ఈ స్కామ్‌కు సంబంధించి.. ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల కొనుగోలుపై వివరాలు అడిగింది. వచ్చే వారం మరోసారి విచారణకు రావాలంటూ అరవింద్‌కు నోటీసులు జారీ చేసింది.

  • ఫిష్ వెంకట్‌కు అండగా ప్రభాస్!

    టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయనకు కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ అండగా నిలిచారని తెలుస్తోంది. అసలు ఫిష్ వెంకట్ విషయంలో ప్రభాస్ చేస్తున్న సాయం ఏమిటో తెలుసుకోవడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

  • ఉప్పు కప్పురంబు మూవీ రివ్యూ

    కీర్తిసురేశ్, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఉప్పు కప్పురంబు’ మూవీ నేటి నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ  అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.  . శ్మశానం భూమి కొరత.. అనేది ప్రస్తుతం సమాజంలో నెలకొన్న సమస్యల్లో ఒకటి. దానికి వినోదం జోడించి తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేయడంలో దర్శకుడు ఐవీ శశి కొంతవరకూ సఫలమయ్యారు. మొత్తానికి ఈ మూవీని ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు.