క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఘాటి’ని జులై 11న సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) పనులు పూర్తి కాలేదని సమాచారం. దీంతో.. ‘ఘాటీ’ విడుదల మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఆగస్టు 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయొచ్చు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘సితారే జమీన్ పర్’ కలెక్షన్ ఏంతంటే?
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, హీరోయిన్ జెనీలియా కాంబోలో వచ్చిన చిత్రం ‘సితారే జమీన్ పర్’. JUN 20న రిలీజైన ఈ మూవీ ఇప్పటివరకు రూ.135 కోట్లు కలెక్షన్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తోలి రోజు మిక్స్‌డ్ టాక్‌తో నిరాశపరిచినా, ప్రస్తుతం కలెక్షన్లలో దూసుకుపోతుంది. ఇతర సినిమాల పోటీ లేకపోవడంతో వసూళ్లు కొనసాగుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.
-
‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ రికార్డు
పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. రిలీజైన 24 గంటల్లో 46.2 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. టాలీవుడ్ చరిత్రలో ఒక్కరోజులోనే అత్యధిక వ్యూస్ వచ్చిన సినిమా ట్రైలర్‌గా నిలిచింది. కాగా, ఈ మూవీ ఈ నెల 24న రిలీజ్ కానుంది.
-
‘#NC24’ అప్‌డేట్ షేర్ చేసిన మూవీ టీమ్
నాగచైతన్య ప్రధాన పాత్రలో కార్తిక్ దండు దర్శకత్వంలో ‘#NC24’ ఓ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా దీని రెండో షెడ్యూల్ ప్రారంభమైనట్లు మూవీ టీమ్ తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేసింది.
-
కన్నప్ప ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే?
నటుడు మంచు విష్ణు, ప్రభాస్ కలిసి నటించిన చిత్రం కన్నప్ప. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీ రిలీజైన 7 రోజుల్లో రూ.30.10 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిందని సమచాారం రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘కన్నప్ప’ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 180 కోట్లు సాధించాలి. మరీ లాంగ్ రన్‌లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించకపోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు.
-
అనుదీప్‌ను తోసేసిన పోలీసులు(VIDEO)
పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా ట్రైలర్ ఈవెంట్‌ను నిన్న హైదరబాద్‌లోని విమల్ థియేటర్‌లో నిర్వహించారు. దీనికి గెస్టుగా డైరెక్టర్ అనుదీప్ కూడా హాజరయ్యారు. అయితే, థియేటర్‌కు వచ్చిన అనుదీప్‌ను పోలీసులు అడ్డుకుని తోసేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘పాపం అనుదీప్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
-
‘రామాయణ’లో నటి దీపికా చిఖాలియా.. అలనాటి సీత ఏమన్నారంటే!
రాణ్‌బీర్ కపూర్ రామాయణ సినిమా కోసం ఆ మూవీ టీమ్.. ‘రామాయణ్’ సీరియల్‌లో సీతగా నటించిన అలనాటి నటి దీపికా చిఖాలియాను సంప్రదించారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై దీపిక స్పందించారు. ‘‘ఆ చిత్ర బృందంలోని వారెవరూ నన్ను సంప్రదించలేదు. ఒక్కసారి రామాయణంలో సీతగా నటించిన తర్వాత.. ఆ కథలో వేరే పాత్రలేవీ పోషించలేను. మహాభారతం, శివపురాణంలో ఏదైనా అవకాశం వస్తే ఆలోచిస్తాను’’ అని తెలిపారు.
-
ప్రముఖ నటుడు కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సెన్ కన్నుమూశారు. (67). గుండెపోటు కారణంగానే ఆయన మరణించారని తెలుస్తోంది. కిల్ బిల్: వాల్యూమ్. 1 & 2, రిజర్వాయర్ డాగ్స్, తదితర సినిమాల్లో ఆయన గుర్తింపు పొందారు. ‘‘మైఖేల్ మాడ్సెన్ హాలీవుడ్‌లోని అత్యంత ప్రసిద్ధ నటులలో ఒకరు, ఆయనను చాలా మంది మిస్ అవుతారు’’ అని ఆయన సన్నిహితులు చెప్పారు.
-
ఎంతో ఆసక్తిగా ఉన్నాను.. ‘SSMB29’పై ప్రియాంక చోప్రా
మహేశ్‌బాబు, రాజమౌళి కాంబోలో రానున్న ‘SSMB29’పై నటి ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ భారతీయ సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఆ ప్రాజెక్ట్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు. ఈ క్రమంలోనే మణిరత్నం ‘బొంబాయి’ సినిమా ఎంతో ఇష్టమన్ని ప్రియాంక పేర్కొన్నారు.