Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • కోవిడ్ వ్యాక్సిన్లపై బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంంట్స్

    కోవిడ్ వ్యాక్సిన్లపై బిగ్‌బాస్ 18 ఫేమ్ శ్రుతిక అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దారుణమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నానని తెలిపారు. ‘నా బీపీ ఏకంగా 40కి పడిపోయింది. నా ఎడమ చేయి ఎత్తలేకపోయా. దవడ లాగింది. పక్షవాతం రాకుండా ఉండటానికి నా చేతిని కదిలిస్తూనే ఉన్నా’’ అని చెప్పుకొచ్చారు.

  • సినిమా పైరసీ కేసు.. వెలుగులోకి నిందితుడు కిరణ్ బాగోతం!

    HYD: సినిమాలను పైరసీ చేసి అరెస్టయిన కిరణ్ కుమార్‌పై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తోన్న కిరణ్‌.. 2019 నుంచి ఇప్పటి వరకు 65 సినిమాలను పైరసీ చేశాడు. వాటిని పలు సైట్లకు విక్రయించాడు. ఒక్కో సినిమాకు రూ.40వేల నుంచి రూ.80వేల వరకు చెల్లింపులు జరిగాయి. కిరణ్‌కు క్రిప్టో కరెన్సీ రూపంలో కమీషన్‌ వచ్చేది. ఇటీవల #సింగిల్‌ సినిమానూ పైరసీ చేశాడు.

  • ‘హరిహర వీరమల్లు’తో..ఇండస్ట్రీ రికార్డులు మారతాయ్‌: దర్శకుడు జ్యోతికృష్ణ

    పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో దర్శకుడు జ్యోతికృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.  ప్రేక్షకులకు మంచి సినిమాను అందించడం కోసమే కష్టపడ్డామని, అందుకే ఆలస్యం అయిందని దర్శకుడు జ్యోతికృష్ణ అన్నారు. ఈసారి మాత్రం సినిమా విడుదల తేదీ మారదు.. కానీ ఇండస్ట్రీ రికార్డులు మారతాయని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

     

  • పైరసీ వల్ల రూ.3700 కోట్ల నష్టం.. అంతా ఆ ఒక్కడి వల్లే!

    HYD: తెలుగు, తమిళ సినిమాలను పైరసీ చేసి అమ్ముతున్న కిరణ్ కుమార్‌‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కామ్ కార్డు ద్వారా 40 పెద్ద సినిమాలను కిరణ్ పైరసీ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో సినీ పరిశ్రమకు రూ.3700 కోట్ల నష్టం వచ్చింది. నిందితుడి పై 1957 కాపీ రైట్ యాక్ట్, ఐటీ యాక్ట్‌లతో పాటు పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.

  • పవన్ కల్యాణ్ మ్యానరిజంతో అదరగొట్టిన నిధి

    ప‌వ‌న్ కల్యాణ్ మ్యానరిజాన్ని సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప‌లువురు హీరోలు ఇమిటేట్ చేయ‌డం చూశాం. ఇపుడీ ఈ జాబితాలో హీరోయిన్ నిధి అగర్వాల్ చేరింది. తాజాగా ‘హరిహర వీరమల్లు’ మూవీ ట్రైలర్ ఈవెంట్‌లో పవన్ మ్యానరిజాన్ని ఇమిటేట్ చేసింది. కాగా, ఈ సినిమాలో నిధి అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

     

  • HHVM ట్రైలర్‌లో ‘మావ‌య్య’ డైలాగ్ అందుకోసమేనా?

    పవన్ కల్యాణ్ న్యూ మూవీ ‘హరిహర వీరమల్లు(HHVM)’ ట్రైలర్‌లోని ‘నువ్వు మా వెర్రి విస్స‌న్న మావ‌య్య క‌దూ’ అనే డైలాగ్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే పిల్ల‌ల చేత బ‌ల‌వంతంగానైనా ‘మావ‌య్య‌’ అని పిలిపించుకోవాల‌ని త‌హ‌త‌హలాడే ఓ రాజ‌కీయ నేతను ఉద్దేశించే ఈ డైలాగ్ పెట్టినట్లు ఉన్నారని నెటిజన్లు అంటున్నారు. మరీ ఆ రాజకీయ నేత ఎవరో మీరు కామెంట్ చేయండి.

     

  • రామాయణ గ్లింప్స్.. ఓంరౌత్‌పై ట్రోల్స్

    డైరెక్టర్ ఓం రౌత్‌పై సినీ ప్రియులు సెటైర్లు వేస్తున్నారు. స్టార్‌ డైరెక్టర్‌ నితేశ్‌ తివారీ తెరకెక్కిస్తోన్న ‘రామాయణ’ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌ వీడియోలో VFX, అదిరిపోయే BGM, రాముడిగా రణ్‌బీర్‌ లుక్స్‌ ఆకట్టుకుంటున్నాయని  అంటున్నారు. దీంతో ‘ఆదిపురుష్‌’ను తెరకెక్కించిన ఓంరౌత్‌ను గుర్తుచేసుకుంటున్నారు. ఈ గ్లింప్స్‌ వీడియోను చూసి ఓంరౌత్ నేర్చుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్‌ లుక్స్‌ & పూర్‌ VFX ఫొటోలు పేర్‌ చేస్తున్నారు.

     

     

  • HHVM ట్రైలర్‌లో ప్రధాని మోదీ డైలాగ్

    పవన్ కల్యాణ్ న్యూ మూవీ ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌లో ‘అంధీ’ ఆగయా అనే డైలాగ్  గురించే అందరూ చర్చించుకుంటున్నారు.  నిజానికి ఈ వర్డ్ ఇటీవల ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ అన్నారు.   అంధీ అంటే తూఫాన్. పవన్ ను మోదీ పిలిచిన ఆ మాటను హరి హర వీరమల్లులో వాడేశారని నెటిజన్లు అంటున్నారు.

     

     

  • ‘మెగా-157’లో చిరంజీవి ఫస్ట్ లుక్ .. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో ‘మెగా-157’ మూవీ రానుంది.  ఈ మూవీపై తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ..‘ఎప్పటినుంచే ఎదురు చూస్తున్న ఆడియన్స్‌కు ఈ సినిమా కచ్చితంగా మంచి ఎంటర్‌టైన్‌ను ఇస్తుంది. అందరికీ ఈ స్టోరీ కనెక్ట్ అవుతుంది. చిరంజీవిని ప్రజెంట్ చేసే విధానం సర్‌ప్రైజ్‌గా ఉంటుంది’ అన్నారు.దీంతో మెగాఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

     

     

  • ‘రామాయణ’ ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్‌

    నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయి పల్లవి  నటిస్తోన్న చిత్రం ‘రామాయణ’. ఈ మూవీ గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.  రావణాసురుడి పాత్రలో యశ్ నటిస్తున్నారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో సినిమాలోని పాత్రలను పరిచయం చేసింది. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం మొదటి పార్ట్‌ 2026కు, రెండోది 2027లో విడుదల కానుంది.