Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • తారక్- హృతిక్ వేర్వేరుగా ‘వార్ 2’ ప్రమోషన్స్

    ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కీలక పాత్రల్లో నటించిన ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న వరల్డ్​వైడ్ ​గ్రాండ్​గా రిలీజ్ కానుంది. రిలీజ్ తేదీ దగ్గరపడుతుండడంతో మేకర్స్​ ప్రమోషన్స్ పనులు మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ ప్రమోషన్స్​లో హీరోలు తారక్- హృతిక్ కలిసి పాల్గొనరని తెలుస్తోంది.  ఈ ఇద్దరూ వేర్వేరుగా సినిమా ప్రమోషన్స్ చేస్తారట.

  • త్రివిక్ర‌మ్‌ను వ‌ద‌ల‌ని పూన‌మ్‌.. మ‌రోసారి హాట్ కామెంట్స్‌!

    నటి పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచింది. డైరెక్టర్‌ త్రివిక్రమ్‌పై ఆరోపణలతో హాట్‌ టాపిక్‌గా మారిన పూనమ్ మరో ట్వీట్‌ చేసింది. ఒరిజినల్ కంటెంట్, స్క్రిప్ట్‌ ఉన్న దర్శకుడు క్రిష్ అంటూ కొనియాడింది. ఎన్నో కాపీరైట్ సమస్యలు, పీఆర్ స్టంట్‌లు ఉన్న దర్శకుడికి వచ్చినంత గుర్తింపు, విజయం లభించడం లేదని రాసుకొచ్చింది. ఈ ట్వీట్ చూస్తే త్రివిక్రమ్‌ను ఉద్దేశించే పోస్ట్ చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

  • తెలంగాణలో PVR ఐనాక్స్‌ విస్తరణ

    TG : సినిమా ఎగ్జిబిటర్‌ PVR ఐనాక్స్‌ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈ వారంలో హైదరాబాద్‌లో కొత్తగా నాలుగు స్క్రీన్‌ల ప్రాపర్టీని ప్రారంభించనుంది. దీనితో రాష్ట్రంలో మొత్తం స్క్రీన్‌ల సంఖ్య 110కి చేరుతుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ బిజ్లీ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 26స్క్రీన్లను జోడించనున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా వచ్చే రెండేళ్లలో కొత్తగా 200స్క్రీన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.

  • హాలీవుడ్‌ అవార్డ్‌‌కు దీపికా పదుకొణె ఎంపిక!

    బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె‌కు అరుదైన గౌరవం లభించింది. “హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌” అవార్డుకు హాలీవుడ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆమెను ఎంపిక చేసింది. మోషన్‌ పిక్చర్స్‌ క్యాటగిరీలో వచ్చే ఏడాది ఈ పురస్కారం అందించనుంది. ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఇండియన్‌గా దీపిక రికార్డులోకెక్కారు.

     

  • మరికొన్ని గంటల్లో ట్రైలర్!

    స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘‘హరి హర వీరమల్లు’’ ట్రైలర్ రిలీజ్‌కి రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ లాంచ్‌కి నిర్మాతలు భారీ ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ థియేటర్స్‌లో ట్రైలర్ ప్రదర్శన ఉండబోతోందని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉద‌యం 11.10 గంట‌ల‌కు ట్రైల‌ర్ విడుద‌ల కానుంది.

  • స్టార్ హీరోయిన్ కన్నుమూత

    సౌత్ కొరియా స్టార్ నటి లీ సియోయి (43) మరణించారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ ఇన్‌స్టాలో వెల్లడించారు. అయితే ఆమె జూన్ 20నే కన్నుమూసినట్లు ఆయన తెలిపారు. మృతికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ‘ది కింగ్’, ‘స్కార్లెట్ ఇన్నొసెన్స్’, ‘ది కిల్లింగ్ రొమాన్స్’ వంటి మూవీస్, సిరీస్‌లతో గుర్తింపు పొందారు. ఆమె మృతి ప‌ట్ల అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

     

     

  • ఓటీటీలోకి వచ్చేసిన ‘థగ్ లైఫ్’ !

    మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి అడుగుపెట్టింది. చిత్రం 2025 జూన్ 5న థియేటర్లలో విడుదలై, మిశ్రమ స్పందనలు అందుకుంది. ఇప్పుడు సినిమా నెట్‌ఫ్లిక్స్లో జూలై 3 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
  • క్షీణిస్తున్న నటుడు ఫిష్‌ వెంకట్‌ ఆరోగ్యం.. సాయం కోరిన కుమార్తె!

    తన తండ్రి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని, దీనస్థితిలో ఉన్న తమను ఆదుకోవాలంటూ నటుడు ఫిష్‌ వెంకట్‌ కుమార్తె స్రవంతి కోరుతోంది. ఫిష్‌ వెంకట్‌ ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. రెండు‌ కిడ్నీలు మార్పిడి చేయాలని, ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు చెప్పినట్లు స్రవంతి తెలిపింది. వైద్య సేవలు పొందలేని దీన స్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరుతోంది.

  • సంకల్ప్‌రెడ్డి-గోపీచంద్ కాంబోలో మూవీ.. టైటిల్‌ ఇదే?

    గోపీచంద్ హీరోగా డైరెక్టర్ సంకల్ప్‌రెడ్డి ఓ మూవీకి తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి ‘శూల‌’ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నారట మేకర్స్. ‘శూల‌’ అనేది ఓ ప్రదేశం పేరు కాగా.. క‌థ‌లో ఈ ప్రదేశానికి చాలా ప్రాముఖ్యం ఉందట. త్వరలో ఈ టైటిల్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

  • ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్.. రన్‌టైమ్ ఇదే!

    పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ ట్రైలర్ రేపు ఉ. 11.10 గంటలకు విడుదలకానుంది. ఈ ట్రైలర్ 3:01నిమిషాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉందని మేకర్స్ వెల్లడించారు.