దర్శకుడు వెంకీ అట్లూరి-హీరో సూర్య కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఫిక్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కథకు అనుగుణంగా ఉండే ఈ టైటిల్ ప్రేక్షకులతో పాటు సినీవర్గాలను కూడా ఆకర్షిస్తోంది.
Category: ఎంటర్టైన్మెంట్
-
ఓటీటీలోకి ‘నరివెట్ట’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టొవినో థామస్ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా ‘నరివెట్ట’. కేరళ బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ తాజాగా ఖరారైంది. ‘సోనీలివ్’లో ఈనెల 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఆడియోతో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. ఈ వివరాలు వెల్లడిస్తూ సదరు ఓటీటీ సంస్థ ట్రైలర్‌ను విడుదల చేసింది.
-
పవన్ ‘OG’ రిలీజ్ వాయిదా.. మేకర్స్ క్లారిటీ!
సుజిత్ డైరెక్షన్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘OG’. డీవీవీ ఎంటర్టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. అయితే మూవీ రిలీజ్ వాయిదా పడుతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మేకర్స్ స్పందిస్తూ.. ‘రూమర్స్ నమ్మకండి’ అంటూ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. వీడియో కోసం ClickHere.
-
అందులో నేను ఫెయిల్ అయ్యాను: బాలీవుడ్ హీరో
బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే తన పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) టాక్టిక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ట్రెండింగ్‌లో ఉండాలని అనుకున్నాను. బాలీవుడ్ ప్రముఖుల వలే పీఆర్ కోసం పార్టీలకు వెళ్ళడం, డిజైనర్ దుస్తులు ధరించడం వంటివి చేశాను. కానీ అందులో నేను ఫెయిల్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చాడు.
-
ఎర్ర చీరలో అను మెరుపులు!
హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఎర్ర చీరలో కనిపించి కుర్రకారును ఆకట్టుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ SMలో షేర్ చేసిన ఈ ఫోటోలో వయ్యారంగా ఫోజులు ఇచ్చింది.
-
ఓటీటీలోకి రాబోతున్న మెగాస్టార్ ‘బజూక’!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇటీవల మమ్ముట్టి ‘బజూక’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి దీనో డెన్నిస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఓటీటీకి వచ్చేందు సిద్ధమైంది. ఈ మూవీ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకోగా.. జూలై 10నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.
-
తెలుగు ఆడియెన్స్‌కు థాంక్స్: విజయ్ ఆంటోని
విజయ్ ఆంటోని హీరోగా నటించిన చిత్రం ‘మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకుడు. ఈ సినిమా జూన్ 27న తెలుగులో రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ క్రమంలో తాజాగా చిత్రయూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించింది. ఇందులో విజయ్ మాట్లాడుతూ.. ‘‘‘మార్గన్’ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కు థాంక్స్. మంచి మూవీని ఇచ్చిన లియో జాన్‌పాల్‌కు ధన్యవాదాలు’’అని విజయ్ అన్నారు.
-
రామ్ చరణ్, మెగా ఫ్యాన్స్‌కు నిర్మాత క్షమాపణలు
హీరో రామ్ చరణ్, ఆయన అభిమానులకు నిర్మాత శిరీష్ క్షమాపణలు చెప్పారు. చరణ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, ఆయన్ను ఎప్పుడూ కించపరిచే ఉద్దేశం లేదన్నారు. ఈ మేరకు ఇప్పటికే ఓ లేఖ విడుదల చేసిన శిరీష్ తాజాగా వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.
-
ఫుట్‌బాల్ ఆడిన రోబోలు
ఇటీవల కాలంలో రోబోలు అన్ని రంగాల్లో రాణిస్తున్నాయి. కొన్ని అంశాలు మినహాయిస్తే అవి చేయలేని పని అంటూ లేదు. తాజాగా చైనా రాజధాని బీజింగ్‌లో రోబోలు రెండు జట్లుగా విడిపోయి ఫుట్‌బాల్ ఆడాయి. ఓ రోబో గోల్ కొట్టిన ఆనందంలో సంతోషంతో ఊగిపోయింది. మరో రోబో కింద పడ్డా స్వయం లేచి నిలబడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు క్రీడాకారులకు చెక్ పడ్డట్లేనని కామెంట్స్ చేస్తున్నారు.
-
చీరకట్టులో అందాల అనుపమ!
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ట్రెడిషనల్ లుక్‍లో మెరిసింది. తాజాగా ఆమె తన ఫొటోను నెట్టింట పంచుకుంది. ఇందులో పింక్ కలర్ చీరకట్టులో అందంగా కనిపిస్తోంది.