Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘అఖండ 2’లో ‘బజరంగీ భాయిజాన్‌’ నటి.. ఆసక్తిగా పోస్టర్!

    సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘బజరంగీ భాయిజాన్‌’లో మున్ని పాత్రలో బాలనటిగా కనిపించిన హర్షాలీ మల్హోత్ర.. ఇప్పుడు టాలీవుడ్‌‌కు ఎంట్రీ ఇవ్వనుంది. బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న ‘అఖండ 2’లో నటించే అవకాశాన్ని ఈ నటి సొంతం చేసుకుంది. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఆమె జనని పాత్రలో కనిపించనుందని పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఆమెను స్వాగతిస్తూ పోస్ట్‌ పెట్టారు.

  • హీరోగా మరో స్టార్ కిడ్.. త్వరలో మూవీ అనౌన్స్‌మెంట్!

    సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్న కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకుడు. తాజాగా మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రాబోతుందని సమాచారం. ఇక ఇందులో హీరోయిన్‌గా సారా అర్జున్‌ను అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

  • రేపే ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్

    పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఈనెల 24న థియేటర్లకు రానుంది. ఈనేపథ్యంలో రేపు ఉ.11:10గంటలకు మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.

  • నితిన్‌ ‘తమ్ముడు’ మేకింగ్‌ వీడియో చూశారా?

    హీరో నితిన్‌-డైరెక్టర్‌ శ్రీరామ్‌ వేణు కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘తమ్ముడు’. సప్తమీ గౌడ హీరోయిన్‌. లయ, వర్ష బొల్లమ్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమాని జులై 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న చిత్ర బృందం తాజాగా మేకింగ్‌ వీడియోను పంచుకుంది. ప్రధాన పాత్రలకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ దృశ్యాలు ఇందులో చూడొచ్చు.

  • ప్రశాంత్‌ నీల్‌తో అల్లు అర్జున్ మూవీ.. దిల్‌ రాజు క్లారిటీ!

    ఐకాన్‌‌స్టార్‌ అల్లు అర్జున్‌ డైరెక్టర్ అట్లీతో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇది పూర్తికాగానే ప్రశాంత్‌ నీల్‌తో బన్నీ సినిమా ఉంటుందని నిర్మాత దిల్‌ రాజు తెలిపారు. ‘‘అల్లు అర్జున్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రావణం అనే చిత్రాన్ని ఫ్లాన్‌ చేశాం. వారిద్దరూ ప్రస్తుతం వేరే సినిమాలతో బిజీగా ఉన్నందున ఈ ప్రాజెక్ట్‌కు సమయం పడుతుంది’’ అని దిల్ రాజు తెలిపారు.

  • కూతురుతో రొమాన్స్‌.. అభ్యంతరం లేదన్న ఆమిర్ ఖాన్!

    2018లో ఆమిర్‌ఖాన్‌ హీరోగా  నటించిన చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’.  ఇందులో ఆమిర్‌ ప్రియురాలిగా ఫాతిమా సనాషేక్ నటించింది. అయితే ‘దంగల్‌’లో తండ్రీకూతుర్లుగా కనిపించి.. ఇందులో ప్రేమికులుగా నటించడంతో వీరిపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. తాజాగా దీనిపై ఆమిర్‌ స్పందించారు. ‘‘నిజ జీవితంలో మేమేమీ నిజమైన తండ్రీకుమార్తెలు కాదు కదా.. స్క్రీన్‌పై ప్రేమికులుగా నటించడానికి అభ్యంతరం లేదని దర్శకుడికి చెప్పాను’’ అని ఆమిర్‌ వెల్లడించారు.

  • ‘తమ్ముడు’ కోసం ఆమె ఎంతో కష్టపడింది: హీరో నితిన్‌

    ‘తమ్ముడు’ షూటింగ్‌ సమయంలో అడవిలో 65 రోజులపాటు చెప్పులు లేకుండా పనిచేసిన నటి లయ అని హీరో నితిన్‌ అన్నారు. ఆయన హీరోగా దర్శకుడు శ్రీరామ్‌ వేణు రూపొందించిన సినిమా ‘తమ్ముడు’. లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

  • హాట్ లుక్‌తో హీట్ పెంచుతున్న తమన్నా!

    హీరోయిన్ తమన్నా హాట్ లుక్స్‌తో హీటు పెంచేస్తోంది. షైనింగ్ డ్రెస్‌లో దిగిన తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరలవుతోంది.

  • ‘ఫీనిక్స్‌’కు ముందు 120 కేజీలు ఉన్నా: సూర్య సేతుపతి

    నటుడు విజయ్‌ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి ‘ఫీనిక్స్‌’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈనెల 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన జర్నీ గురించి సూర్య మాట్లాడాడు. ‘‘ఈ సినిమా ప్రారంభం కావడానికి ముందు నేను 120 కేజీలు ఉన్నాను. ఆ బరువు తగ్గడానికి ఏడాదిన్నర పట్టింది. అంత బరువు నుంచి ఫిట్‌గా మారడం తేలికైన విషయం కాదు’’ అని చెప్పుకొచ్చాడు.

  • మమ్ముట్టి కెరీర్‌పై పాఠ్యాంశం.. ఆ కళాశాల నిర్ణయం

    మలయాళ నటుడు మమ్ముట్టి సినీరంగానికి చేసిన సేవలను గౌరవిస్తూ కేరళలోని మహారాజ కళాశాల కీలక నిర్ణయం తీసుకుంది. బీఏ హిస్టరీలో ఆయన కెరీర్‌పై పాఠ్యాంశాన్ని అందించాలని నిర్ణయించింది. ఈమేరకు బీఏ రెండవ సంవత్సరంలో విద్యార్థులకు ‘హిస్టరీ ఆఫ్‌ మలయాళం సినిమా’ పేరుతో ఒక చాప్టర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మమ్ముట్టి సినీకెరీర్‌ గురించి వివరించింది. కాగా మమ్ముట్టి ఈకళాశాల పూర్వవిద్యార్థి కావడం విశేషం.