Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘తమ్ముడు’ టీమ్‌తో నితిన్ ఫన్నీ చిట్‌చాట్!

    నితిన్‌ హీరోగా దర్శకుడు శ్రీరామ్‌ వేణు రూపొందించిన సినిమా ‘తమ్ముడు’. లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

  • సంగీత్‌ శోభన్‌ కొత్త చిత్రం షురూ (VIDEO)

    సంగీత్‌ శోభన్‌  హీరోగా పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కొత్త చిత్రం ప్రారంభమైంది. ‘కమిటీ కుర్రాళ్లు’తో నిర్మాతగా తొలి విజయాన్ని అందుకున్న నిహారిక కొణిదెల.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మానసా శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనసారిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు షాట్‌కు క్లాప్‌ కొట్టారు.

  • ‘హిట్‌ 3’ నటి కోమలి ప్రసాద్‌ వైరల్‌ ఫొటోపై క్లారిటీ

    నాని నటించిన ‘హిట్‌ 3’ సినిమాతో గుర్తింపు పొందిన నటి కోమలి ప్రసాద్‌ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్టర్‌ కోట్‌ ధరించిన ఫొటో పోస్ట్ చేసింది. దీంతో ఆమె నటనకు గుడ్‌బై చెప్పి డాక్టర్‌గా కొనసాగుతారనే ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన కోమలి.. తాను చివరి వరకూ నటనలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

     

  • ‘రామాయణ’ ఫ‌స్ట్ గ్లింప్స్ ఎప్పుడంటే?

    సాయిప‌ల్ల‌వి, బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ కలిసి నటిస్తున్న చిత్రం ‘రామాయణ’. ఈచిత్రాన్ని నితేశ్ తివారీ దర్శకత్వం వహించ‌నున్నారు. తాజాగా ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓవార్త వైర‌ల్‌గా మారింది. ఈమూవీ నుంచి ఫ‌స్ట్ గింప్స్‌ను రేపు ఉద‌యం 11.30 గంట‌లకు దేశ‌వ్యాప్తంగా 9 స్క్రీన్స్‌ల‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు. హైద‌రాబాద్‌ ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్‌లోని పీసీఎక్స్‌లో ఫ‌స్ట్ గ్లింప్స్ వ‌దల‌నున్నారు. ప్రేక్ష‌కులు పెద్ద ఎత్తున హాజరు కావాలని మేకర్స్‌ పేర్కొన్నారు.

     

  • ప్రముఖ హాలీవుడ్‌ నటుడు కన్నుమూత

    ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, ‘ఆర్కో’ నిర్మాత పీటర్‌-హెన్రీస్ర్యోడర్‌ (90) ఫ్లోరిడాలో కన్నుమూశారు. ‘స్టార్‌ ట్రెక్‌’లో క్లింగాన్‌గా గుర్తింపు పొందిన ఆయన కొరియా యుద్ధంలో సైనికుడిగానూ సేవలందించారు. స్ట్రీప్‌, అలాన్‌ ఆల్బాతో కలిసి నటించిన సర్కోడర్ చివరి వరకు నటనను ఆస్వాదించారు. లాస్‌ ఏంజెలెస్‌లో సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి.

     

  • VIRAL PHOTO: ప్రభాస్‌ కొత్త లుక్‌ చూశారా?

    స్టార్‌ హీరో ప్రభాస్‌ కొత్త లుక్‌లో కనిపించారు. దర్శకుడు  హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ప్రభాస్‌… సెట్‌లో ఓ అభిమానితో దిగిన ఫొటో
    సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి లుక్‌ రాలేదని, ప్రభాస్‌ చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. వింటేజ్‌ ప్రభాస్ ఈజ్‌ బ్యాక్‌ అని పోస్టులు పెడుతున్నారు.

  • ఆ పాటకు డ్యాన్స్.. రజనీకాంత్‌ ఎంతో కష్టపడ్డారు: అనిరుధ్‌

    రజనీకాంత్‌ నటిస్తోన్న చిత్రం ‘కూలీ’ . లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాలోని ‘చికిటు..’ అనే పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. హుషారైన ఆ గీతంలో రజనీ మరోసారి తన హుక్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటలో డ్యాన్స్‌ కోసం రజనీకాంత్‌ ఎంతో కష్టపడ్డారని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌  తెలిపారు.

  • చాలా కష్టపడ్డావ్‌.. దర్శకుడిని అభినందించిన పవన్‌

    పవన్ కల్యాణ్ న్యూ మూవీ  ‘హరి హర వీరమల్లు’ జులై 24న విడుదల కానుంది రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వంలో భాగంగా జులై 3న ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. అయితే, ట్రైలర్ చూసిన పవన్ కల్యాణ్.. ‘చాలా కష్టపడ్డావ్‌..’ అంటూ దర్శకుడు జ్యోతికృష్ణని అభినందించారు.

     

  • ఎల్లుండి ఓటీటీలోకి “ఉప్పు కప్పురంబు”

    కీర్తి సురేశ్‌, సుహాస్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన “ఉప్పు కప్పురంబు’ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈ నెల 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా షూటింగ్‌ 28 రోజుల వ్యవధిలోనే పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

     

     

     

  • ఆ విషయంలో ఐశ్వర్య సలహా పాటిస్తాను: అభిషేక్‌ బచ్చన్‌

    బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.  ‘నెగిటివ్ వార్తల గురించి ఆలోచించకపోతే.. తప్పుడు వార్తలు మనపై ఎలాంటి ప్రభావం చూపవు. పాజిటివ్‌ విషయాలపై మాత్రమే దృష్టిపెట్టండి. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది’ అని నాకు నా భార్య ఐశ్వర్య నాకు సలహా ఇచ్చింది. ఇప్పటికీ అదే ఫాలో అవుతుంటాను’’ అని అభిషేక్‌ తెలిపారు.