Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘ఈఎన్ఈ రిపీట్​’ సినిమాలో బాలకృష్ణ!

    తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఈ నగరానికి ఏమైంది.ఈ సినిమా పార్ట్ 2 పనులు మొదలైనట్లు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ‘ఈఎన్ఈ రిపీట్​’ టైటిల్​తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తరుణ్ వెల్లడించారు. ఇందులో బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  • అజిత్‌ పాత్ర.. ఎంతో నిరాశకు గురయ్యా: విష్ణు

    తాను త్వరలోనే బాలీవుడ్‌ సినిమాలో నటించే అవకాశం ఉందని తెలిపారు మంచు విష్ణు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సూపర్‌ స్టార్‌లలో అజిత్‌ కుమార్‌ ఒకరు. ఆయన షారుక్‌తో కలిసి ‘అశోక’ అనే సినిమాలో సుశిమ అనే పాత్ర చేశారు. చాలా చిన్న పాత్ర. పెద్ద స్టార్‌ ఆ పాత్ర చేయడంతో ఆయన అభిమానిగా నేను నిరాశకు గురయ్యాను’’ అని చెప్పారు.

     

     

  • సాఫ్ట్‏వేర్ జాబ్ చేసుకుంటున్న ప్రభాస్ హీరోయిన్!

    ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. అలా ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేసి సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటున్న హీరోయిన్ ఎవరో కాదు దీక్షా సేథ్. ఒకప్పుడు తెలుగులో అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి హీరోల సరసన కనిపించింది. కాలం కలిసి రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసిన దీక్షా ప్రస్తుతం సాఫ్ట్‏వేర్ ఉద్యోగం చేస్తూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

  • కన్నప్ప శాటిలైట్ హక్కులకి భారీ డీల్!

    మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్ళ పరంగా దుమ్ములేపుతోంది. అయితే ‘కన్నప్ప’ చిత్రానికి భారీ స్థాయిలో హిందీ శాటిలైట్ హక్కులు అమ్ముడయినట్టు వార్తలు వస్తున్నాయి. ఓ పాపులర్ లీడింగ్ ఏజెన్సీ కన్నప్ప మూవీ రైట్స్‌ను రూ.20కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఓటీటీ రైట్స్ మాత్రం ఇప్పటివరకు విక్రయించలేదు.

     

     

  • బిగ్ బాస్ కంటెస్టెంట్లు మృతి.. అందరూ ఒకేలా!

    నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ షెఫాలీ జరీవాలా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. గతంలోనూ పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్లు గుండెపోటుతో కన్నుమూశారు. 2021లో బిగ్ బాస్‌-13 విన్నర్, నటుడు సిద్ధార్థ్ శుక్లా(40), 2016లో బిగ్ బాస్‌-7 కంటెస్టెంట్ ప్రత్యూషా(24), 2022లో బిగ్ బాస్‌-14 కంటెస్టెంట్ సోనాలి, 2021లో మలయాళం బిగ్ బాస్‌-2 పార్టిసిపెంట్ సోమస్ గండెపోటుతోనే మరణించారు.

  • రేసర్‌గా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు!

    సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితో ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్‌లో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న రేసింగ్‌లో పాల్గొన్నారు. అయితే నిజంగా కాదులెండి. ఫ్యాన్స్ ఏఐ ద్వారా మ‌హేశ్ రేసింగ్‌లో పాల్గొన్న‌ట్లు ఫొటోల‌ను Xలో పోస్ట్ చేశారు. ‘‘ది ఆర్ట్ ఆఫ్ రేసింగ్ ఇన్ ది రైన్’’ అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోలను అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.

  • ఫ్యాన్సీ రేటుకు వార్ 2 తెలుగు స్టేట్స్ రైట్స్!

    హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 80 కోట్ల‌కు ఈ మూవీ తెలుగు రైట్స్‌ను నాగ‌వంశీ సొంతం చేసుకున్నట్లు స‌మాచారం.

  • తన ఆర్థిక ఇబ్బందుల నుంచే స్క్విడ్ గేమ్ పుట్టింది!

    దక్షిణ కొరియా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్‌రైటర్ హ్వాంగ్ డాంగ్-హ్యుక్, 2008లో ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రేరణ పొంది స్క్విడ్ గేమ్ కథను రాశారు. దాదాపు 10 ఏళ్లపాటు ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించలేదు. 2021లో నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదలైన స్క్విడ్ గేమ్ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది.. హ్వాంగ్‌ను అంతర్జాతీయ ఖ్యాతికి చేర్చింది.

     

  • ‘స్క్విడ్ గేమ్’ VIPలు, ఎలాన్ మస్క్ పోలికపై దర్శకుడు ఏమన్నారంటే!

    ‘స్క్విడ్ గేమ్’ సృష్టికర్త హ్వాంగ్ డాంగ్-హ్యూక్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీజన్ 3 రాసిన తర్వాత, షోలోని ధనవంతులైన VIPలు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్‌ను “ఒక విధంగా పోలి ఉంటారని” తాను భావించానని ఆయన వెల్లడించారు. “మస్క్.. ప్రపంచాన్ని దాదాపుగా నియంత్రించే భారీ టెక్ కంపెనీకి అధిపతి మాత్రమే కాదు, అతను ఒక షోమ్యాన్ కూడా” అని హ్వాంగ్ పేర్కొన్నారు.

  • రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి క్షమాపణ చెప్పిన నిర్మాత శిరీష్ రెడ్డి

    రామ్ చరణ్ ఫ్యాన్స్ కి దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ రెడ్డి క్షమాపణ చెప్పారు. గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెబుతూ లేఖ విడుదల చేశారు. శిరీష్ కామెంట్స్ పై చరణ్ ఫ్యాన్స్ కన్నెర్ర చేయడంతో అప్రమత్తమైన దిల్ రాజు సోదరుడి చేత క్షమాపణ చెప్పించి వివాదానికి తెర దించారు.