సినీ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వెంకట్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గతంలోనే కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయినా కూడా ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఎవరినీ గుర్తు పట్టేలేనంతగా ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.