Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘విశ్వంభర’ షూటింగ్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్!

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ తెరకెక్కిస్తున్న మూవీ ‘విశ్వంభర’. తాజాగా సినిమా షూటింగ్‌పై డైరెక్టర్ వశిష్ఠ అప్‌డేట్‌ ఇచ్చారు. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్‌ పూర్తయినట్లు ఓ ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. సినిమాపై ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడానికి కారణం తామంతా వీఎఫ్‌ఎక్స్‌ పనుల్లో బిజీగా ఉండటమేనని తెలిపారు. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వశిష్ఠ చెప్పుకొచ్చారు.

  • ఇదే చివరి హెచ్చరిక.. నిర్మాతలకు రామ్‌చరణ్ ఫ్యాన్స్ వార్నింగ్!

    ఇది గమనిక కాదు.. చివరి హెచ్చరిక అంటూ మెగా ఫ్యాన్స్ వదిలిన ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ పదే పదే ‘గేమ్ ఛేంజర్’ సినిమా వల్ల చాలా నష్టపోయాం.. హీరో తమను కనీసం పట్టించుకోలేదని మాట్లాడారు. దీంతో చరణ్‌ ఫ్యాన్స్‌ హెచ్చరిస్తూ సోషల్‌మీడియాలో ప్రకటన విడుదల చేశారు.

  • హీరో ప్రభాస్‌కు తీవ్ర గాయం.. ఫ్యాన్స్ ఆందోళన!

    రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అయితే ఈ షూటింగ్ జరుగుతుండగా ఆయన కాలికి గాయమైందని తెలుస్తోంది. గతంలో కూడా కాలికి గాయం కావడంతో ఆయన సర్జరీ చేయించుకున్నారు. అయితే ఇప్పుడు మరోసారి కాలికి ఫ్రాక్చర్ జరిగిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆ కాలికే జరిగిందా లేక మరో కాలికి జరిగిందా అనే విషయంపై క్లారిటీ రావాల్సివుంది.

  • హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ షో!

    అందాల భామ ప్రగ్యా జైస్వాల్ రోజురోజుకు గ్లామర్ షో పెంచేస్తోంది. తాజాగా ఆమె అదిరిపోయే ఫోటోను నెట్టింట్లోకి వదిలింది. వైట్ డ్రెస్‌లో అందాల విందుతో ఆకట్టుకుంటోంది.

  • చిరు ‘విశ్వంభర’లో బాలీవుడ్ బ్యూటీ?

    మెగాస్టార్ చిరంజీవి-త్రిష జంటగా వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ పాట కోసం బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్‌ని సంప్రదించినట్లు సమాచారం. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఇక ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

  • సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్?

    హీరోయిన్ స‌మంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా అంటే అవున‌నే అంటున్నారు ఆమె స‌న్నిహితులు. సిటాడెల్, ఫ్యామిలీ మెన్ వంటి సిరీస్‌లను డైరెక్ట్‌ చేసిన రాజ్ నిడిమోరుతో సమంత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న‌ట్లు వార్తలు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాది చివరలో సమంత, రాజ్‌ల‌ బంధాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. వీటిలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

  • Video: హీరో రామ్‌చరణ్‌పై ప్రముఖ నిర్మాత సంచలన కామెంట్స్!

    టాలీవుడ్ నిర్మాత శిరీష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో జరిగిన నష్టాల గురించి మాట్లాడారు. ‘‘‘గేమ్ ఛేంజర్’తో తమ జీవితాలు అయిపోయాయని అనుకున్నాం.  తాము ఎవరికీ చెప్పుకోవాలి.. ఎవరైనా హెల్ప్ చేస్తారా. ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ అయినప్పుడు హీరో రామ్‌చరణ్ మాకు సహాయం చేశారా?.. లేక దర్శకుడు ఏమైనా అండగా నిలిచారా? అని నిర్మాత వెల్లడించారు. వీడియో కోసం ClickHere.

  • మోడ్రన్ లుక్‌లో ఆకట్టుకునేలా శృతిహాసన్!

    హీరోయిన్ శృతిహాసన్ సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోపక్క ఫోటోషూట్‌లలో పాల్గొంటుంది. తాజాగా మోడ్రన్ డ్రెస్‌లో ఆమె షేర్ చేసిన ఫోటో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

  • ‘హరి హర వీరమల్లు’ నుంచి క్రేజీ పోస్టర్ రిలీజ్

    పవన్‌కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్‌ జులై 3న విడుదలకానుంది. ఈనేపథ్యంలో ‘2 డేస్ టూ గో’ అంటూ కౌంట్‌డౌన్ పోస్టర్‌ వదిలారు.

  • హిందీ టీవీ షోలో తెలంగాణ ఫోక్ సాంగ్

    మిస్ వరల్డ్ పోటీల్లో తెలంగాణ ఫోక్ సాంగ్స్‌లో ‘రాను బొంబాయికి రాను’ ఓ ఊపు ఊపింది. పలు దేశాల కంటెస్టెంట్లు సైతం ఈ పాటకు కాలు కదిపిన వీడియోలు వైరల్‌గా మారాయి. తాజాగా ఓ హిందీ టీవీ ఛానల్‌ షోలో ఇదే పాటను ప్లే చేశారు. దీంతో ఈ పాటకు యాంకర్‌తో పాటు షోకు వచ్చిన గెస్టులు సైతం స్టెప్పులేశారు. దీంతో ఈ ఫోక్ సాంగ్ క్రేజ్ మాములుగా లేదని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.