నటి సప్తమి గౌడ.. నితిన్‌తో కలిసి ‘తమ్ముడు’ మూవీతో రాబోతుంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘‘‘తమ్ముడు’ సినిమా నటిగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా. నాకు కమర్షియల్ మూవీస్ చేయడం ఇష్టం. ‘‘తమ్ముడు’’ ఆ తరహా సినిమానే. ‘కాంతార’ తర్వాత నాకు అదేతరహా పాత్రలు వచ్చాయి. డిఫరెంట్ రోల్స్ వస్తే తప్పకుండా చేస్తాను’’ అని తెలిపింది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
హీరోహీరోయిన్ల రెమ్యూనరేషన్.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే?
హీరోయిన్ కీర్తిసురేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పారితోషికంపై మాట్లాడారు. ‘‘నా విషయంలో పారితోషికానికి చివరి ప్రాధాన్యత. మొదట కథే, వైవిధ్యమైన పాత్రలే ముఖ్యం. హీరోహీరోయిన్లకు సమాన రెమ్యూనరేషన్‌పై చర్చలు జరుగుతున్నాయి. ఒక హీరో కోసం ప్రేక్షకులు ఎలా థియేటర్‌కు వస్తున్నారో.. అదే స్థాయిలో ఓ హీరోయిన్ సినిమాకు ప్రేక్షకులు వస్తుంటే కచ్చితంగా ఆ నాయికకు హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వొచ్చు’’అని తెలిపారు.
-
ఆసక్తిరేపుతున్న ‘మాలిక్’ ట్రైలర్
రాజ్‌కుమార్ రావ్ హీరోగా రూపొందుతున్న మూవీ ‘మాలిక్’. పుల్కిత్ దర్శకుడు. మానుషి చిల్లర్ హీరోయిన్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తికర యాక్షన్ డ్రామాతో మూవీని తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషీ ఇందులో ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడింది.
-
‘మహావతార్: నరసింహ’.. హిరణ్యకశిపుడి ప్రోమో రిలీజ్
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘మహావతార్: నరసింహ’. జులై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఇందులో రాక్షస రాజు హిరణ్యకశిపుడి పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను పంచుకుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో త్రీడీలో విడుదల కానుంది.
-
‘ఫ్యామిలీ మ్యాన్3’లో కొత్త విలన్స్ వీళ్లే
ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న వెబ్‌సిరీసుల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్3’ ఒకటి. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. జైదీప్ ‘ది ఫ్యామిలీమ్యాన్3’లో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. జైదీప్ అహ్‌లావత్ , నిమ్రత్ కౌర్ కూడా ఈ సిరీస్‌లో కనిపించున్నారు. కాగా, ‘ది ఫ్యామిలీ మ్యాన్3’ పూర్తిగా చైనా సరిహద్దుల్లో పొంచి ఉన్న శత్రుమూకలతో జరిగే పోరాటాన్ని చూపించనున్నారు.
-
ప్రభాస్ పక్కన బాలీవుడ్ నటి.. మారుతి ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హర్రర్ కామెడీ సినిమా ‘రాజాసాబ్’. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది. అయితే, ఈ మూవీలోని స్పెషల్ సాంగ్‌లో కరీనా కపూర్ ఆడిపాడితే బాగుంటుందని దర్శకుడు మారుతి భావిస్తున్నారట. అయితే ఆమె ఈ ఆఫర్ అంగీకరిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం కరీనకు తెలుగులోనూ క్రేజ్ ఏర్పడుతుంది.
-
అందుకే అమితాబ్ సినిమాను తిరస్కరించా: నటి మధుబాల
నటనకు విరామం తీసుకోవడం గురించి సినీ నటి మధుబాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘నాకు వివాహం నిశ్చయమైన సమయంలోనే అమితాబ్ సినిమాలో అవకాశం వచ్చింది. దీంతో ఆ సినిమాను తిరస్కరించాను. అప్పుడు ఆ అవకాశం సౌందర్యను వరించింది’’అని చెప్పారు. కాగా, ఇటీవల వచ్చిన ‘కన్నప్ప’ సినిమాలో మధుబాల అతిథి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.
-
పడిపోయిన కన్నప్ప బాక్సాఫీస్ కలెక్షన్లు.. భారీ నష్టాలు తప్పవా?
మంచు విష్ణు న్యూ మూవీ ‘కన్నప్ప’ వసూళ్లు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈ సినిమా ఇప్పటివరకు రూ. 50 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. .అయితే, రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలోనే ఉంది. లాభాల్లోకి రావాలంటే ప్రపంచవ్యాప్త గ్రాస్ కనీసం రూ.180 కోట్లు ఉండాలని లెక్కగట్టారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
-
ఆసక్తికరంగా ‘తమ్ముడు’ రిలీజ్ ట్రైలర్
నితిన్ హీరోగా దర్శకుడు శ్రీరామ్ వేణు రూపొందించిన సినిమా ‘తమ్ముడు’. లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రిలీజ్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అక్కతో ‘తమ్ముడు’ అని పిలిపించుకోవడం కోసం ఎంత సాహసమైన చేసే పాత్రలో నితిన్ కనిపించి ఆకట్టుుకున్నారు.