హీరోయిన్ అంజలి తాజాగా గ్రీన్ శారీలో అందాలు ఆరబోసింది. కొంటెచూపులతో వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
దేశభక్తి నేపథ్యంలో మూవీ.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్
పృథ్వీరాజ్ సుకుమారన్-కాజోల్ జంటగా కాయోజ్ ఇరానీ తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ‘సర్‌జమీన్’. దేశభక్తి నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో ఇబ్రహీం అలీ ఖాన్ ఉగ్రవాదిగా.. పృథ్వీరాజ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ సినిమా జూలై 25 నుంచి డైరెక్ట్ జియో హాట్‌స్టార్ ఓటీటీలో విడుదల కానుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు.
-
హాట్ లుక్స్‌తో కృతిశెట్టి ఫోజులు!
హీరోయిన్ కృతిశెట్టి ఇటీవల వరుస ఫోటో షూట్స్‌తో సోషల్‌మీడియాలో హీట్ పెంచుతోంది. తాజాగా ఈ అమ్మడు మోడ్రన్ డ్రెస్ ధరించి క్యూట్ స్టిల్స్ పోస్ట్ చేసింది.
-
‘కన్నప్ప’పై హీరో సూర్య ప్రశంసలు.. స్పందించిన విష్ణు!
మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ చిత్రంపై హీరో సూర్య ప్రశంసల వర్షం కురిపించారు. ఈమేరకు విష్ణుకు సూర్య ఒక పూల బొకేతో పాటు అభినందన సందేశం పంపారు. ‘‘ఈ అద్భుతమైన మైలురాయికి బిగ్ కంగ్రాచ్యులేషన్స్ బ్రదర్ విష్ణు. ఎన్నో హృదయాలను హత్తుకునే సినిమా తీసినందుకు గర్వంగా ఉంది’’ అని సూర్య పేర్కొన్నారు. దీనికి విష్ణు సోషల్‌మీడియా వేదికగా సూర్యకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశారు.
-
ఓటీటీలోకి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ నటి వాణికపూర్ ప్రధాన పాత్రలో గోపి పుత్రన్ తెరకెక్కించిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ‘మండల మర్డర్స్’. ఈ బాలీవుడ్ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. జూలై 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ సిరీస్‌లో వాణికపూర్ తొలిసారి డిటెక్టివ్ పాత్రలో కనిపించనుంది.
-
‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’.. సెన్సార్ ఆఫీస్ ఎదుట నిరసన!
సురేశ్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. సినిమా పేరు మార్చాలని.. సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించడం చర్చనీయాంశమైంది. సెన్సార్‌బోర్డు తీరుపై మలయాళ చిత్రపరిశ్రమ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలోనే కేరళలోని సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఎదుట నిరసనకు దిగింది. మలయాళ సినీ, సీరియల్ ఆర్టిస్టుల సభ్యులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
-
‘కుబేర’.. ‘మాదే ఈ సోకమంతా’ సాంగ్ రిలీజ్
నాగార్జున, ధనుష్, రష్మిక కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ డ్రామా ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకుడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో చిత్రబృందంలోని ఇందులోని ‘మాది.. మాది.. మాదే ఈ సోకమంతా’ అంటూ సాగే వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు.
-
‘హరి హర వీరమల్లు’.. ఆసక్తిగా కొత్త పోస్టర్
పవన్‌కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ జులై 3న విడుదలకానుంది. ఈనేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ డేట్ కౌంట్‌డౌన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
-
థియేటర్స్‌లో రెక్లెయినర్ సీట్స్.. ప్రముఖ నటుడు అసహనం!
బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని థియేటర్స్‌లో రెక్లెయినర్ సీట్స్ ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘అసలు థియేటర్‌లో రెక్లెయినర్స్ ఎందుకు? మూవీ చూస్తూ నిద్రపోవాలని దాని ఉద్దేశమా?.. వచ్చింది సినిమా చూడటానికే.. ‘స్పా’ కోసం రాలేదు కదా!. గోల్డ్ క్లాస్ ప్రేక్షకులారా? మీరు సీట్లలోనూ సౌకర్యవంతంగా కూర్చొని సినిమా చూడొచ్చు’’ అంటూ పరేశ్ తెలిపారు.
-
‘యానిమల్’పై విమర్శలు.. స్పందించిన రష్మిక!
హీరోయిన్ రష్మిక ‘యానిమల్’ మూవీకి వచ్చిన విమర్శలపై తాజాగా స్పందించారు. ‘‘సినిమా చూసి ప్రభావితులవుతారనుకుంటే.. మీకు నచ్చిన సినిమాలు మాత్రమే చూడండి. ప్రతి మనిషిలోనూ మరో కోణం ఉంటుంది. దానినే సందీప్ రెడ్డి వంగా స్క్రీన్ మీదకు తీసుకువచ్చారు. ప్రేక్షకులు దానిని ఎంజాయ్ చేశారు. నటీనటులుగా మేము పాత్రలను పోషిస్తున్నాం తప్ప మా వ్యక్తిగత జీవితాలకు వాటికి ఎలాంటి సంబంధంలేదు’’ అని రష్మిక వివరించారు.