Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • కోలీవుడ్‌లో ‘కుబేర’కు ఆదరణ కరువు!

    ధనుష్, నాగార్జున ప్రధానపాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘కుబేర’ సినిమాకు టాలీవుడ్ ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ హిట్ అందించారు. అయితే ఇదే సినిమా తమిళ, మలయాళ ప్రేక్షకులను మెప్పించలేకపోయిందని టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్‌లో ధనుష్ స్టార్ హీరో అయినప్పటికీ అక్కడ ఇప్పటివరకూ రూ.20 కోట్లే కల్లెక్షన్స్ వచ్చాయి. అదే తెలుగులో రూ.50 కోట్లకుపైగా వసూళ్లు వస్తే కేరళలో కేవలం రూ.1.48 కోట్లు రావడం గమనార్హం.

  • ‘కన్నప్ప’ చిత్రాన్ని వీక్షించిన మంత్రులు.. ఏమన్నారంటే?

    TG: కన్నప్ప చిత్రం ఊహకి అందనంత గొప్పగా ఉందని, క్లైమాక్స్‌ అద్భుతంగా తీశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి సినిమాను వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ చిత్రాన్ని ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ మిక్డ్స్ టాక్ దూసుకుపోతోంది.

     

  • జులైలో రాబోతున్న రీ-రిలీజ్ సినిమాలివే!

    టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇక జులై నెలలో ఏకంగా 6 సినిమాలు రీ-రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

    • ‘MS ధోని’ (జులై 7)
    • ‘కుమారి 21F’ (జులై 10)
    • ‘మిరపకాయ్’ (జులై 11)
    • ‘గజిని’, ‘ఏమాయ చేశావే’ (జులై 18)
    • ‘వీడొక్కడే’ (జులై 19)

  • మోడ్రన్ లుక్‌తో మైమరిపిస్తున్న సప్తమి గౌడ!

    హీరోయిన్‌ సప్తమి గౌడ సోషల్‌ మీడియాలో ట్రెండీ వేర్‌లో ఆకట్టుకుంటోంది. ఈ బ్యూటీ తాజాగా పోస్ట్ చేసిన తన ఫొటోలో అందంతో కట్టిపడేసింది.

  • చెఫ్​ కావాలనుకున్న ధనుష్!

    స్టార్డమ్​ను సైతం పక్కనపెట్టి ప్రైవేట్ లైఫ్‌ను సింపుల్‌గా మెయింటేన్ చేస్తూ వ్యక్తిత్వంతో హీరో ధనుష్ అందరిని ఎట్రాక్ట్ చేస్తుంటారు.  మనం ఎక్కువగా తెర మీదే చూసినా, తెర వెనుక ఆయన ప్రయాణం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ధనుష్ మొదట హోటల్ మేనేజ్‌మెంట్ చదివి చెఫ్ కావాలనుకున్నారు. కానీ అన్న సెల్వరాఘవన్ ఒత్తిడి వల్ల సినిమాల్లోకి రావాల్సి వచ్చింది.  ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ధనుష్ ఒకరు.

     

     

  • ఈ వారం ఓటీటీ సినిమాలివే!

    ఈ వారం ఓటీటీలో కొన్ని ఆసక్తిని కలిగించే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నయి. మరి ఏ సినిమా ఎందులో రిలీజ్ కానుందో తెలుసుకుందాం.

    • నెట్‌ఫ్లిక్స్‌: ‘ది ఓల్డ్‌ గార్డ్‌2’ (జులై 2)
    • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో: ‘ఉప్పు కప్పురంబు’ (జులై 4)
    • జీ5: ‘కాళీధర్‌ లపతా’ (జులై 4)
    • జియో హాట్‌స్టార్‌: ‘గుడ్‌ వైఫ్‌’ (జులై 4)
    • ఈటీవీ విన్‌: ‘ఎయిర్‌: ఆల్‌ ఇండియా ర్యాంకర్స్‌’ (జులై 4)

  • ఒకే ఫ్రేమ్‌లో స్టార్ బ్యూటీస్.. పోస్ట్ వైరల్!

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత, కీర్తి సురేష్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. తాజాగా సామ్ తన ఇన్‌స్టాలో కీర్తితో దిగిన  ఫొటోను పంచుకుంది. దానికి ‘‘లంచ్‌కు మధ్యాహ్నం కూర్చుంటే లేచే సరికీ సాయంత్రం అవుతుంది’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ SMలో వైరల్‌గా మారింది. టూ క్యూటీస్ ఇన్ సింగిల్ ఫ్రేమ్ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

  • దిల్ రాజుతో ‘తమ్ముడు’ ఫన్నీ చిట్‌చాట్!

    నితిన్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. దిల్‌రాజు నిర్మించిన ఈ మూవీలో లయ కీలక పాత్ర పోషించారు. జులై 4న థియేటర్స్‌లో విడుదలకానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా హీరో నితిన్, నిర్మాత దిల్ రాజు కలిసి స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

     

  • సైఫ్‌పై దాడి.. ఆ వార్తలు బాధించాయి: కరీనా కపూర్‌

    బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఈ ఏడాది ఆరంభంలో జరిగిన దాడి వార్తలు నటి కరీనా కపూర్‌ను తీవ్రంగా బాధించిన‌ట్లు ఆమె తాజాగా పేర్కొన్నారు. ఆ సంఘటన సమయంలో వచ్చిన కామెంట్స్‌ను “చెత్త”గా అభివర్ణించిన కరీనా.. ఆ వ్యాఖ్యలు తనను ఎంతగానో కలచివేశాయని తెలిపారు. ఇక‌పోతే బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్‌పై ఓ దుండ‌గుడు క‌త్తితో దాడి చేసిన విష‌యం తెలిసిందే.

     

  • రెడ్ డ్రెస్‌లో తళుక్కున మెరిసిన తమన్నా!

    మిల్కీ బ్యూటీ తమన్నా రెడ్ కలర్ డ్రెస్‌లో బ్యూటీఫుల్‌గా కనిపిస్తోంది. సోషల్‌మీడియా వేదికగా షేర్ చేసిన తన లేటెస్ట్ పిక్ ప్రస్తుతం వైరలవుతోంది.