విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న ‘కింగ్డమ్’ సినిమాపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘కింగ్డమ్’ చిత్రానికి సంబంధించి అప్పుడప్పుడు తిట్లు వస్తూనే ఉంటాయని నాక్కూడా తెలుసు. ప్రేక్షకులకు వెండితెరపై ఒక అద్భుతమైన అనుభూతిని అందించేందుకు టీమ్ అంతా శ్రమిస్తున్నాం. ‘కింగ్డమ్’ అంతటా విజయాన్ని అందుకోనుంది. త్వరలో అదిరిపోయే రిలీజ్ డేట్, టీజర్, సాంగ్ అనౌన్స్‌మెంట్‌తో మళ్లీ కలుద్దాం’’ అని పేర్కొన్నారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’.. ఫస్ట్ లుక్ రిలీజ్
ఒకప్పుడు కామెడీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్.. ఇప్పుడు ‘నాంది’ వంటి సీరియస్, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా తన 63వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘ఆల్కహాల్’ అనే టైటిల్ ఖరారు చేశారు.
-
పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ చెప్పిన నాగవంశీ
పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ట్రైలర్‌పై నిర్మాత నాగవంశీ కీలక అప్‌డేట్ ఇచ్చారు. జూలై 3న ఈ ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు ట్వీట్ చేశారు. ‘‘మీరందరూ ఏమి ఆశిస్తున్నారో నాకు తెలియదు… కానీ జూలై 3వ తేదీన పవన్ సినిమా నుంచి ఆ అద్భుతం రానుంది. ధైర్యంగా ఉండండి. హరిహర వీరమల్లు ట్రైలర్ నిజంగా అత్యున్నత స్థాయిలో ఉంది’’అని పేర్కొన్నారు.
-
నిజం చెప్పినా ఎవరూ నమ్మరు.. ట్రోల్స్‌పై అభిషేక్ అసహనం
ట్రోల్స్‌పై బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ స్పందించారు. తాను నిజం చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. నెగెటివ్ వార్తలకు ఇచ్చేంత ప్రాధాన్యత పాజిటివ్ వార్తలకు ఇవ్వరని చెప్పారు.
-
కుటుంబ కథతో.. ‘3 బీహెచ్‌కే’
సిద్ధార్థ్ హీరోగా శ్రీగణేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘3 బీహెచ్‌కే’. ఈ సినిమాలో శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జులై 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇంటిల్లిపాదినీ అలరించే చిత్రమిదని సినీ వర్గాలు తెలిపాయి. మీఠా రఘునాథ్, చైత్ర తదితరులు నటిస్తునన్నారు.
-
కిరణ్ అబ్బవరం ‘కె-రాంప్’ వచ్చేది ఎప్పుడంటే!
కిరణ్ అబ్బవరం హీరోగా ‘కె-రాంప్’ తెరకెక్కుతోంది. దీపావళికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది.
-
హాలీవుడ్ నటుడు జమాల్ ఎజ్లాలి కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ నటుడు జమాల్ ఎజ్లాలి(78) అనారోగ్యంతో కన్నుమూశారు. 1947లో జన్మించిన ఆయన, పైన్ ఆర్ట్స్ ఫ్యాకల్టీలో థియేటర్ యాక్టింగ్‌లో చేరారు. టాబూ, థిక్ మేకప్, ఎ పెర్నియన్ మెలోడీ వంటి చిత్రాల్లో నటించారు. థిక్ మేకప్(2013)లో వ్యసనపరుడైన వైద్యుడిగా ఆయన పాత్ర ప్రశంసలు పొందింది. 2018లో ది సీక్రెట్ ఆఫ్ లవర్స్, ది సోల్డర్ చిత్రాలతో తిరిగి తెరపైకి వచ్చారు.
-
ఈ విషయంలో ఎంతో బాధగా ఉంది: మంచు విష్ణు పోస్ట్
తాను నటించిన ‘కన్నప్ప’ సినిమాను పైరసీ చేసేందుకు ప్రయత్నించారని హీరో మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి దాదాపుగా 30,000 ఇల్లీగల్ లింక్‌లను తాము తొలగించామని వెల్లడించారు. ఇది తనను ఎంతో బాధించిందని చెప్పారు. పైరసీని ప్రోత్సహించొద్దని కోరారు. సినిమాను కరెక్ట్ వేలోనే సపోర్ట్ చేయాలని అభ్యర్థించారు.
-
“కుబేర” విజయం గర్వపడేలా చేసింది: శేఖర్ కమ్ముల
‘కుబేర’ తనను వ్యక్తిగతంగా గర్వపడేలా చేసిన సినిమా అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. ఇలాంటి విభిన్న కాన్సెప్టును ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనన్న సందేహం ఉండేది. ఈ తరానికి తగ్గట్లుగా అభిమానుల అంచనాలు చేరుకోవడమే పెద్ద సవాల్ అన్నారు. గత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రానికి కాస్త ఎక్కువగా కష్టపడినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.