Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ఆరు నెలల్లో మీకు నచ్చిన మూవీ ఏది?

    ఈ రోజుతో ఈ ఏడాది ప్రథమార్థం పూర్తి కానుంది. ఈ సంవత్సరంలో టాలీవుడ్‌లో ఇప్పటివరకు విడుదలైన చిత్రాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’అత్యధిక కలెక్షన్లతో(రూ.300 కోట్లు) టాప్‌ పొజిషన్‌లో ఉంది. బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’, రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’, నాగచైతన్య ‘తండేల్‌’, ‘కోర్టు’, నాని ‘HIT-3’, ధనుష్‌ ‘కుబేరా’, మంచు విష్ణు ‘కన్నప్ప’ వంటి చిత్రాలు రిలీజయ్యాయి. మరి వీటిలో మీకు ఏ సినిమా నచ్చింది?

     

     

  • ‘తమ్ముడు’ వస్తున్నాడు

    నితిన్‌, సప్తమి గౌడ జంటగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘తమ్ముడు’. ఈ సినిమాలో లైలా కీలక పాత్ర పోషించారు.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 4న థియేటర్స్‌లో విడుదల కానుంది. అక్క – తమ్ముడు అనుబంధాలతో అల్లుకున్న కథగా ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. నితిన్‌ ఆర్చరీ ఆటగాడిగా సందడి చేయనున్నారు.

     

  • ‘కన్నప్ప’.. విష్ణు చేసిన సాహసం: పరుచూరి రివ్యూ

    మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కన్నప్ప’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చారు. ‘‘ఇది తండ్రీకొడుకులు సాధించిన విజయం. గతంలో ఇదే కథను స్టార్‌ హీరోలు నటించారు. దాన్ని మళ్లీ చూపించాలనుకోవడం సాహసమే. విష్ణు సాహనం చేశారు’’ అని పేర్కొన్నారు.

  • రేపు అల్లరి నరేశ్ కొత్త చిత్రం టైటిల్ రివీల్

    నటుడు అల్లరి నరేశ్ కొత్త చిత్రం టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ను రేపు రివీల్ కానున్నాయి. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెరకెక్కించనుంది.

  • 28 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి.. వీడియో

    కీర్తిసురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఉప్పు కప్పురంబు’. నటుడు సుహాస్‌ కీలక పాత్ర పోషించారు. రాధికా ఎల్‌ నిర్మిస్తున్నారు. వసంత్‌ మురళీకృష్ణ మరింగంటి కథని అందించారు. అమెజాన్ ప్రైమ్‌ వీడియో వేదిక జులై 4 నుంచి ఇది స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా యాంకర్‌ సుమ చాట్‌ షోలో కీర్తిసురేశ్‌, సుహాస్‌ పాల్గొని ముచ్చటించారు. కేవలం 28 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తయినట్లు చెప్పారు.

  • స్టార్ హీరోకు అండర్‌ వరల్డ్‌ నుంచి బెదిరింపులు

    తాను నటించిన ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ విజయం అనంతరం అండర్‌ వరల్డ్‌ నుంచి తనకు ఆహ్వానం అందిందని బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ తెలిపారు. అంతేకాకుండా తాను పరోక్షంగా బెదిరింపులు కూడా ఎదుర్కొన్నానని చెప్పారు. ఆ సమయంలో ఎంతో భయపడ్డానన్నారు. అయితే, అప్పుడు రానని చెప్పడంతో మరోసారి తనని పార్టీలకు పిలవలేదని, తన జోలికి రాలేదని పేర్కొన్నారు.

  • ప్రతి కథ నాగచైతన్యకే చెప్పా: వెంకీ అట్లూరి

    సార్‌, లక్కీ భాస్కర్‌ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నాడు డైరెక్టర్‌ వెంకీ అట్లూరి. దర్శకుడిగా ఇప్పటివరకు ఐదు సినిమాలు చేసిన వెంకీ అట్లూరి.. వాటన్నింటినీ ముందుగా హీరో నాగచైతన్యకు వినిపించాడట. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. అక్కినేని ఫ్యామిలీ అంటే నాకిష్టం. మీరు నమ్ముతారో, లేదో కానీ.. ఇప్పటివరకు రాసుకున్న ప్రతి కథ మొదటగా నాగచైతన్యకే చెప్పానని పేర్కొన్నాడు.

  • మంచు విష్ణు నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఫిక్స్?

    ‘కన్నప్ప’తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన మంచు విష్ణు తర్వాతి ప్రాజెక్టుపై సినీ వర్గాల్లో చర్చ నెలకొంది. ఈ సినిమాకు కొరియోగ్రఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. కన్నప్పలోని సాంగ్‌కు ప్రభుదేవానే కొరియోగ్రఫీ చేశారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘పౌర్ణమి’ వంటి చిత్రాలకు ప్రభుదేవా దర్శకత్వం వహించారు.

  • ‘కన్నప్ప’ సినిమా ప్రీక్వెల్​.. విష్ణు రిప్లై ఇదే!

    ‘కన్నప్ప’ మూవీ హిట్ టాక్ అందుకోవడంతో మంచు విష్ణు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సినిమా తర్వాత ఏంటనే ప్రశ్న అడగ్గా.. సూపర్ హిట్టైన సినిమాలకు సీక్వెల్స్‌ వస్తుంటాయి. తాజాగా ఓ కొత్త డైరెక్టర్​ ఈ సినిమా సీక్వెల్​ కాకుండా ప్రీక్వెల్​ను ప్లాన్​ చేద్దామని సలహా ఇచ్చారు. భవిష్యత్తులో కుదిరితే ప్రీక్వెల్ ఉండే ఛాన్స్ ఉందని, సీక్వెల్ ఉండదని విష్ణు క్లారిటీ ఇచ్చారు.

     

  • సాయం కోసం రోడ్డుపైనే ఏడ్చేశా: ‘దసరా’ విలన్

    ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ‘దసరా’ విలన్ షైన్‌ టామ్‌ చాకో తండ్రి చనిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆరోజు ఉదయం అమ్మానాన్న, నేను, నా సోదరుడు కారులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. నేను వెనుక సీటులో కూర్చొని నిద్రపోతున్నా. ఒక్కసారిగా లేచి చూస్తే మా కారుకు ప్రమాదం జరిగింది. ఏం అర్థం కాలేదు. దీంతో ఎవరైనా మమ్మల్ని ఆస్పత్రికి తీసుకెళ్లండని ఏడ్చేశా’’ అని పేర్కొన్నారు.