హీరో నితిన్ ‘తమ్ముడు’గా థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన నటించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించారు. దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. లయ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా జులై 4న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో చిత్రబృందం పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘కన్నప్ప’ విజయం.. వారికి కృతజ్ఞతలు: మంచు విష్ణు
తన 20 ఏళ్ల సినీ జీవితంలో విజిట్ కార్డు ఉంటే, అది ‘కన్నప్ప’ మూవీనేనని హీరో మంచు విష్ణు అన్నారు. ఆయన నటించిన ఈ చిత్రం విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌లో చిత్ర బృందం పాల్గొంది. సినిమా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ విష్ణు కృతజ్ఞతలు తెలిపారు.
-
చీరలో వయ్యారాల మీనాక్షి చౌదరి!
హీరోయిన్ మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ పిక్ ఇన్‌స్టాలో పంచుకుంది. ఈ బ్యూటీ ఎల్లో కలర్ చీరలో నవ్వుతూ పోజులిచ్చింది. ఈ ఫొటో నెట్టింట వైరలవుతోంది.
-
నటి షఫాలీ జరివాలా మృతి.. కారణం ఇదేనా?
బాలీవుడ్ నటి షఫాలీ జరివాలా మృతికి యాంటీ ఏజింగ్(యవ్వనంగా కనిపించేలా) చికిత్స కారణం కావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆరేళ్లుగా ఈ చికిత్స తీసుకుంటున్నారని… దాని సైడ్ ఎఫ్సక్ట్స్ కూడా మృతికి కారణం అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ట్రీట్మెంట్ నేరుగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేయదని వైద్యులు చెబుతున్నారు.
-
ఆకట్టుకునేలా ‘ఆల్ ఇండియా ర్యాంకర్స్’ ట్రైలర్
జోసెఫ్ క్లింటన్ దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ వెబ్‌సిరీస్ ‘AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్’. హర్ష రోషన్, భాను ప్రకాశ్, జయతీర్థ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జులై 3వ తేదీ నుంచి తెలుగు ఓటీటీ ‘ఈటీవీ విన్’లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చక్కటి వినోదాన్ని పంచింది.
-
AIR ‘#90s’ను దాటే సిరీస్ అవుతుంది: నటుడు శివాజీ
‘AIR:ఆల్ ఇండియా ర్యాంకర్స్’ అని అనుకున్నప్పుడే ఇది ‘#90s’దాటి మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం కలిగిందని నటుడు శివాజీ అన్నారు. జోసెఫ్ క్లింటన్ దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్ సిరీస్ ఇది. హర్ష రోషన్, భాను ప్రకాశ్, జయతీర్థ కీలక పాత్రలు పోషించారు. జులై 3 నుంచి ‘ఈటీవీ విన్’లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో శివాజీ మాట్లాడారు.
-
వారికి హీరోయిన్ సమంత సవాల్!
నటి సమంత చిక్కిపోయారని ఇటీవల కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఆమె తాజాగా స్పందిస్తూ.. నెటిజన్లకు ఓ సవాలు విసిరారు. ఇన్‌స్టాలో పుల్ అప్స్ చేస్తూ వీడియో షేర్ చేశారు. ‘‘డీల్ కుదుర్చుకుందాం.. ఇందులో చూపించిన విధంగా మీరు కనీసం మూడు పుల్‌అప్స్ చేసేవరకూ ఏ చెత్త కామెంట్స్ నాపై చేయొద్దు. పుల్‌అప్స్ మీరు చేయలేకపోతే ఇకపై ఆ విధంగా మాట్లాడకండి’’ అని రాసుకొచ్చారు.
-
నాని ‘ది ప్యారడైజ్’పై బిగ్ అప్‌డేట్!
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న మూవీ ‘ది ప్యారడైజ్’. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాపై మేకర్స్ తాజాగా అప్‌డేట్ ఇచ్చారు. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ సెట్స్‌లోకి నాని అడుగుపెట్టినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ధగడ్ ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో చేరారు’ అని తెలుపుతూ షేర్ చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో పోస్ట్ వైరల్ అవుతోంది.
-
మెరిసే అందం అలియా సొంతం!
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తాజాగా సోషల్‌మీడియాలో షేర్ చేసిన పిక్ వైరలవుతోంది. ఇందులో ఆమె పింక్ డ్రెస్‌లో ఆకట్టుకునేలా కనిపిస్తోంది.
-
‘కన్నప్ప’ మూవీ HD ప్రింట్ లీక్!
శుక్రవారం విడుదలైన మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీ పైరసీ బారిన పడింది. తొలుత లీక్‌ల బెడదతో ఇబ్బందిపడగా, తాజాగా ఈ మూవీ HD ప్రింట్ ఆన్‌లైన్‌లో లీకైంది. రిలీజైన ఒక్కరోజులోనే ఆన్‌లైన్‌లో సినిమా ప్రత్యక్షమవడంతో నిర్మాతలు షాకయ్యారు. దీంతో లీక్ చేసిన వారిపై చిత్రయూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అటు పైరసీపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ అభిమానులు కోరుతున్నారు.