శుక్రవారం విడుదలైన మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీ పైరసీ బారిన పడింది. తొలుత లీక్‌ల బెడదతో ఇబ్బందిపడగా, తాజాగా ఈ మూవీ HD ప్రింట్ ఆన్‌లైన్‌లో లీకైంది. రిలీజైన ఒక్కరోజులోనే ఆన్‌లైన్‌లో సినిమా ప్రత్యక్షమవడంతో నిర్మాతలు షాకయ్యారు. దీంతో లీక్ చేసిన వారిపై చిత్రయూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అటు పైరసీపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ అభిమానులు కోరుతున్నారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
Video: ఛానెల్‌పై దాడి.. తీవ్ర ఆందోళనలో హీరో
టాలీవుడ్ నటుడు సుహాస్ తీవ్ర ఆందోళనకు గురైయ్యాడు. ఆయన హీరోగా నటిస్తున్న సినిమా ‘ఓ భామ అయ్యో రామ’. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సుహాస్ ఓ న్యూస్ ఛానెల్ ఆఫీస్‌కు వెళ్లాడు. అదే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఛానెల్‌పై దాడికి పాల్పడగా, సుహాస్ ఈ ఘటనతో తీవ్రంగా ఆందోళనకు గురయ్యాడు. వీడియో కోసం ClickHere.
-
‘దిల్ రాజు డ్రీమ్స్’ వేడుకకు ముఖ్య అతిథిగా రౌడీ హీరో
కొత్త ప్రతిభను సినీ పరిశ్రమకు పరిచయం చేయాలనే లక్ష్యంతో నిర్మాత దిల్ రాజు తాజాగా ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. ఈరోజు సాయంత్రం నుంచి ఇది అందుబాటులోకి రానుంది. అయితే ఈ వెబ్‌సైట్ లాంఛ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లో జరుగుతుండగా.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హీరో విజయ్ దేవరకొండ రాబోతున్నాడు. ఈ విషయాన్ని దిల్ రాజు బ్యానర్ ప్రకటించింది.
-
రియల్ లైఫ్‌లో నా హీరోలు వీరే: నాగచైతన్య
హీరో నాగచైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు నచ్చిన రియల్ లైఫ్ హీరోల గురించి మాట్లాడారు. ‘‘నిజ జీవితంలో కొంతమంది వ్యక్తులను హీరోలుగా చూస్తుంటాం. రతన్ టాటా అంటే నాకెంతో గౌరవం. ఆయన్ని ఒక స్ఫూర్తి ప్రదాతగా భావిస్తా. ఎలాన్ మస్క్ జీవిత ప్రయాణం ఆశ్చర్యపరుస్తుంటుంది. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలాన్.. టాలీవుడ్‌లో దర్శకుడు రాజమౌళి అంటే నాకెంతో అభిమానం’’ అని చైతన్య తెలిపారు.
-
‘కన్నప్ప’పై ఆర్జీవీ మెస్సేజ్.. కన్నీటి పర్యంతమైన విష్ణు
మంచు విష్ణు ప్రధానపాత్రలో నటించిన ‘కన్నప్ప’ నిన్న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ చూసిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ .. సినిమాపై తన అభిప్రాయాన్ని మెస్సేజ్ ద్వారా మంచు విష్ణుతో పంచుకున్నాడు. అయితే ఆ స్క్రీన్‌షాట్‌ను మంచు విష్ణు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యాడు. ఆర్జీవీ మెస్సేజ్‌తో ఒక నటుడిగా తన కల సాకారం అయినట్లు ఆయన పేర్కొన్నాడు.
-
‘కన్నప్ప’ థ్యాంక్స్ మీట్!
మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ మూవీ శుక్రవారం రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈనేపథ్యంలో మేకర్స్ నేడు సా.5గంటలకు థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేయనున్నారు.
-
ఒకే ఫ్రేమ్‌లో అక్కినేని కోడళ్లు
అక్కినేని కోడళ్లు శోభిత- జైనబ్ సింగిల్ ఫ్రేమ్‌లో కనిపించారు. బ్లాక్ అండ్ వైడ్ ఫిల్టర్‌లో ఉన్న ఈ ఫొటో క్యూట్‌గా ఉంది. శోభిత.. నాగచైతన్య భార్య కాగా, జైనబ్.. అఖిల్ భార్య.
-
ఈ వీకెండ్‌లో అలరించే సినిమాలు, సిరీస్‌లివే!
ఈ వీకెండ్‌లో పలు సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో అలరిస్తున్నాయి. మరి ఏ ఓటీటీలో ఏ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయే చూద్దాం.
- నెట్‌ఫ్లిక్స్: ‘రైడ్ 2’, ‘స్వ్కిడ్‌గేమ్3’ (సిరీస్)
- సన్‌నెక్ట్స్: ‘ది వ్రెడిక్ట్ ’, ‘ఒక పథకం ప్రకారం’
- అమెజాన్ ప్రైమ్: ‘23’
- జీ5: ‘మామన్’
- జియో హాట్‌స్టార్: ‘మిస్టరీ’ (సిరీస్)
-
గొప్ప మనసు చాటుకున్న హీరోయిన్ త్రిష
హీరోయిన్ త్రిష గొప్ప మనసు చాటుకుంది. చెన్నైకి చెందిన ‘పీపుల్ ఫర్ కెటిల్ ఇన్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి గుడికి ఏనుగును బహూకరించింది. అరుప్పుకోట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వ వినాయకర్ ఆలయానికి ‘గజ’ అనే యాంత్రిక ఏనుగును ఆమె బహుమతిగా ఇచ్చారు. ఆలయ వేడుకల కోసం ఏనుగును బహూకరించడం తమిళనాడులో ఇదే తొలిసారి. దీంతో త్రిషపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
-
‘బాంబు’ టీజర్.. పడిపడి నవ్వాల్సిందే!
తమిళ నటుడు అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బాంబు’. ఈ సినిమాకు విశాల్ వెంకట్ దర్శకత్వం వహిస్తుండగా.. రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. హిలేరియస్‌గా సాగిన ఈ టీజర్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది.