Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • దిల్‌రాజు డ్రీమ్స్.. అనిల్ రావిపూడి ఏమన్నారంటే?

    సినీ నిర్మాత దిల్‌రాజు అందరికీ సుపరిచితులే. 50కిపైగా సినిమాలు నిర్మించిన ఆయన.. తాజాగా ‘దిల్‌రాజు డ్రీమ్స్’ అనే పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. యువ ఫిల్మ్ మేకర్ల కోసం ఆయన ఈ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేశారని, ఉత్సహవంతులు ఎవరైనా సరే సినిమాకు సంబంధించిన విషయాలను ఆ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయాలని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. దీనిద్వారా సినిమాల్లో అవకాశాలు పొందొచ్చని పేర్కొన్నారు.

  • మైథలాజికల్‌ లుక్‌లో ప్రభాస్‌!

    ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్‌ లాంగ్‌ హెయిర్‌తో రుద్ర క్యారెక్టర్‌లో కనిపించారు. అయితే, గత మూడేళ్లుగా జూన్‌లో రిలీజయ్యే సినిమాల్లో ప్రభాస్‌ మైథలాజికల్‌ లుక్స్‌లోనే కనిపిస్తున్నారు. ఆదిపురుష్‌లో ‘రాముడి’గా ఆ తర్వాత రిలీజైన కల్కిలో ‘కర్ణుడి’ గా ఇప్పుడు ‘రుద్రుడి’గా మెప్పించారు. కాగా, ప్రస్తుతం ప్రభాస్‌ రాజాసాబ్‌, ఫౌజీ సినిమాల్లో నటిస్తున్నారు.

     

  • ఈ సినిమా ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లాప్!

    ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ ప్లాప్ మూవీగా చరిత్రకెక్కింది. ఆ సినిమా పేరు ‘The 13th Warrior’. రూ.1300కోట్లతో తెరక్కిన ఈ సినిమా రూ.500కోట్లు వసూలు చేసి ప్రపంచస్థాయిలో ఫెయిలైన భారీ సినిమాగా నిలిచింది. నిర్మాతలకు దాదాపు రూ.800 కోట్లు నష్టాన్ని తెచ్చిపెట్టింది. జాన్ మెక్‌టెర్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆంటోనియో బాండెరాస్ హీరోగా నటించారు.

     

  • ‘కన్నప్ప’ మూవీపై రెచ్చిపోయిన ప్రేక్షకుడు

    మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా ‘కన్నప్ప’. ఈ మూవీపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. ఓ థియేటర్‌లో ‘కన్నప్ప’ను వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షకుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది అసలు సినిమానే కాదని, ఏమీ అర్థం కావడం లేదని అన్నారు. తనకు రూ.5లక్షలు ఇచ్చి ఉంటే ‘కన్నప్ప’ను ఇంతకంటే బెటర్‌గా తీసేవాడినని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

  • ఒక్క పాట పాడితే రూ.3 కోట్లు ఛార్జ్

     భారతీయ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. మనలో చాలా మందికి ఏఆర్ రెహ్మాన్​ అనగానే మంచి సంగీత దర్శకుడు అని తెలుసు. ఆయన చేసిన పాట ఆస్కార్ అవార్డు​ సైతం అందుకున్నారు. అయితే, ఆయన అరుదుగా పాటలు పాడుతుంటారు. ఇలా ఆయన పాడిన ఒక్క పాటకు సుమారు రూ. 3 కోట్ల వరకు తీసుకుంటారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

  • చనిపోయేంత వరకు అలాగే ఉండాలనుకుంటున్నా.. షఫాలీ వీడియో వైరల్

    కాంటా లగా’ సాంగ్‌ ఫేమ్‌, నటి షఫాలీ జరివాలా మరణం అనంతరం ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరాస్ ఛబ్రా ఇంటర్వ్యూలో షఫాలీ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచం మొత్తంలో ఒకే కాంటా లగా’ అమ్మాయి ఉంది. అది నేనే. నేను చనిపోయే వరకు ‘కాంటా లగా’ అమ్మాయిలాగానే ప్రజలకు గుర్తుండిపోవాలని అనుకుంటున్నాను’’ అని షఫాలీ అన్నారు.

  • కన్నప్పలో పెళ్లి డైలాగ్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ రచ్చ

    మంచు విష్ణు న్యూ మూవీ ‘కన్నప్ప’ హిట్ టాక్‌తో నడుస్తోంది. ఈ సినిమాలో రుద్ర పాత్రలో ప్రభాస్‌ చెప్పిన డైలాగులకు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా రుద్ర, కన్నప్ప మధ్య జరిగే సంభాషణలో పెళ్లి టాపిక్‌ వస్తుంది. ‘నీకు పెళ్లి అయిందా? అని రుద్రను కన్నప్ప అడుగుతాడు. నా పెళ్లి గురించి ఎందుకులే’ అని ప్రభాస్‌ చెప్పడంతో ఫ్యాన్స్‌ గోలగోల చేస్తున్నారు.

     

  • నటి షఫాలీ మృతిపై పోలీసులు ఏమన్నారంటే?

    ‘కాంటా లగా’ సాంగ్‌ ఫేమ్‌, నటి షఫాలీ జరివాలా(42) మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ‘‘షఫాలీ మృతదేహం అంధేరిలోని ఆమె నివాసంలో లభ్యమైంది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కూపర్ ఆస్పత్రికి తరలించాం. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు’’ అని పోలీసులు తెలిపారు.

  • ‘ది ఫ్యామిలీమ్యాన్‌3’ గ్లింప్స్‌ రిలీజ్‌..

    భారత్‌లో అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న వెబ్‌సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీమ్యాన్‌’ ఒకటి. ఇప్పటివరకూ రెండు సీజన్లు అలరించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ సిరీస్‌ ముచ్చటగా మూడోసారి అలరించడానికి సిద్ధమైంది. మనోజ్‌ బాజ్‌పాయ్‌ కీలక పాత్ర పోషించగా.. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో ‘ఫ్యామిలీమ్యాన్‌: సీజన్‌3’   షూటింగ్‌ పూర్తయింది.తాజాగా ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ సిరీస్‌ గ్లింప్స్‌ను మేకర్స్  రిలీజ్‌ చేశారు.

     

  • ది రాజా సాబ్ ..క్లైమాక్స్ అప్డేట్

    ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ సినిమా  టీజర్‌ను మేకర్స్ ఇటీవల విడుదల చేయగా.. అద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, తాజాగా ది రాజా సాబ్ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా  క్లైమాక్స్ ఎక్కడ చిత్రీకరిస్తున్నారో తెలియాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.