Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ఫౌజీ సెట్స్‌లో ప్రభాస్‌.. పిక్‌ వైరల్‌

    హీరో ప్రభాస్‌ ‘ఫౌజీ’ మూవీ సెట్స్‌లో జాయిన్‌ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫోటోలో ఆయన స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్‌ లుక్‌ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

  • ఇండస్ట్రీ హిట్.. ‘కన్నప్ప’ కొత్త పోస్టర్‌ విడుదల

    మంచు విష్ణు హీరోగా రూపొందిన ‘కన్నప్ప’ సినిమా.. థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో దసుకుపోతోంది. దీంతో ఈ సినిమా ‘ఇండస్ట్రీ హిట్’ అంటూ మూవీ టీమ్ పోస్టర్‌ను విడుదల చేసింది.

  • విజయ్‌ దేవరకొండకు మాటిచ్చిన రష్మిక..

    స్టార్ హీరోయిన్ రష్మిక తాజాగా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ ‘మైసా’. తాజాగా ‘మైసా’ పోస్టర్‌ను నటుడు విజయ్ దేవరకొండ షేర్ చేశారు. దాన్ని రీషేర్‌ చేస్తూ రష్మిక ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చారు. ‘‘విజ్జూ.. నువ్వు గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా’’ అంటూ రాసుకొచ్చారు.

  • టాలెంట్‌ చూపించిన ప్రీతి..!

    మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కన్నప్ప’ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే, ఈ సినిమాలో నటించిన హీరోయిన్‌ ప్రీతి ముకుందన్‌ పేరు నెట్టింట మార్మోగుతోంది. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన ప్రీతి గతంలో శ్రీవిష్ణుతో ‘ఓం భీమ్‌ బుష్‌’, తమిళంలో ‘స్టార్‌’ సినిమాల్లో నటించారు. అయితే, ఇవి అంతగా ఆడలేదు. కన్నప్పలో తన టాలెంట్‌తో అభిమానులను సొంతం చేసుకున్నారు.

  • రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా..

    ప్రముఖ హీరోయిన్ ఇలియానా మరోసారి తల్లయ్యారు. జూన్‌ 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు ఇలియానా తెలిపారు. ఆ చిన్నారికి  ‘కీను రఫే డోలన్’ అని పేరు పెట్టారు. ఈ మేరకు ఓ క్యూట్‌ ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్‌ చేశారు.

  • తెలుగు డైరెక్టర్‌తో.. ఆమీర్‌ ఖాన్‌ సినిమా?

    టాలీవుడ్‌ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లితో బాలీవుడ్‌ హీరో ఆమీర్‌ ఖాన్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీని దిల్‌ రాజు నిర్మించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు తమిళ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తోనూ ఆమీర్‌ ఓ మూవీ చేయనున్నారు. ఆ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ ప్రొడ్యూస్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

     

  • ఆలయానికి యాంత్రిక ఏనుగును బహూకరించిన త్రిష

    ప్రముఖ సినీనటి త్రిష చెన్నైకి చెందిన పీపుల్‌ ఫర్‌ క్యాటిల్‌ ఇండియా(PFCI) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి అరుప్పుకోట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్‌ ఆలయానికి ‘గజ’ అనే యాంత్రిక ఏనుగును బహూకరించారు. దీనిని సంప్రదాయ మంగళవాద్యాల మధ్య అందజేసినట్లు PFCI నిర్వాహకులు తెలిపారు. ఆలయ వేడుకల కోసం యాంత్రిక ఏనుగును బహూకరించడం తమిళనాడులో ఇదే తొలిసారి.

  • హీరోయిన్ ఆదాశర్మ ఆసక్తికర పోస్ట్

    హీరోయిన్ ఆదాశర్మ తన తరువాత సినిమాపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ మేరకు ‘నేను తరువాత హారర్ సినిమాకి సంతకం చేయాలా?’ అని ప్రశ్నించారు. దీంతో తన నెక్స్ట్ సినిమా హారర్ కథాంశంతో వస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో గోస్ట్ లకు సంబంధించిన ఓ వీడియోను హీరోయిన్ ఆదాశర్మ షేర్ చేశారు.

  • గుండెపోటుతో నటి కన్నుమూత

    ‘కాంటా లగా’ వీడియో సాంగ్‌ ఫేమ్‌, నటి షఫాలీ జరివాలా (42) గుండెపోటుతో మరణించారు. ఇంట్లో ఉండగా ఆమె అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆమె భర్త నటుడు పరాగ్‌ త్యాగి అంధేరిలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. హిందీలో ముజ్సే షాదీ కరోగి, కన్నడలో హుడుగురు వంటి సినిమాలతో పాటు సీరియళ్లు, వెబ్ సిరీస్లలో నటించారు. హిందీ బిగ్ బాస్-13లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.

  • కొరియన్ డ్రామాలో అనుష్క.. ఫస్ట్ ఇండియన్ హీరోయిన్‌గా రికార్డు

    బ్యూటీఫుల్ అనుష్కా సేన్ కొరియన్ మూవీలో నటిస్తున్న తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించింది. ఇండో-కొరియన్ ఎంటర్‌టైన్మెంట్ రంగంలో కొత్త ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ చేస్తోంది. కాగా అనుష్క.. లీ జంగ్-సబ్ దర్శకత్వంలో వస్తున్న కొరియన్ చిత్రం ఆసియాలో కనిపించనుంది. ‘క్రష్’ అనే స్పిన్-ఆఫ్ సిరీస్‌లో కూడా భాగమవుతోంది. అంతేకాదు సియోల్, బుసాన్‌లలో భారీ బిల్‌బోర్డ్‌లపై కనిపించిన మొదటి భారతీయ సెలబ్రిటీగా 22 ఏళ్ల అనుష్క నిలిచింది.