బాలీవుడ్ టూ హాలీవుడ్ ఓ ఊపు ఊపేసిన ప్రియాంక చోప్రా లేటెస్ట్ ఫొటోషూట్ వైరల్ అవుతోంది. ఇందులో ఆమె సిల్వర్ కలర్ డ్రెస్‌లో ఎంతో గ్లామర్‌గా కనిపిస్తోంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
రజనీ ‘జైలర్-2’లో బాలీవుడ్ స్టార్ హీరో!
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరెకెక్కిస్తోన్న చిత్రం ‘జైలర్-2’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్ గెస్ట్ రోల్ చేయనున్నట్లు టాక్. ఆయన 15నిమిషాల పాటు కనిపించనున్నారట. అయితే ఇందులో ఆయన పాత్ర భారీ యాక్షన్ సన్నివేశాలతో ఉండనున్నట్లు తెలుస్తోంది. సినిమా మొత్తానికే ఆమిర్ ఉన్న సీన్స్ హైలెట్‌గా నిలువనున్నాయని సమాచారం.
-
Video: ‘దంగల్’పై నిషేధం.. పాక్ మంత్రి విచారం!
పాకిస్థాన్‌లో బాలీవుడ్ సినిమా ‘దంగల్’ విడుదలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో మంత్రి హోదాలో ‘దంగల్’ విడుదలకు తాను అనుమతి ఇవ్వకపోవడంపై పాక్ సీనియర్ మంత్రి మరియం ఔరంగజేబ్ తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. వీడియో కోసం ClickHere.
-
IAS అవ్వబోయి హీరోయిన్.. ఎవరంటే?
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్‌గా దూసుకుపోతున్నవారిలో చాలామంది అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చినవారే. హీరోలు, హీరోయిన్లు అవ్వకపోతే ఏ డాక్టరో, కలెక్టరో అవ్వాలనుకున్నవారు చాలా మంది ఉన్నారు. అలాంటివారిలో ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా ఒకరు. చదువులో చురుకైన విద్యార్థిగా ఉన్న ఆమె.. హీరోయిన్ అవ్వాలని అనుకోలేదు. బాగా చదువుకుని ఐఏఎస్ అవ్వాలనుకుంది. కానీ ఆమె ప్రయాణం అనుకోకుండా ఇండస్ట్రీ వైపు టర్న్ తీసుకుంది.
-
‘ఫెంటాస్టిక్ ఫోర్’.. ఆసక్తిగా హాలీవుడ్ మూవీ ట్రైలర్
మార్వెల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ అనే హాలీవుడ్ చిత్రం జులై 25న విడుదలకానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇది మార్వెల్ మొదటి సూపర్ హీరో కుటుంబానికి, గ్రహాలను మింగేసే గెలాక్టస్‌కి మధ్య జరగబోయే భీకర పోరాటం ఈ సినిమాలో చూపించనున్నారు. ఫైట్స్, విజువల్స్ చూస్తే ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేలా కనిపిస్తోంది.
-
ఈమూవీ తమిళ్ కంటే తెలుగులోనే..!: విజయ్ ఆంటోనీ
విజయ్ ఆంటోనీ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మార్గన్’. లియో జాన్‌పాల్ దర్శకుడు. రేపు ఈ మూవీ తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్‌కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇందులో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ఉన్న సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. తమిళంలో కంటే తెలుగులో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.
-
పవన్‌కు ‘కన్నప్ప’ ఎప్పుడు చూపిస్తారు?: విష్ణు సమాధానమిదే!
‘కన్నప్ప’ మూవీ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న హీరో మంచు విష్ణు.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పవన్ కల్యాణ్‌కు ఈసినిమా ఎప్పుడు చూపిస్తారు? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘విడుదలైన వెంటనే ఆయన సమయం తీసుకుని వ్యక్తిగతంగా కలిసి సినిమా చూపిస్తా. నటుడిగా ఆయన నాకు సీనియర్. ఆయన ప్రశంసలు వస్తాయా? రావా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని సమాధానమిచ్చారు.
-
గ్లామరస్ లుక్‍లో మీనాక్షి చౌదరి!
టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ ఫొటోను SMలో పంచుకుంది. ఇందులో ఈ బ్యూటీ రెడ్ కలర్ డ్రెస్‌లో గ్లామరస్ లుక్‍తో మెరిసిపోతోంది.
-
ఎమోషనల్‌గా సిద్ధార్థ్ ‘3BHK’ ట్రైలర్
సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘3BHK’. జులై 4న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. ఈ సందర్భంగా మేకర్స్ తమిళ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక మధ్యతరగతి కుటుంబం సొంత ఇల్లు కొనడానికి పడే పాట్లను, కలలను ఆవిష్కరించే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతుందని తెలుస్తోంది. ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
-
విజయ్ దళపతి చివరి సినిమా రెమ్యునరేషన్ ఎంతంటే?
రాజకీయ రంగ ప్రవేశం చేసిన సౌత్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలు వదిలేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం తన చివరి సినిమా ‘జన నాయగన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం విజయ్ భారీ పారితోషికం తీసుకుంటున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. విజయ్ ఈ సినిమా కోసం దాదాపు రూ.275కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.