Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • నానితో నటించడంపై కోమలి ప్రసాద్‌ ఆసక్తికర కామెంట్స్!

    ‘హిట్‌ 3’ చిత్రంలో నానితో సహాయక పాత్ర పోషించడంపై నటి కోమలి ప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ సినిమాలో నటించినందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఒక స్టార్ హీరోతో కలిసి పోలీస్‌ పాత్రలో కనిపించడం చాలా గొప్ప విషయమని.. అలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయని పేర్కొంది. అయితే ఇకపై విభిన్నమైన పాత్రలు, యాక్షన్ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నానని కోమలి ప్రసాద్‌ వెల్లడించింది.

  • ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ టీజర్‌ రిలీజ్‌

    జాన్వీ కపూర్‌, వరుణ్‌ ధావన్‌ జంటగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’. ఓ యువ జోడీ ప్రేమ ప్రయాణం నేపథ్యంలో శశాంక్‌ ఖైతాన్‌ తెరకెక్కిస్తున్నారు. దసర కానుకగా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానున్నట్లు టీజర్‌ ఆధారంగా అర్థమవుతోంది.

  • చిరంజీవి కోసం మహిళా అభిమాని సైకిల్ యాత్ర

    మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదోనికి చెందిన రాజేశ్వరి అనే మహిళ.. చిరుపై అభిమానంతో ఆదోని నుంచి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర చేశారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. రాజేశ్వరిని కలిశారు. ఆమెకు చీరను బహుకరించి.. ఆమెకు ఆర్థిక సాయం కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మెగాస్టార్ టీమ్ పంచుకుంది.

  • నిశ్చితార్థం చేసుకున్న హీరో విశాల్

    తమిళ స్టార్ హీరో విశాల్ నిర్చితార్థం తన ప్రియురాలు, హీరోయిన్ సాయి ధనికతో జరిగింది. ‘‘నా పుట్టిన రోజు సందర్భంగా నన్ను ఆశీర్వదిస్తూ విషెస్ తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజునే కుటుంబసభ్యులు, బంధువుల మధ్య సాయి ధనికతో నాకు నిశ్చితార్థం జరిగింది. ఎప్పటిలాగే మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఉండాలని కోరుకుంటున్నా’’ అని విశాల్ ట్వీట్ చేశారు.

  • నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. మ్యాష్‌అప్‌ వీడియో చూశారా!

    టాలీవుడ్‌లో ఎంతోమంది హీరోలున్నప్పటికీ గ్రీకువీరుడు, మన్మధుడు, కింగ్‌ అనగానే గుర్తొచ్చేది మాత్రం నాగార్జుననే. 66 ఏళ్ల వయసులోనూ భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వరుస సినిమాలతో అలరిస్తున్నాడీ హీరో. నేడు ఈ అక్కినేని హీరో పుట్టినరోజు సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌ ఓ స్పెషల్‌ మ్యాష్‌అప్‌ వీడియోను విడుదల చేసింది. ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాల్లోని కొన్ని పాత్రల ఫేమస్‌ డైలాగులతో చేసిన ఈ వీడియో వైరలవుతోంది.

  • జనసమూహంలో బిక్కుబిక్కుమన్న జాన్వీ కపూర్

    ముంబైలోని లాల్ బాగ్చా రాజా గణేశుడిని నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. వారు ఆలయాన్ని సందర్శించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఒక ప్రత్యేక క్లిప్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియోలో జాన్వీకపూర్ జనసమూహంలో అసౌకర్యంగా కనిపిస్తోంది. ఆమె ముఖంలో భయం కనిపించింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

  • యాంకర్ లోబోకు జైలు శిక్ష

    యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు జైలు శిక్ష పడింది. 2018లో లోబో కారు నడుపుతూ హైదరాబాద్ వస్తుండగా జనగామ జిల్లా నిడిగొండ వద్ద ఆటోను ఢీకొట్టాడు. దీంతో ఆటోలో ఉన్న మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా లోబోకు జనగామ కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది.

  • బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న మంచు మనోజ్

    HYD: బాలాపూర్ గణేశ్‌ను నటుడు మంచు మనోజ్ దర్శించుకుని పూజలు చేశారు. దాదాపు రూ.2 కోట్లతో వేసిన ఆలయ సెట్ అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. గణపతి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు చెప్పారు. తాను నటించిన ‘మిరాయ్’ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు మనోజ్ తెలిపారు.

  • లేడీ డాన్‌గా మారిన హీరోయిన్!

    హీరోయిన్ అదాశర్మ ‘హాతక్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ వదిలారు. ఇందులో ఆదా పవర్ ఫుల్ లుక్‌తో కనిపించింది. ఈమూవీలో ఆమె లేడీ డాన్ శివరంజని ఆచార్య పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. (Video)

  • స్టేజీపైనే నటిని అసభ్యంగా తాకిన హీరో

    భోజ్‌పురి సినిమా సూపర్‌ స్టార్‌గా పేరొందిన పవన్‌ సింగ్‌ వివాదంలో చిక్కుకున్నాడు. యూపీ లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో స్టేజీపైనే నటితో అసభ్యంగా ప్రవర్తించాడు. నటి అంజలి మైక్‌లో మాట్లాడుతుండగా ఆమె నడుమును తాకి ఏదో చెప్పారు. అంజలి అసౌకర్యంగా ఫీలైనా పవన్‌ వదల్లేదు. మరోసారి నడుమును తాకి ఇబ్బంది పెట్టారు. దీంతో అతడు క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.