Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • హీరో రామ్‌చరణ్ చేతికి గాయం

    గ్లోబర్ స్టార్ రామ్‌చరణ్ కుడి చేతికి గాయం అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో చరణ్ పాల్గొన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలో రామ్‌చరణ్ తన కుడి చేయిని ముందుకు చాచేందుకు ఇబ్బంది పడ్డారు. మోచేయిని షర్ట్‌తో కవర్ చేసుకునేందుకు ప్రయత్నించారు. ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో చరణ్ చేతికి గాయమైనట్లు తెలుస్తోంది.

  • ‘గుడ్‌వైఫ్‌’ వెబ్‌సిరీస్‌.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌!

    ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘గుడ్‌వైఫ్‌’ వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్‌ తేదీ ఖరారైంది. ఈ సిరీస్‌ జులై 4 నుంచి జియో హాట్‌స్టార్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్‌ కానుంది. ఈ డ్రామా సిరీస్‌లో ప్రియమణి ఒక లాయర్‌ పాత్రలో కనిపించనుంది. ఇది ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది.

  • ‘‘కన్నప్ప’ను తెరకెక్కించడం ఆనందంగా ఉంది’

    మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’. ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం తాజాగా ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఇలాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని రూపొందించడం ఎంతో ఆనందంగా ఉందని దర్శకుడు ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు. సినిమా కోసం టీమ్‌ అందరూ శ్రమించారని చెప్పారు.

  • తెలంగాణ గడ్డపై డ్రగ్స్‌ను సహించేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి

    తెలంగాణ గడ్డపై మాదక ద్రవ్యాలకు చోటు లేదని, డ్రగ్స్‌ను సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. “మేము సామాన్య బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినవాళ్లం. చిరంజీవి కష్టపడి ఆదర్శంగా నిలిచారు. విద్యార్థులు డ్రగ్స్ మహమ్మారికి బలికాకుండా, ఉద్యమ స్ఫూర్తితో నిలబడి, కష్టపడి విజయం సాధించాలి. తెలంగాణ గౌరవాన్ని కాపాడుదాం” అని పిలుపునిచ్చారు.

  • యువత సైనికుల్లా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడాలి: రామ్‌చరణ్‌

    TG: యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమంలో నటుడు రామ్‌చరణ్ యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కోరారు. “డ్రగ్స్ జీవితాలను నాశనం చేస్తాయి. వ్యాయామం, మంచి స్నేహాలు, విజయం, కుటుంబంతో గడిపే సమయం నిజమైన ఆనందాన్నిస్తాయి” అని అన్నారు. గతంలో స్కూళ్లదగ్గర డ్రగ్స్ అమ్మకాలు జరిగిన సంఘటనలను గుర్తుచేస్తూ, తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల కృషిని ప్రశంసించారు. యువత సైనికుల్లా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

  • నటి లయ కూతురును చూశారా?

    నటి లయ కూతురు శ్లోక పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. దానికి సంబంధించిన ఫోటోలను లయ సోషల్‌‌మీడియాలో షేర్‌ చేసింది. ‘‘హ్యాపీ బర్త్‌డే మై శ్లోక ప్రిన్సెస్‌.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నా లిటిల్‌ సన్‌షైన్‌కు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అని క్యాప్షన్‌ జోడించింది. ఇది చూసిన అభిమానులు లయ కూతురికి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తున్నారు.

  • ఇండ‌స్ట్రీ నుంచి బ‌హిష్క‌రిస్తాం: నిర్మాత దిల్ రాజు

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకంపై ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కఠిన హెచ్చరిక జారీ చేశారు. డ్రగ్స్ తీసుకునే వారిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఇలాంటి బహిష్కరణ విధానం అమలవుతున్న నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీలోనూ త్వరలో ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

  • నార్త్ అమెరికాలో ‘కుబేర’ జోరు!

    ధనుష్, నాగార్జున, రష్మిక కీలక పాత్రల్లో నటించిన ‘కుబేర’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్లు రాబడుతోంది.ఇక యూఎస్ మార్కెట్‌లో నేటికు బ్రేకీవెన్ రీచ్ అయినట్లు డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. నార్త్ అమెరికాలో ‘కుబేర’కు ఇక నుంచి మొత్తం లాభాలే అని చెప్పవచ్చు. ఇప్పటికే 2 మిలియన్ మార్క్ దగ్గరలో ఉన్న ఈ సినిమా శేఖర్ కమ్ముల నుంచి మరో 2 మిలియన్ గ్రాసర్ గా నిలిచింది.

  • యువతకు విజయ్ శక్తివంతమైన సందేశం!

    TG: యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి నటుడు విజయ్ దేవరకొండ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా యువతకు శక్తివంతమైన సందేశాన్ని అందించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండి, విజయవంతమైన జీవితాన్ని నిర్మించుకోవాలని కోరారు. “డ్రగ్స్ సమయాన్ని వృథాచేసి, మీ జీవితాన్ని నాశనంచేస్తాయి. బదులుగా,వ్యాయామం చేయండి, ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్మించుకోండి, మంచిస్నేహితులను సంపాదించండి, విజయాన్ని, ధనాన్ని, ఆశయాలను సాధించండి” అని అన్నారు.

  • ‘కన్నప్ప-2’.. మంచు విష్ణు ఏమన్నారంటే?

    మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘కన్నప్ప’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల సందర్భంగా తాజాగా చిత్రబృందం ప్రెస్‌మీట్‌లో పాల్గొంది. ఈ మేరకు మీడియా అడిగిన ప్రశ్నలకు మంచు విష్టు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఆ వీడియో మీరూ చూసేయండి.